జగతి రిషిధార గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరూ భార్యాభర్తలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది గుర్తు చేసుకుని మనసులోనే ఆనందపడుతుంది. అప్పుడే దేవయాని వస్తుంది. ‘కొడుకు పెళ్లి అనగానే గుండెల్లో కోటి వీణలు మోగాయా, పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నారా? కొడుకు పెళ్లి అనగానే సంతోషపడుతున్నారా. రిషి నీ కొడుకే కానీ నా మాట అంటే వేదం. నేనంటే గౌరవం, ఆ గౌరవమే నాకు గొప్ప ఆయుధం’ అని దేవయాని అంటుంది.
దేవయాని: నా ఇష్టం లేకుండా రిషి, వసుధార పెళ్లి జరుగుతుందని ఎలా అనుకుంటున్నావ్. వాళ్ళ పెళ్లి జరగదు, జరగదు గాక జరగదు. ఈ దేవయాని జరగనివ్వదు. రిషి నీకు పేరుకు మాత్రమే కొడుకు కానీ నా మాటకే గౌరవం. వెరీ సోరి జరగదు. ఈ పెళ్లి జరగడం లేదు
జగతి: మీకు ఈ పెళ్లి ఇష్టం ఉంటుందని నేను ఎలా అనుకుంటాను. ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని నాకు చెప్పడం కంటే రిషికి చెప్తే బాగుంటుందేమో
దేవయాని: రివర్స్ గేమ్ ఆడుతున్నావా
జగతి: మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని రిషికి వెళ్ళి చెప్పండి
దేవయాని: నీకు ఈ పెళ్లి జరుగుతుందని ఆశ ఉన్నట్టు ఉంది, ఆ ఆశ వదులుకో, ఇక్కడ ఉన్నది దేవయాని అనేసి వెళ్లిపోతుంటే అప్పుడే మహేంద్ర ఎదురుపడుతాడు. ఏంటి జగతి వదిన ఏమంటుందని అడుగుతాడు. ఏదో కొత్త కుట్రతో ఈ పెళ్లి చెడగొట్టడానికి చూస్తుంది, తన విషపు ఆలోచనలు ఎలాగైనా అడ్డుకోవాలని జగతి అంటుంది. రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషికి ఫోన్ చేసి మాట్లాడతాడు. అందరి ముందు అలా చెప్పాను ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అని అడుగుతాడు.
Also Read: ఏడిపించేసిన డాక్టర్ బాబు- తల్లిని చూసి ఎమోషనల్ అయిన కార్తీక్, శౌర్యని చేరుకున్న సౌందర్య
వసు: ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుని తను నాకు కాబోయే జీవిత భాగస్వామి అంటే మనసు ఉప్పొంగిపోతుంది
రిషి: ఏం చేస్తున్నావ్ ఇక్కడికి రావొచ్చు కదా
వసు: వద్దు సర్
రిషి: నేను అక్కడికి రానా
వసు: వద్దు సర్ ఇద్దరం ఒకే గదిలో బాగోదు సర్
రిషి: నిజానికి నీతో ఎన్నో మాట్లాడాలని అనుకుంటాను, కానీ నిన్ను చూస్తూ ఉండటమే అయిపోతుంది
ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. దేవయాని నిద్రపోకుండా ఫోన్ చూస్తూ ఉంటుంది. చీకట్లో ఫోన్ ఏంటి అని ఫణీంద్ర నిద్రలోనే అడుగుతాడు. ఈ టైమ్ లో ఫోన్ చేసి ఎవరిని డిస్ట్రబ్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. అందరూ నన్నే డిస్ట్రబ్ చేస్తున్నారని కోపంగా బయటకి వెళ్ళిపోతుంది. రిషి మాత్రం వసు కనిపించడం లేదంటి అని చూస్తూ ఉంటాడు. వసు సిగ్గుపడుతూ వస్తుంది. ఇద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వస్తుంది. ఏంటి రిషి ఇక్కడున్నారని అడుగుతుంది. రేపు ప్రయాణం చెయ్యాలి కదా వెళ్ళి పడుకోమని రిషికి చెప్తుంది. నువ్వైనా చెప్పాలి కదా వసుధార అంటే చలిగా ఉంది మీరు ఈ టైమ్ లో బయట తిరగకండి ఆరోగ్యం జాగ్రత్త అని వసు వాళ్ళు వెళ్లిపోతారు.
Also Read: చిలిపి అల్లరి చేస్తూ భార్యని ఉడికించిన యష్- బుంగమూతి పెట్టిన వేద
రేపే ప్రయాణం పెళ్లి సంబంధం కలుపుకోవడానికి కాదు కాదు సంబంధం తెంపుకోవడానికి అని దేవయాని వసు బావ రాజీవ్ కి కాల్ చేస్తుంది. శాశ్వతంగా దూరం చేయాలని అంటుంది. దేవయాని ఫోన్ మాట్లాడటం మహేంద్ర చూస్తాడు. ఈ టైమ్ లో ఎవరితో మాట్లాడుతుంది అని వచ్చి పలకరిస్తాడు.