లాస్య తులసి గురించి మాట్లాడుతుంటే నందు చిరాకు పడతాడు. ముంబై వెళ్తున్నా జాబ్ కోసం అని లాస్యకి చెప్తాడు. ఇంత సడెన్ గా ఏంటి, మళ్ళీ ఎప్పుడు వస్తావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నందు చిరాకు పడతాడు. ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది, సామ్రాట్ మాటలకి ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వెళ్లిపోతునట్టు ఉన్నాడని లాస్య అనుకుంటుంది. తులసి మావయ్య మనసు పొల్యూట్ చేస్తుందని లాస్య వాగుతుంటే నందు ఆపుతాడు, ఇలాంటి మాటల వల్ల నాన్న ఎవరితో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారని నందు నోరు మూయిస్తాడు. లాస్య వైపు చూస్తూ ‘నేను లేని టైమ్ లో ఎవరైనా నాన్న బాధపడేలా మాట్లాడిన ఇబ్బంది పెట్టినా అసలు ఊరుకోను, తులసి గురించి కూడా ఎవరు మాట్లాడటానికి వీల్లేదని’ నందు అందరికీ వార్నింగ్ ఇస్తాడు.
తులసి విషయంలో అసలు తగ్గవద్దని లాస్య నందు వెళ్లిపోయాక అనసూయకి ఎక్కిస్తుంది. ఇంట్లో జరుగుతున్న వాటికి కారణం తులసినే తనని ఎలా వదిలిపెడతాను అని అనసూయ తిడుతుంది. అనసూయ తులసి కోటకి పూజ చేసి ఇంట్లోకి వెళ్లబోతుంటే పరంధామయ్య వస్తాడు. అనసూయ వైపు కూడా చూడకుండా వెళ్లిపోతుంటే ఆపి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది. ఎప్పటిలాగానే పరంధామయ్య అనసూయని మాటలు అనేసి వెళ్ళిపోతాడు. ఈ వయసులో మనకి మసస్పర్థలు అవసరమా అని అనసూయ అంటుంది. ఈ ఇంటి గృహలక్ష్మి గడపదాటి వెళ్ళిపోయింది, గుడిలో మహాలక్ష్మి అయిన కనికరిస్తుందేమో అని వెళ్ళాను అని చెప్పు లేదంటే తనకి పిచ్చి అని కూడా చెప్పమని పరంధామయ్య అంటాడు.
Also Read: 'సామ్రాట్ నీ అదృష్టం అమ్మా' వదులుకోవద్దని చెప్పిన ప్రేమ్- నందులో పశ్చాత్తాపం?
తులసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సామ్రాట్ చూసి కారు ఆపుతాడు. తన ఫేస్ చూస్తుంటే చేసిన గొడవ గురించి తెలిసినట్టే ఉందే అని సామ్రాట్ మనసులోనే భయపడతాడు.
తులసి: మీరు నా గురించి ఎందుకు అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు, నా తరఫున యుద్ధం చేయడాన్ని ఏమంటారు
సామ్రాట్: నా మనసులో అలాంటిది ఏమి లేదు, ఒక స్నేహితుడిగా నా తరఫున క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళాను
తులసి: నా గురించి నాకు కూడా తెలియనంతగా మీకు తెలుసు, కొత్తగా అనిపించారు, మీరు ఆరాధించేంత గొప్పదాన్నా నేను
సామ్రాట్: నేను వేరే ఉద్దేశంతో అలా అనలేదు
తులసి: మీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, ఆ సమయంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాను
సామ్రాట్: మీ ముందు మాట్లాడలేని చాలా నిజాలు అక్కడ బయటకి వచ్చాయి నాకు తెలియకుండానే, గీత దాటానా
తులసి: దాటారు, మీరు స్నేహం అనే గీత దాటి ముందుకు వచ్చారు గొప్ప స్నేహితుడి అని నిరూపించుకున్నారు
సామ్రాట్: మీ మీద నిందలకి నేనే కారణం అని జోక్యం చేసుకున్నా, వాళ్ళ తప్పులని ఎట్టి చూపించడం తప్పే కదా
తులసి: ఇంతవరకి నా జీవితంలో ఎవరు యుద్దం చెయ్యలేదు, కానీ మీరు నా వైపు నిలబడ్డారు, నా గొంతు వాళ్ళకి వినిపించేలా చేశారు, మీ నుంచి ఇలాంటి రియాక్షన్ నేను ఊహించలేదు, నాతరఫున యుద్దం చేసే స్నేహితుడు నాకున్నాడు చాలా సంతోషంగా ఉంది
Also Read: వెక్కి వెక్కి ఏడుస్తున్న వేద- తాగి రచ్చ చేసిన యష్, సంబరంలో ఖైలాష్
సామ్రాట్: మనం ఇక నుంచి ఫ్రెండ్స్ అని ఇద్దరు చేతులు కలుపుతారు.
ఇంట్లో అందరూ ముభావంగా ఉన్నారు ఏదైనా గొడవ జరిగిందా అని పరంధామయ్య అడుగుతాడు. ప్రేమ్ చెప్పబోతుంటే వద్దని అభి సైగ చేయడం పరంధామయ్య గమనిస్తాడు.