గుప్పెడంతమనసు (Guppedantha Manasu ) మార్చి17 గురువారం ఎపిసోడ్
ధరణి కాఫీ తీసుకొచ్చి అత్తయ్యగారు కాఫీ అని ఇస్తుంది. నేను ఇంట్లో ఉప్పులు, పప్పులు లెక్కలు రాస్తుంటాను నువ్వు నాకు టీ ఇస్తూ వంటలు చేస్తూ ఉండు అంటుంది దేవయాని. అర్థంకాలేదు అత్తయ్యగారు అని ధరణి అంటే... నాక్కూడా ఏమీ అర్థంకావడం లేదంటుంది దేవయాని. దేవయాని: ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తున్నారు, మహేంద్ర రిషిని పట్టించుకోడు, జగతి నన్ను పట్టించుకోదు, మీ మావయ్య్ ఎవ్వర్నీ పట్టించుకోరుధరణి: మీ కడుపుమంట ఏంటోదేవయాని: రిషి వచ్చాడాధరణి: ఇంకా రాలేదుదేవయాని: ఈ మధ్య రిషి ఎక్కడికి వెళుతున్నాడు, తనుకూడా ఆలస్యంగా వస్తున్నాడుధరణి: తనకేంటో పనులుంటాయి కదాదేవయాని: అదే ఆపనులేంటో తెలుసుకోవాలి కదా
Also Read: డాక్టర్ బాబు చెప్పినా వినని శౌర్య, సౌందర్యకి ఘోర అవమానంఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు...రెస్టారెంట్లో వసుధార మాటలు గుర్తుచేసుకుంటూ వసు సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తానన్నట్టు అనుకుంటూ వెళుతుంటాడు. డాడ్ ఇంటికి వచ్చారా అనుకుంటూ రూమ్ కి వెళ్లి చూసి ఇంకా రాలేదా అనుకుంటూ తన రూమ్ కి వెళ్లేసరికి అక్కడ కూర్చుని ఉన్న మహేంద్రని చూస్తాడు.
రిషి: మీకోసం మీ గదికి వెళ్లానుమహేంద్ర: గదుల్లానే అభిప్రాయాలు కూడా వేర్వేరుగా ఉన్నాయిరిషి:అభిప్రాయాలు వేరుంటే నష్టం ఏంటిమహేంద్ర: నష్టం డబ్బులో అయితే ఎక్కువ సంపాదించుకోవచ్చు కానీ నష్టపోయిన బంధాలను తిరిగి తెచ్చుకోలేంరిషి:ఓ నిర్ణయం తీసుకున్నాను మీకు నచ్చకపోతే బాధపడితే ఎలామహేంద్ర: నాకు నచ్చిన నిర్ణయాలు నువ్వెప్పుడు తీసుకున్నావ్రిషి:మిషన్ ఎడ్యుకేషన్ ద్వారానే కాలేజీకి మంచి పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను, అంతకుముందే మంచిపేరు ఉంది మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా అది పెరిగింది...ఏంటి డాడ్ మాట్లాడరుమహేంద్ర: కాలేజీ విషయాలు కాలేజీలోనే మాట్లాడుకుంటే మంచిదిరిషి:సరే డాడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారామహేంద్ర: థ్యాంక్స్..నామీద నాఆరోగ్యంమీద నీకున్న శ్రద్ధకురిషి:అదేంటి డాడ్ మీపై నాకు శ్రద్ధ లేదామహేంద్ర: ప్రేమ,శ్రద్ధ ఉన్నాయా లేవా అని కాదు...ఒకర్నిప్రేమిస్తే వాళ్ల బలహీనతల్ని కూడా ప్రేమించాలిరిషి:మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైందిమహేంద్ర: అర్థంచేసుకోవడం గొప్పకాదు..