ఈ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది అది నీకు తెలుసు ఏంటదని ప్రియని దివ్య నిలదీస్తుంది. కానీ ప్రియ మాత్రం ఇంతకుమించి ఏమి చెప్పలేనని మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. తులసి రాజ్యలక్ష్మి గతంలో వంకరగా మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఇంత గుడ్డిగా ఎలా మోసపోయాను కూతురి పెళ్లి విషయంలో ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నాను. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. దివ్య జీవితం నా జీవితంలాగే సుడిగుండంలో చిక్కుకుంది ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఏడుస్తుంది. అది చూసి అనసూయ వచ్చి ఏమైందని అడుగుతుంది. కష్టమేంటో చెప్పమని పరంధామయ్య అడుగుతాడు. తులసి అనసూయని కౌగలించుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన నందు చూస్తాడు.
నందు తిట్టినందుకు ఏడుస్తున్నావా అంటారు. సమస్య మీ అబ్బాయితో కాదు మీ కోడలితో. డబ్బు కోసం లాస్య చేసిన పని వల్ల దివ్య జీవితం ప్రమాదంలో పడింది. రాజ్యలక్ష్మి ప్రేమతో దివ్యని కోడల్ని చేసుకోలేదు పగతో సాధించాలని చేసుకుంది ఈ సంగతి లాస్యకి ముందే తెలుసు అయినా సరే రాజ్యలక్ష్మితో కుమ్మక్కై పెళ్లి జరిగేలా చేసిందని చెప్తుంది. దివ్యకి మొదటి రాత్రి జరగకపోవడానికి కారణం రాజ్యలక్ష్మి కదా అని పరంధామయ్య ఆవేశపడతాడు. తను చిక్కుల్లో ఉన్న సంగతి దివ్యకి తెలియకూడదని తులసి చెప్తుంది. నందు దగ్గర ఎందుకు దాచావని అంటే చెప్పడానికి నోరు పెగల్లేదు. దివ్య బంగారు పంజరంలో ఉన్నంత మాత్రాన సుఖంగా లేదని ఇప్పుడే తెలిసిందని బాధపడుతుంది. దివ్య విషయంలో ఇప్పటికే దిగులుగా ఉంటున్నారు ఈ విషయం చెప్తే కుప్ప కూలిపోతారు చెప్పొద్దని చెప్తుంది. నందు ఆవేశంగా లాస్య దగ్గరకి వెళతాడు. అప్పుడే లాస్యకి రాజ్యలక్ష్మి మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నందు ఆ ఫోన్ తీసుకుని రాజ్యలక్ష్మి మేనేజర్ నీకు కాల్ చేయాల్సిన అవసరం ఏంటని అడుగుతాడు.
Also Read: పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కృష్ణ- మురారీ మీద ప్రేమ చిగురిస్తుందా?
ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. రాజ్యలక్ష్మి మేడమ్ డబ్బులున్న బ్రీఫ్ కేసు మీకు ఇచ్చేయమన్నారు ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వమంటారని అడుగుతాడు. లాస్య ఫోన్ తీసుకుని పారిపోతుంటే అడ్డుపడతాడు.
నందు: రాజ్యలక్ష్మి డబ్బు తిరిగి నీకు ఎందుకు ఇస్తుంది
లాస్య: అవసరం కోసం అడిగాను కదా అందుకే ఇస్తుంది నువ్వు వద్దు అంటే వద్దని చెప్తాను
నందు: వద్దని నేను తులసి చెప్పాం అయినా పంపిస్తుందంటే ఏంటి కారణం. దివ్యని తన కోడలుగా చేసినందుకు రాజ్యలక్ష్మి నీకు ఆ డబ్బు ఇస్తుంది. ఇది నిజం, ఆ డబ్బు తీసుకుని టాక్స్ వాళ్ళని పోలీసుల్ని పిలిచి రోడ్డు మీదకు లాగుతాను అప్పుడు ఎవరి మధ్య డీల్ ఏంటో తెలుస్తుంది
లాస్య: రాజ్యలక్ష్మిని రోడ్డున పడేస్తే నష్టం నాకు కాదు దివ్యకి. పిచ్చి పిచ్చి అనుమానాలతో గొడవలు పెద్దవి చేయకు
నందు: ఇవి అనుమానాలు కావు నువ్వు రాజ్యలక్ష్మితో మాట్లాడుతుంటే తులసి విన్నది(ఓ చెప్పేసిందా అని లాస్య మనసులో అనుకుంటుంది). నన్ను ఎన్నో రకాలుగా మోసం చేసినా భరించాను. కానీ నీ డబ్బు కోసం రాజ్యలక్ష్మితో చేతులు కలిపి ఇలా చేశావ్ నా పిల్లలు అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు అలాంటి నా పిల్లల్ని ఇబ్బంది పెట్టిన నిన్ను ఇంట్లో ఉండనివ్వను వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపో
లాస్య: నా ఇంటిని భర్తని వదిలేసి ఎక్కడికి వెళ్తాను
Also Read: యష్ వేద కోసం కొన్న డ్రెస్ వేసుకున్న మాళవిక- ఇద్దరి మధ్య చిచ్చు మళ్ళీ రగిలేనా?
నువ్వు మాటలతో చెప్తే వినవని తనని గది నుంచి బయటకి లాక్కోస్తాడు. దివ్యని నేనేమీ బలవంతంగా పెళ్లి చేయలేదు కదా విక్రమ్ ని పెళ్లి చేసుకోవడానికి నేను ఛాన్స్ తీసుకున్నా. ఊరికే వచ్చే డబ్బు పోగొట్టడం ఎందుకని నేను అడ్డం పెట్టుకున్నా.
నందు: రాజ్యలక్ష్మి పగతో దివ్యని కోడల్ని చేసుకుంటుందని నీకు తెలుసు ఆ విషయం నా దగ్గర దాచావ్ అది తప్పు కదా తులసి మీద కోపాన్ని పెంచుకుని ఈ ఇంటిని నరకం చేశావ్. నన్ను ఏడిపించుకుని తిన్నావ్ మా మధ్య దూరాన్ని పెంచావ్ ఎప్పుడైతే దివ్య జీవితాన్ని నాశనం చేశావని తెలిసిందో అప్పుడే నువ్వు మారవని అర్థం అయ్యింది. నిన్ను ఇంట్లో నిమిషం కూడా ఉండనివ్వను అనేసి ఇంట్లో నుంచి లాస్యని బయటకి గెంటేస్తాడు. 24 గంటల్లోగా నీ చేతులతోనే నా కాళ్ళు పట్టుకుని ఇంట్లోకి రమ్మనేలా చేస్తానని లాస్య ఛాలెంజ్ చేస్తుంది.