గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 3rd  Today Episode 598)


వసుధార, పుష్ప తో ఫోన్ మాట్లాడుతూ...ఎగ్జామ్స్ రిజల్ట్ గురించి టెన్షన్ పడుతుంటుంది. జీవితంలో అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను అమ్మ నాన్న అందరినీ వదిలేసాను. చదువుతూ ఉద్యోగాలు చేసి కష్టపడ్డాను. చివరి ఎగ్జామ్ అయితే రాసేదాకా కష్టపడ్డాను అంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిషి రావడంతో కాల్ కట్ చేస్తుంది. ఏమైందని అడిగితే..టెన్షన్ సార్ అంటుంది
రిషి: డి బి ఎస్ టి కాలేజ్ యూత్ ఐకాన్ అయిన నువ్వు ఇలా భయపడుతున్నావా 
వసు: ఆ రోజు ఆఖరి ఎగ్జామ్ ఏ పరిస్థితుల్లో రాశానో మీకు తెలుసుకదా సార్
రిషి: వసు చేతులు పట్టుకుని ఏం కాదు వసుధార నువ్వు సాధిస్తావు అని ప్రేమగా చూస్తూ ఉంటాడు
వసు: మీ మాటలు వింటే నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్ 
ఆ తర్వాత ఇద్దరూ ఓ చెరువు దగ్గరకు వెళతారు
రిషి:  ఏంటి వసుధార ఇంత రాత్రిపూట ఇక్కడికి తీసుకొచ్చావు
వసు: ఈ రాత్రివేళ నగరమంతా నిద్రపోతున్న సమయంలో ఈ నీటిలో మనం ఈ కాగితపు పడవలు వేస్తే ఎంత బాగుంటుందో కదా సార్ రిషి: కొత్తగా ఉంది ...
వసు:ఏదైనా కోరుకుని పడలవపై రాసి నీటిలో వేస్తే ప్రకృతి ఆ కోరికను నెరవేరుస్తుంది
రిషి: ఇంతకీ ఏం కోరుకుంటున్నావ్
వసు: అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను...మీరొకటి నేనొకటి కాదు కదా
రిషి: యూనివర్శిటీ టాపర్ కావాలని కోరుకుంటున్నా 
వసు: ఈ పడవపై అదే రాయండి
ఆ తర్వాత వసుధార కాగితపు నీటి పడవల గురించి, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకుంటుంది. ఇద్దరూ కాగితపు పడవలపై మనసులో ఉన్న మాట రాసుకుని నీటిలో వదిలి..వాటిని చూసి సంతోష పడతారు. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు.  ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగితే..అప్పుడే అయిపోతే నేను వసుధారని ఎలా అవుతానంటుంది..నవ్వుతాడు రిషి...


Also Read: కాలేజీలో కబుర్లు - చెరువులో కాగితపు పడవలతో ఆటలు, రిషిధారకు దేవయాని స్వీట్ వార్నింగ్


మరొకవైపు దేవయాని కిందికి వచ్చి ధరణి అని పిలుస్తుంది. ఎప్పుడు చూసినా వంటింట్లోనే ఉంటావని విసుక్కుంటుంది. రిషి కనిపించడం లేదేంటని అడిగితే..బయటకు వెళ్లారని చెబుతుంది ధరణి. 
దేవయాని: యంగేజ్ మెంట్ కూడా కాకుండా భార్యా భర్తల్లా తిరుగుతున్నారు..వీళ్లేంటో అర్థం కావడం లేదు
ధరణి: అత్తయ్య గారు నేను ఓ మాట మాట్లాడొచ్చా...
దేవయాని: నువ్వు అడుగుతాను అంటే నాకు వాతపెడతా అన్నట్టుంది
ధరణి: వసుధార ఈ తరం అమ్మాయి కదా..వాళ్లిద్దరూ కలసి తిరిగితే తప్పేముంది...
దేవయాని: కలసి తిరగడం తప్పుకాదా..
ధరణి: అలాంటప్పుడు కలసి తిరగడం గురించి రిషికి ఓ మాట చెబితే బావుంటుంది కదా
దేవయాని: ఏం చెప్పాలి
ధరణి: కలసి తిరగడం తప్పంటున్నారు కదా ఆదే విషయం రిషికి చెబితే సరిపోతుంది కదా.. 
దేవయాని: మనసులో ఉన్నవన్నీ ఎలా అడుగుతాం...అయినా వసుధార కన్నా నువ్వు ముదిరిపోయావ్ ధరణి
ఆ తర్వాత దేవయాని ఈ వసుధార రిషిల ప్రేమ కథ రోజుకి ఎక్కువ అవుతుంది ఏదో వినకూడని వార్త వింటాను అనిపిస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.


Also Read: శౌర్యను మోసం చేసిన ఇంద్రుడు-చంద్రమ్మ, మరో రెండు రోజుల్లో లెక్కలు సెట్ చేస్తా అన్న కార్తీక్


రిషి-వసుధార ఇద్దరూ కారులో షికార్లు కొడుతుంటారు. థ్యాంక్స్ సార్ అని వసుధార అంటే.. థ్యాంక్స్ చెప్పుకునేంత దూరం మనమధ్య లేదన్న రిషి..మన మధ్య థ్యాంక్స్-సారీ అనే విషయాలకు ఛాన్స్ లేదంటాడు. 
వసు: మనసు తెలుసుకున్న వాళ్లు మనతో జీవితాంతం ప్రయాణం చేస్తే ఎంతబావుంటుందో తెలుస్తోందిప్పుడు..ప్రతి ఆడపిల్లకు ఇలాంటి అదృష్టం దొరికితే బావుంటుంది అనిపిస్తోంది
రిషి: కారు సడెన్ గా ఆపేసిన రిషి..వసు చేతిని చేతిలోకి తీసుకుని నన్నేదో మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్
వసు: అదేం లేదు సార్ మీలాంటి జెంటిల్మెన్ ఒక్కరే ఉంటారు అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా
రిషి: కొంపదీసి ఈ జెంటిల్మెన్ అందరికీ పంచుతావా ఏంటి అని సెటైర్ వేస్తాడు
వసు: అదృష్టాన్ని ఆస్వాదిస్తాను..అందరికీ ఎందుకు పంచుతాను..
రిషి: మన మధ్య ఎన్నో అపార్థాలు,అభిప్రాయ బేధాలు వచ్చాయి అన్నీ తొలగిపోయాయి..నేను తప్పుచేస్తే మందిలించావ్, చిన్న మంచిపని చేసినా ఆకాశానికి ఎత్తేశావు..ఇలాగే జీవితాంతం తోడుంటానని నన్ను విడిచి వెళ్లనని మాటివ్వు
వసు: జన్మజన్మలకి వసుధార మీతోనే కలసి ఉంటుంది సార్..ఎన్నటికీ మిమ్మల్ని విడిచి వెళ్లదు..ఏ శక్తీ మన బంధాన్ని విడదీయలేదు..రిషిధార బంధం కలకాలం కొనసాగుతుంది..నా ప్రయాణం మీతోనే...


రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో 
మేడం నేను చేసే చపాతీలకు రిషి సార్ పేరు పెడతాను..ప్రిన్స్ చపాతీ, జెంటిల్మెన్ చపాతీ అని పెడతాను అంటుంది వసుధార. ఇంతలో వెనుకే రిషి ని చూసి షాక్ అవుతుంది. హెల్ప్ చేస్తానన్న రిషికి చపాతీలు ఎలా చేయాలో నేర్పిస్తుంది వసుధార...