అర్థవంతంగా ప్రవర్తించడం గొప్పరిషి:మీరు ఈ మాట రిషికి చెబుతున్నారా, కాలేజీ ఎండీకి చెబుతున్నారామహేంద్ర: మహేంద్ర భూషణ్-జగతిల సంతానమైన నా ఏకైక పుత్రుడికి చెబుతున్నానురిషి:డాడ్ మనిద్దరి గురించి ఎంత మాట్లాడినా చెబుతాను,ఆవిడ గురించి అయితే మాట్లాడలేను కాలేజీలో మీటింగ్ అరెంజ్ చేస్తాను, అప్పుడు మీ మనసులో ప్రశ్నలకు సమాధానాలు చెబుతానుమహేంద్ర: థ్యాంక్స్ రిషిరిషి:దేనికి డాడ్మహేంద్ర: నాక్కూడా ఓ మనసు ఉందని గుర్తించినందుకు
Also Read: వసు ప్రవర్తన చూసి అయోమయంలో రిషి, మహేంద్ర షాకింగ్ డెసిషన్మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంటే... మెట్ల దగ్గరే నిల్చున్న దేవయాని....ఏం మహేంద్ర ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ ఆశపడకు అస్సలే నీ ఆరోగ్యం బాలేదు అంటుంది. థ్యాంక్స్ వదినగారూ నా ఆరోగ్యంమీద మీకున్న శ్రద్ధకు శుభరాత్రి అనేసి వెళ్లిపోతాడు. మీరు ఎప్పటికీ ఇద్దరే మహేంద్ర ముగ్గురు కాలేరు కానివ్వను అనుకుంటుంది జగతి
మరోవైపు గౌతమ్ ఆలోచనలో పడతాడు. వసుధార కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి వీడి ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తుందేమో అనుకుని ట్రై చేస్తాడు. కానీ రిషి ఫోన్ లాక్కుంటాడు. ఓ ఫ్రెండ్ నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అందుకే నీ సెల్ నుంచి చేస్తానంటాడు. నువ్వు వసుధారకే కదా కాల్ చేస్తావ్ అనడంతో అవును ఫోన్ ఇవ్వరా అని బతిమలాడిన గౌతమ్ సర్లే నా ఫోన్లోనే ట్రై చేస్తానంటాడు. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయకపోతే కాల్ చేయకూడదురా అంటాడు. నీపని నీది నా పని నాది అంటాడు గౌతమ్.
మళ్లీ వసుధార ఆలోచనల్లోకి వెళ్లిన రిషి..వసుధార నాకు పార్టీ ఎందుకు ఇచ్చింది...ఈ పాటికి ఇంటికెళ్లి పడుకుని ఉంటుందా.. ఫోన్ చేస్తే అనుకుంటాడు. గౌతమ్ నుంచి కాల్ రావడం చూసి కట్ చేస్తుంది వసుధార. ఇంతలో రిషి నుంచి మెసేజ్ వస్తుంది.రిషి మెసేజ్: హలోవసు: హలో సార్రిషి: పడుకున్నావావసు: లేదు సార్రిషి: ఈ రోజు తమరి అత్యుత్సాహం ఎందుకో తెలుసుకోవచ్చావసు: ఉత్సాహంగా ఉండడం మంచిదే కదా సార్రిషి: అదే ఎందుకా అనివసు: సంతోషం సార్రిషి: అదే ఎందుకోవసు: గుడ్ నైట్ సార్రిషి: సడెన్ గా ఏంటి..జగతి మేడం వచ్చి ఉంటారా
వసు ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో గౌతమ్ ఏంట్రా ఫోన్ స్విచ్చాఫ్ చేసిందేంటి అని గౌతమ్ అడిగితే అవునా నువ్వుకూడా వెళ్లి లైట్ స్విచ్చాఫ్ చేసి పడుకో అంటాడు.
