గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 15th Today Episode 582)


వసు...ఆ చీర కట్టుకోలేను అని చెప్పడంతో జగతి ఒప్పించే పనిలో పడుతుంది. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకున్నాం ఇంతకన్నా ఆనందం ఏముంది..ఈ ఆనందాన్ని చెడగొట్టకు ప్లీజ్...ముందు చీర కట్టుకో తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం అంటుంది. అదే సమయంలో ధరణి అక్కడికి రావడంతో..ధరణి వసుకి హెల్ప్ చేయి అని చెప్పి వెళ్లిపోతుంది. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావ్ వసుధార అంటుంది ధరణి. కింద గౌతమ్...పూజ ఎప్పుడవుతుంది పెద్దమ్మా ఆకలేస్తోంది అంటాడు. అంతా అయినట్టే..వసుధార కిందకు వచ్చి కలశానికి నమస్కరించి హారతిస్తే పూజ అయిపోయినట్టే అంటుంది. అయితే కాసేపట్లో అయిపోతుందన్నమాట అంటాడు గౌతమ్.. ఇంతలో జగతి కిందకు వస్తుంది. ఏమైంది వసుధార ఇంకా రాలేదేంటని దేవయాని అడిగితే..వచ్చేస్తుంది అక్కయ్యా అంటుంది జగతి.. ఇంతలో మెట్లపై నుంచి దిగిన ధరణిని చూసి షాక్ అవుతారంతా. వసు కట్టుకోవాల్సిన చీర ధరణి కట్టుకుందేంటని ఆశ్చర్యపోతారు


దేవయాని: కోపంగా.. ఆ చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావ్ ధరణి 
వసు: నేనే కట్టుకోమన్నాను మేడం ఈ ఇంటి కోడలుగా చీర కట్టుకునే అర్హత కేవలం ధరణి మేడం కి ఉంది 
జగతి కోపంతో నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావ్ 
దేవయాని: ఎందుకు కోప్పడతావ్ జగతి. రిషి తనకు ఓ మాట చెప్పాడు ఇంట్లో వాళ్ళైతే  ఆ చీర విలువ వాళ్లకు తెలుస్తుంది పరాయి వాళ్లకి ఆ చీర విలువ ఏం తెలుస్తుంది
రిషి: ఇప్పుడు నాకు అర్థమైంది పెద్దమ్మ మనం ఒకటి చెప్పాం అది వాళ్లకు నచ్చకపోతే మనం మన ఆలోచనలు వాళ్ళమీద రుద్దలేం కదా అప్పటికి నేను మా నానమ్మ చీర అని చెప్పాను అయినా సరే విలువ ఇవ్వలేదు అని చెప్పి మౌనంగా ఉండిపోతాడు. 
దేవయాని...ధరణిని వెళ్లి హారతి ఇవ్వమని చెప్తుంది. ఇంటి వాళ్లకు మాత్రమే ఇంటి పూజలు చేసే అర్హత ఉన్నది అని కావాలని వసుధార వైపు చూసి చెబుతుంది దేవయాని.


Also Read: మోనితని ఆడేసుకుంటున్న కార్తీక్, దీప, దుర్గ - శౌర్య కోసం వెతుకుతున్న శివ


