Director Prashanth Varma Wife Details: హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా హాట్‌టాపిక్ అయ్యాడు యంగ్ అండ్ టాలంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ప్రశాంత్ వర్మ గురించే మాట్లాడుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో అయతే ఆయనను పొగుడుతూ వీడియోలు, రీల్స్ దర్శనం ఇస్తున్నాయి. తన సినిమాటిక్ యూనివర్స్‌తో సినీ ప్రియులను అంతగా ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు అమ్మాయిల క్రష్‌గా కూడా మారిపోయాడు. సోషల్ మీడియాలో పేజీలో ఎక్కడ చూసి ప్రశాంత్ వర్మ ఫ్యాన్ గర్ల్ అంటూ అమ్మాయిల పేజీలు పుట్టుకొస్తున్నాయి. తమ కలల రాకుమారుడు ఇలానే ఉండాలంటూ ప్రశాంత్ వర్మ వీడియోలు షేర్ చేస్తున్నారు.
యంగ్ లుక్‌లో కనిపిస్తున్న ప్రశాంత్ వర్మ ఇంకా సింగిల్ అనే అనుకుంటున్నారంతా. కానీ తాజాగా జరిగిన హనుమాన్ సక్సెస్ మీట్ ప్రశాంత్ అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. మూవీ ఈవెంట్‌లో తన భార్యను పరిచయం చేసి షాకిచ్చాడు. అదీ చూసి అమ్మాయిలంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో బాక్సాఫీసు వద్ద హనుమాన్ దుమ్మురేపుతుంది. విడుదలై మూడు వారాలు దాటినా ఇంకా థియేటర్లో హనుమాన్ జోరు కొనసాగుతుంది. ఇప్పిటికీ వీకెండ్స్ హనుమాన్ థియేటర్లు హౌజ్‌ఫుల్ చూపిస్తున్నాయి. అంతగా ప్రేక్షకులను హనుమాన్‌తో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హనుమాన్ మూవీ ఇప్పటికే మేకర్స్‌ను భారీ లాభాల్లో పడేసింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో హనుమాన సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
భార్య అంటూ షాకిచ్చిన ప్రశాంత్ వర్మ
ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా ఈ జర్నీలో తనకు అండగా నిలిచి సపోర్టు ఇచ్చిన నా భార్య సుకన్యకు థ్యాంక్స్ అంటూ చెప్పడంతో ప్రతి ఒక్కరు అవాక్కాయ్యారు. అతడికి పెళ్లయిపోయిందని, అందమైన భార్య ఉందని అప్పుడే అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మాయిల గుండె పగిలిపోయిందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ భార్య ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. ఈ దెబ్బతో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ భార్య చాలా అందంగా ఉందని, ఇద్దరు ఈడుజోడు బాగుందంటూ ఇద్దరి ఫొటోలను కలిసి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ పెద్దలు కుదిర్చిన వివాహమేనట. పాలకొల్లుకు చెందిన ప్రశాంత్ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అంటే లాక్‌డౌన్ టైంలో అతడి పెళ్లయినట్టు తెలుస్తోంది. అప్పటి అతడు చిన్న డైరెక్టర్ కావడంతో ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు. దీంతో ఇప్పటి వరకు అతడు సింగిల్ అని అంతా అభిప్రాయపడ్డారు. కాగా ప్రశాంత్ వర్మ డైరెక్టర్‌గా కంటే ముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో షార్ట్ ఫిలింస్ చేస్తూ డైరెక్టర్‌గా మారాడు. ఈ క్రమంలో నాని నిర్మించిన 'అ!' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఈ మూవీ పెద్దగా విజయం సాధించకపోయినా కథలో కొత్తదనం ఉందంటూ అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 'కల్కి', 'జాంబీరెడ్డి' చిత్రాలతో ఇండస్ట్రీకి కొత్త జానర్లను పరిచయం చేసి టాలంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అదే క్రేజ్‌తో సూపర్ హీరో జానర్‌తో 'హనుమాన్' తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఏకంగా సినిమాటిక్ యూనివర్స్‌నే క్రియేట్ చేయబోతున్నాడు.