గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 25th Today Episode 617)
రిషి..ఇంటి దగ్గర మహేంద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి దేవయాని వచ్చి ఏంటి రిషి నువ్వు పొద్దున్నుంచి ఏం తినకుండా కాఫీ కూడా తాగకుండా అలాగే ఉన్నావని అడుగుతుంది
రిషి: డాడ్ వాళ్లు వచ్చాక తాగుతాను పెద్దమ్మ
దేవయాని: మహేంద్ర వాళ్ళని పిలిచావు వాళ్ళు వస్తారు కదా అలా అందుకోసం నువ్వు తిండి మానేసి ఇలా ఉండడం ఏంటి సరే కిందికి వెళ్దాం పద
రిషి: మీరు వెళ్ళండి పెద్దమ్మ
దేవయాని: నువ్వు తినకుండా ఉన్నావని పెదనాన్నకి తెలిస్తే నన్ను కోప్పడతారు..పద
రిషి: కాఫీ అయినా టిఫిన్ అయినా డాడ్ వాళ్లు వచ్చిన తర్వాతే
దేవయాని: కిందకు వెళదాం పదా..పెదనాన్నతో మాట్లాడటానికేం..
Also Read: దీపను షూట్ చేసిన మోనిత, జైలుకెళ్లిన దుర్గ , ఇది ముగింపా -మరో మలుపా!
మరోవైపు గౌతమ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అనడంతో జగతికి ఎక్కువగా దెబ్బలు తగిలాయి ఆమెకు వెంటనే బ్లడ్ కావాలి అరేంజ్ చేయండి అని చెప్పడంతో సరే డాక్టర్ అని అంటాడు గౌతమ్. అటు వసుధార-రిషి... జగతి వాళ్ళు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వసుధార ఏం కాదు సార్ జగతి మేడం వాళ్ళు వస్తారు అని రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది. రిషి ఫోన్ ఎత్తడం లేదనుకుంటూ వసుకి కాల్ చేస్తాడు గౌతమ్.. ఓసారి హాస్పిటల్ కి రారా అని పిలిస్తే..డాడ్ వాళ్లు వస్తారని ఎదురుచూస్తున్నా కదా రాలేనని చెబుతాడు రిషి.. ప్లీజ్ రా నాకోసం ఇక్కడికి రారా నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి కట్ చేస్తాడు. గౌతమ్ సార్ కి ఏదో ఇబ్బంది ఉంటేకానీ అన్నిసార్లు కాల్ చేసి ఉంటారో వెళ్దాం పదండి సార్ అని అని తీసుకెళుతుంది.
మరోవైపు రిషి వాళ్ళు వస్తారో రారో అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. వాడు తొందరగా రమ్మని ఫోన్ చేసి చెప్పాడు ఎవరు ఏంటి అని అడిగితే..ఏమీ చెప్పలేదని ఆలోచించుకుంటూ వెళతారు. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లిన రిషి..నన్ను ఎందుకు రమ్మన్నావ్ ఏమైందని అడిగితే..అప్పుడు గౌతమ్ మహేంద్ర వాళ్ళని చూపించడంతో రిషి, వసుధార ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి డాడ్ మీకు ఏమైంది డాడ్ అని అనడంతో మహేంద్ర జరిగింది చెబుతాడు. మహేంద్ర రిషి తో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వసుధార మేడం ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. గౌతమ్ జగతిని చూపించగా వసుధార-రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆమెకి బ్లడ్ అవసరం అవుతుందన్న డాక్టర్.. బ్లడ్ కావాలని చెప్పాంకదా అని డాక్టర్ అంటాడు..చాలా రేర్ గ్రూప్ అర్జెంటుగా కావాలి అనడంతో అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. అప్పుడు ఓ నెగటివ్ డాక్టర్ గారు నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని రిషి జగతి కోసం బ్లడ్ ఇస్తాను అనడంతో వసుధార మహేంద్ర ఆనంద పడతారు.
Also Read: రిషి-జగతిని కలిపిన యాక్సిడెంట్, ఆనందంలో మహేంద్ర, టెన్షన్లో దేవయాని
రిషి జగతికి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. రిషి జగతి వైపు ఎమోషనల్ గా బాధగా చూస్తూ ఉంటాడు. అమ్మా అని పిలవను అన్న రిషి మాటలు తలుచుకుంటుంది వసుధార..వసు కన్నీళ్లు చూసిన రిషి మేడంకి ఏమీకాదు నేనున్నా కదా అని ధైర్యం చెబుతాడు. మరొకవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ బాధపడుతూ ఉంటారు..
ఎపిసోడ్ ముగిసింది
రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు..కొడుకుగా అది తన బాధ్యత కదా అని వసుధార చెబుతుంది... ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్లేందుకు వెనక్కు తిరగ్గానే రిషి అని కలవరిస్తూ చేయి పట్టుకుంటుంది జగతి... ఇంతలో నర్స్ వచ్చి మీరేనా రిషి అంటే..ఏమవుతారు సార్ అని అడుగుతుంది..ఆ తర్వాత రిషి జగతితో ఏదో మాట్లాడుతాడు... బయటి నుంచి మహేంద్ర,గౌతమ్, వసుధార చూసి సంతోషపడతారు...