అప్పుడు రిషిని హారతి తీసుకోమని చెబితే రిషి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. బాధలో ఉన్న జగతి నా గదికి రా వసు మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జరిగినదంతా గుర్తుతెచ్చుకుంటూ జగతి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో వసు అక్కడికి వెళుతుంది... ఇంకోసారి ఈ ఇంటికి రావొద్దంటుంది... మేడం నేను చెప్పేది వినండి అనడంతో..
జగతి: నిన్ను నువ్వు సమర్ధించుకోవద్దు..నువ్వు చేయాలి అనుకున్నదే చేశావ్ కదా తెలివైన దానివని తెలుసు కానీ మనుషులు జీవితాలతో ఆడుకునే అంత తెలివైన దానివి అని నాకు తెలీదు నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను గొడవ  చేయొద్దు అని. అక్కడ రిషి మాట అందరి ముందూ పోయింది కేవలం నీవల్లే ఈరోజు రిషి తలదించుకున్నాడు.ఒక కన్నతల్లిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇన్నాళ్ళ నుంచి జరిగినదంతా వృధా అయిపోయింది అక్కడ అందరి ముందు రిషి మాటకు గౌరవం పోయింది నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను 
వసు: ఇప్పుడు నేను చీర కట్టుకుంటే ఇంటి కోడలుగా సగం బాధ్యత వచ్చినట్టే కదా మేడం గురుదక్షిణ ఒప్పందం తీర్చుకోకుండా నేను ఇప్పుడు ఆ చీర కట్టుకుంటే నేను గురుదక్షిణ నుంచి తొలగిపోయినట్టే కదా 
 జగతికి కోపంతో వసుధారని కొడుతుంది...అదే సమయంలో రిషి అక్కడికి వచ్చి మేడం ఏం చేస్తున్నారు వసుధార మీద మీరు చెయ్యి చేసుకోవడం ఏంటి అని అరుస్తాడు. ఆడపిల్లని కొడతావా...ఇదేం పని వసుధార మీద చెయ్యి చేసే అర్హత నీకేంటి అంటుంది దేవయాని.
వసు: నన్ను కొట్టే హక్కు మేడంకి మాత్రమే ఉంది. నేను చేసిన పని మేడంకి తప్పని మేడంకి అనిపించిందేమో అందుకే నన్ను కొట్టారు 
దేవయాని: విషయం ఏదైనా అవని ఈ ఇంటికి అంటూ కొన్ని గౌరవాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలా కొట్టడం కరెక్ట్ కాదు
రిషి: వసుధార బాధపడితేనే నేను తట్టుకోలేను అలాంటిది తన మీద చేయిపండింది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా 


Also Read: జగతికి అత్తగారి హోదా , రిషిధార మధ్య చిచ్చు పెట్టిన చీర!


దేవయాని: మా అత్తగారి చీర కట్టుకోమని రిషి తనకు చెప్పాడు తను కట్టుకోలేదు అది తన ఇష్టం. ఈ ఇంటి సభ్యురాలు అవ్వాలని తనకు లేదు. అది తన ఇష్టం అంత మాత్రాన కొట్టాలా? ఇంటికి కోడలు అవ్వాలనుకుంటుంది అని నేను తనకి చీర ఇచ్చి కట్టుకోమని చెప్పాను అయినా తను కట్టుకోలేదు. రిషి ని కాదనుకుంటుంది అయినంత మాత్రాన కొట్టాలా అది తన ఇష్టం నువ్వేం బాధపడొద్దు రిషి అని మనం అనుకున్నట్టు జరగవు కదా అని కావాలని ఒకవైపు రిషి ని రెచ్చగొడుతూ మరోవైపు ఓదారుస్తుంది దేవయాని.
మహేంద్ర: నన్ను క్షమించు వసుధారా
వసు:  సార్ మీరు ఎందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారు. మేడం కొట్టినందుకు నాకు బాధగా ఏమీ లేదు కానీ నాకు ఒక విషయం అర్థమైంది సర్ ఇంట్లో ప్రేమలు, బంధాలు ఎక్కువ బంధాల కోసం ఆరాటలు ఎక్కువ  
అప్పుడు జగతి...వసు నన్ను అని అనేలోగే
ఇక చాలు మేడం అని రిషి దండం పెడతాడు...
రిషి: ఎవరికైనా భరించే శక్తి కొంతకాలమే ఉంటుంది. నేను అలసిపోయాను, విసిగిపోయాను ఇవన్నీ మనసున్న వాళ్ళకే తెలుస్తుంది. చిన్నప్పుడే కన్న కొడుకుని వదిలేసిన వాళ్ళని కాదు. అని కోపంతో జగతిని తిట్టి అక్కడ నుంచి వసుధార చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోతాడు 
ఎపిసోడ్ ముగిసింది