విక్రమ్ దివ్య ఫోటో చూసుకుంటూ మురిసిపోతాడు. అమ్మకి మాట ఇచ్చి మళ్ళీ ఇవన్నీ ఎందుకని దేవుడు అంటాడు. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను కానీ నువ్వు చూపించిన అమ్మాయినే చేసుకుంటానని ఇవ్వలేదు. నేను ఇష్టపడే అమ్మాయినే అమ్మ కూడా ఇష్టపడేలా చేసి పెళ్లి చేసుకుంటాను. గాడ్ రైటింగ్స్ నో బడీ ఛేంజింగ్స్ అని విక్రమ్ అంటాడు. అబ్బో మీకు బుర్ర ఉందేనని దేవుడు మెచ్చుకుంటాడు. కాసేపు ఇద్దరూ కామెడీగా మాట్లాడుకుంటారు. నందు తులసి ఇంకా కనిపించడం లేదేంటని అనుకుంటాడు.తులసి జ్వరంతో మూసిన కళ్ళు తెరవకుండా పడుకుని ఉందని వాసుదేవ్ వచ్చి చెప్తాడు. దీంతో నందు టెన్షన్ గా తులసి గదికి వెళ్తాడు. ఖర్చిఫ్ తడిపి తన నుదిటి మీద పెడుతూ గతం గుర్తు చేసి తులసిని బాధపెట్టి ఉంటాను. భర్తగా ఉన్నప్పుడు ఏ సంతోషాన్ని ఇవ్వలేదు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా సంతోషంగా ఉండనివ్వడం లేదు పాపిష్టి వాడినని నందు కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
Also Read: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి
తులసిని జాగ్రత్తగా పైకి లేపి కూర్చోబెట్టి ట్యాబ్లెట్ ఇస్తాడు. అదంతా లాస్య చూసి కోపంగా వాళ్ళ దగ్గరకి వెళ్తుంది. నిజంగా జ్వరం వచ్చిందా లేదంటే తెప్పించావా అని వెటకారం చేస్తుంది. నందు కోపంగా వెళ్తుంటే తులసి ఆపుతుంది. స్టార్టింగ్ లో నటన అనుకున్నా కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు ఎక్కడో తేడా కొడుతుంది. మనకి కేఫ్ కూడా ఉంది దాని బాధ్యత కూడా చూసుకోవాలి కదా బయల్దేరదామా అని లాస్య అంటుంటే వాసుదేవ్ వస్తాడు. తర్వాత వస్తాను వెళ్లిపొమ్మని నందు చెప్తాడు. కట్టుకున్న భార్యని చూసుకోవాలి కేఫ్ వర్క్ లాస్యని చూసుకోమని చెప్పమని వాసుదేవ్ అంటాడు. దీంతో లాస్య కోపంగా వెళ్ళిపోతుంది. భార్య జ్వరం మందులతో మూడు రోజుల్లో తగ్గిపోతుంది కానీ భర్త పక్కన ఉండి ప్రేమగా చూసుకుంటే ఒక్కరోజులోనే తగ్గిపోతుంది. గోరంత ప్రేమిస్తే కొండంత ప్రేమ తిరిగి ఇస్తుంది. భర్త తన పక్కన ఉంటే భార్యకి ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది తులసిని దగ్గరుండి చూసుకోమని చెప్తాడు.
దివ్య రోడ్డు పక్కన కూరగాయలు తీసుకుంటుంటే అటుగా వెళ్తున్న విక్రమ్ కారు దిగి తన దగ్గరకి వెళ్తాడు. కూరగాయల గురించి దివ్యకి క్లాస్ తీసుకుంటాడు. దివ్య, విక్రమ్ నడుచుకుంటూ వస్తుండగా భాగ్యం చూస్తుంది. ఎవడు వాడు పక్కన ఉన్నాడని డౌట్ పడుతుంది. ఇదేదో లాస్యకి ఉపయోగపడేదిలా ఉందని తనకి ఫోన్ చేసి దివ్య గురించి చెప్తుంది. వంట వచ్చిన అబ్బాయి అంటే తనకి చాలా ఇష్టమని అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. మీరు కూడా ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పమని దేవుడు అంటాడు. సన్నగా పొట్లకాయలా ఉండాలని అంటుంది. మీరు కోరుకున్న అమ్మాయి చాలా కష్టమని చెప్పేసి వెళ్ళిపోతుంది. పెళ్లి చూపులంటే చిటపటలాడే పాప అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతుందని చిత్రంగా ఉందని లాస్య అంటుంది. వాళ్ళ సంగతి ఏంటో చూడమని చెప్తుంది. దివ్య, విక్రమ్ ని భాగ్య ఫోటోలు తీస్తుంది.
Also Read: తులాభారం ఆపేందుకు విన్నీ స్కెచ్- వేద తన ప్రేమతో భర్తని దక్కించుకుంటుందా?
దివ్య బైక్ టైర్ పంక్చర్ అవడంతో విక్రమ్ తన కారులో డ్రాప్ చేస్తానని అంటాడు. దీంతో విక్రమ్ కారు ఎక్కుతుంది. నందు తులసి కోసం సూప్ చేయడం కోసం స్టవ్ దగ్గరకి వస్తాడు. రాములమ్మ ఏం కావాలని అడుగుతుంది. సూప్ చేద్దామని వచ్చానని చెప్తాడు. మీకోసం ఎప్పుడు ఏమి చేయలేదు మొదటి సరి తులసమ్మ గారి కోసం సూప్ చేయడానికి వచ్చారంటే ఆశ్చర్యంగా ఉందని తను అంటే మీకిష్టమని అర్థం అయ్యిందని అంటుంది. నందు తులసి కోసం సూప్ చేసి తీసుకొచ్చి తాగిస్తాడు..