గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 18th Today Episode 583)


జగతి మేడం,నేను ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టం అని రిషి అడిగితే..జగతి మేడం నాకు ఇష్టం సర్ కానీ మీరే నా జీవితం. నా జీవితమంతా మీతో కొనసాగాలనుకుంటున్నాను అలాంటప్పుడు మీరు నేను వేర్వేరు ఎందుకు అవుతుంది అని అంటుంది. 
రిషి: అన్ని విషయాల్లోనే సరిగానే ఉంటావు కానీ ఆ ఒక్క విషయం దగ్గర ఎందుకు ఆగిపోతావ్ వసుధార నువ్వా గురుదక్షిణ ఒప్పందం తీసుకోవడం నాకు ఇష్టం లేదు మానేయొచ్చు కదా
వసు: మీరే తగ్గొచ్చు కదా
రిషి: నువ్వు ఇంక తగ్గవా వసుధార, నువ్వు మారతావ్ అనుకోవడం నా తప్పు. నువ్వు ఇలాగే ఉంటే మనం జీవితంలో కలపి ప్రయాణం చేయలేం
వసు: నేనేం తప్పు చేయడం లేదు సార్..ఇంత మాట ఎలా అంటారు..
రిషి: నువ్వే అనిపిస్తున్నావ్...ఇద్దరి మనుషుల మధ్య అభిప్రాయ బేధాలొస్తాయి కానీ ఎక్కడో దగ్గర పరిష్కారం ఉండాలి కదా. నాతో బలవంతంగా చేయిస్తున్నావ్
వసు: నేను మానేయలేను సార్ నేను నా మాట మీద నిలబడాలి అనుకుంటున్నాను కావాలంటే మీరే తగ్గొచ్చు కదా. జగతి మేడం ని అమ్మ అని పిలవచ్చు కదా అలా పిలిచినంత మాత్రాన మీకు తగ్గేదేముంది నాకు లాభమేమున్నది చెప్పండి మీరేనా ఆలోచించాలి కదా 
నువ్వు మారవని అర్థమైందనన రిషి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.


Also Read: మోనిత చెంప చెళ్లుమనిపించిన దీప, కథ చెప్పిన కార్తీక్ , వారణాసి కోసం శౌర్య ఆరాటం


అదే సమయంలో జగతి-మహేంద్ర లో జరిగిన విషయం అంత గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇందులో మహేంద్ర, రిషి వచ్చాడా అని అడిగితే ఇంకా రాలేదంటుంది జగతి. ఇంతలో ధరణి అక్కడకి వస్తుంది. రిషి ఏమైనా చెప్పాడా అని అడిగితే  లేదు చిన్న అత్తయ్య కానీ ఈ మధ్య దేవయాని అత్తయ్య ప్రవర్తనలో మార్పు వస్తుంది ఈమధ్య చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. తన ప్రవర్తనకి విరుద్ధంగా ఉంటున్నారు ఏవైనా ప్లాన్ చేస్తున్నారేమో..ఇందాక జరిగిన విషయం అంతా చెప్తుంది. దానికి జగతి, మహీంద్రలు ఆలోచనలలో పడి అక్కయ్య ఏదో ప్లాన్ చేస్తున్నారు అందుకే అలా ఉన్నారు అని అనుకుంటారు. అప్పుడు ధరణి, రిషి ఈ రోజు ఇంటికి రానన్నాడట పెద్ద అత్తయ్యకి ఫోన్ చేశాడంటుంది. రిషి ఎంత లేటుగా వస్తే అంత ప్రశాంతంగా ఉంటాడు అంటుంది. ఇంతకీ రిషి ఎక్కడున్నాడు అనుకుంటారు..


రిషి కాలేజ్ కి వెళ్లేసరికి అక్కడ గౌతం ఉంటాడు. గౌతమ్ ని చూసిన రిషి నీకు ఎంత ఇస్తున్నారు నాకు గూఢచారిగా ఉండడానికి అని అడిగితే ఎప్పుడూ ఇలా తల తిక్కగానే మాట్లాడుతున్నావా నేను నీకోసం వచ్చాను అంటాడు గౌతమ్. 
రిషి: నేను ఎవరి జీవితాల్లోకి దూరకుండా హాయిగా నా కాలేజీ నడుపుకుంటూ, నా గతం గురించి ఆలోచించుకుంటూ సాఫీగా గడుపుతున్నాను. అలాంటి నా జీవితంలోకి ముందు సాక్షి వచ్చింది, జగతి మేడం వచ్చారు ఆ తర్వాత వసుధార వచ్చింది తర్వాత ఈ ప్రేమ ఇవన్నీ అయ్యాయి. నేను జీవితంలో ఏదైనా కావాలని కోరుకోలేదు అన్నీ నాకు ఇష్టం లేకుండా వచ్చి వెంటనే వెళ్లి పోయినవే ఇప్పుడు ఇది కూడా అలాగే జరుగుతుంది అసలు నేను ఏమైనా కావాలని చేశానా ఎందుకు నాకు ఇష్టమైన వాళ్ళు  నాకు దూరం అవుతున్నాయి అని అంటూ ఉంటాడు. 
గౌతమ్: సర్లేరా ముందు ఇంటికి బయలుదేరుదాం 
రిషి: నేను ఇంటికి రాను అని చెప్పాను రా నేను ఇక్కడే ఉంటాను 
గౌతమ్: అయితే నేను ఇక్కడే ఉంటాను 
ఆ తర్వాత సీన్లో వసు..రిషి ఫొటో చూసుకుంటూ మాట్లాడుతుంటుంది. 
రిషి: ఎందుకు నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని మచ్చలేని మనిషిగా చూడాలనుకుంటున్నాను ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అలాఉన్నారు  అనుకుంటూ రిషి కి ఫోన్ చేస్తుందికానీ కాల్ లిఫ్ట్ చేయడు...మెసేజ్ చేస్తుంది. అటుజగతి మేడంకి కూడా కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయదు. రెండోసారి కాల్ చేయడంతో జగతి లిఫ్ట్ చేస్తుంది. రిషి సార్ వచ్చారా అని అడిగితే రాలేదంటుంది జగతి..ఇంతలో మహేంద్ర ఫోన్ లాక్కుని ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగితే..నాకు తెలియదు సార్ అంటుంది. 


Also Read:  మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి


రిషి తన క్యాబిన్లో ఉండగా గౌతమ్ అక్కడికి వచ్చి టైం అవుతుంది రా  లంచ్ చేద్దామని క్యారేజ్ తెస్తాడు. అప్పుడు ఇద్దరు తింటూ ఉంటూ, ఇది ఇంటి భోజనంలా ఉందే అని రిషి అడుగుతాడు. లేదురా కొత్తగా హోటల్ పెట్టాడు. అందులో నుంచి తెప్పించాను అని గౌతమ్ అంటాడు. అప్పుడు ఇంకో ముద్ద తిన్న రిషి నిజంగా హోటల్ దేనా అని అనగా అవును రా బాబు. భోజనం బాగున్నప్పుడు ఎక్కడిదైతే  నీకెందుకు అని అంటాడు. ఇంకొంచెం తిన్నతర్వాత...నిల్చున్నది చాలు అలిసిపోతావు లోపలికి రా అని రిషి అంటాడు. లేదురా నేను కూర్చొనే ఉన్నాను అని గౌతమ్ అనడంతో  నేను చెబుతున్నది నీక్కాదు..వసుధారకి అంటాడు... ఎపిసోడ్ ముగిసింది..