కాలేజీలో రిషి-మహేంద్రరిషి: ఏంటి డాడ్ మాట్లాడుదాం అని పిలిచి సైలెంట్ గా ఉన్నారుమహేంద్ర: ఎలా మొదలెట్టాలో అర్థం కావడం లేదురిషి: కాలేజీకి సంబంధించింది కదామహేంద్ర: అవును కానీ అందులో మన ఫ్యామిలీ అంశం కూడా దాగి ఉంది, అందుకే కాలేజీ స్టాఫ్ ని పిలవలేదు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా...రిషి: ఏ విషయం గురించి డాడ్మహేంద్ర: నీకు అర్థమవుతోందని నాకు తెలుసు.. డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా పక్షపాతం లేకుండా వ్యవహరించాలి, జగతిపైకోపంతో నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. జగతిమీద మీకున్న సొంత అభిప్రాయంతో ఆమెని ఇబ్బంది పెడుతున్నావ్రిషి: జగతి మేడంపై కోపం ఉంటే కాలేజీలో మీ ఇద్దరూ కలసి కూర్చుంటే ఓసారి అరిచానేమో కానీ తర్వాత నేను పట్టించుకోలేదు, మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని నేను డిసైడ్ చేశానుమహేంద్ర: 99 మంచిపనులు చేసి ఒక్క తప్పు చేస్తే అది ఒప్పు అవదు, మా నాన్నగారి ఆత్మ ఈ కాలేజీలో తిరుగుతుంది.. ఆయన్ని నువ్వు గౌరవించాలి రిషి: తాతగారంటే నాకు చాలా ఇష్టం...నాకు కాలేజీ సర్వశ్వం. కాలేజీ ముఖ్యం...కాలేజీని గౌరవిస్తున్నాను,మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దుచేయాలి అనిపించింది చేసేశాను...మహేంద్ర: బయట ప్రపంచంలో నువ్వు ఏం తప్పుచేసినా తండ్రిగా నిన్ను క్షమిస్తాను...కానీ కాలేజీకి సంబంధించి తప్పుచేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా నేను ఒప్పుకోనురిషి: తనని నేను వెళ్లిపోమని చెప్పలేదు..ఇందులో మీకొచ్చిన నష్టం ఏంటిమహేంద్ర: లాభ నష్టాలు వ్యాపారంలో ఉంటాయి... రాత్రంతా ఆలోచించాను, నీ ఆలోచనల్లో మార్పు వస్తుందేమో అని ఆశించాను.. చెప్తే వినని వాళ్లకు చెప్పడం వృధా అనిపించింది. నీ కిష్టం అయిన నిర్ణయం నువ్వు తీసుకుంటే నాకిష్టం అయిన నిర్ణయం నేను తీసుకుంటాను.రిషి: ఏంటి డాడ్మహేంద్ర: మీ డాడ్ గా కాదు కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను, మీరు ఆలోచించకుండా మీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు, డీబీఎస్టీ కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అంటూ లెటర్ ఇస్తాడు. రిషి: డాడ్ ఏంటిదిమహేంద్ర: ఎండీగారూ ఈ రాజీనామాని రాత్రే రాసిపెట్టుకున్నాను...కానీ..మీ మనసు మారుతుందేమో అని చెక్ చేశాను, మీరు మారరు అని అర్థం చేసుకున్నాను, నేను వెళ్లిపోతున్నాను, ఈ కాలేజీకి నాకు రుణం తీరిపోయింది. మా నాన్నగారి ఆశయాలు నెరవేరాలని ఆశించాను కానీ మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అది వెనక్కు వెళుతోందని అర్థమైంది...ఇదిగోండి లెటర్...థ్యాంక్సూ... వస్తాను సార్
రేపటి ( శుక్రవారం ఎపిసోడ్ లో)డాడీతో రాజీనామా చేయించి మీరే గెలిచారు మేడం, మీరంతా సంతోషంగా ఉన్నారు మేడం, మిషన్ ఎడ్యుకేషన్ రద్దు చేసినందుకు నన్ను భలే దొంగ దెబ్బ తీశారు, నాకున్న ఏకైక తోడు మా డాడ్ ని లాగేసుకున్నారు అన్న రిషితో నిజంగా మహేంద్ర నాకేమీ చెప్పలేదని జగతి అంటున్నా వినకుండా మా డాడ్ ని నాకు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతాడు...