దివ్య రెడీ అయి స్పెషల్ క్లాస్ అని తులసికి అబద్ధం చెప్తుంది. తులసి కోపంగా అడిగేసరికి లాస్య వచ్చి కవర్ చేస్తుంది. దీంతో తులసి దివ్యని వెళ్ళమని చెప్తుంది. దివ్య తన ఫ్రెండ్ బర్త్ డే పారికి వచ్చి డాన్స్ లు చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఆ పార్టీకి వచ్చిన బాయ్స్ కూల్ డ్రింక్స్ లో మత్తు ట్యాబ్లెట్స్ వేసి దాన్ని దివ్యకి ఇస్తారు. అది నార్మల్ కూల్ డ్రింక్ అనుకుని దివ్య తాగేస్తుంది. దివ్య ఇంకా ఇంటికి రాలేదని లాస్య టెన్షన్ పడుతుంది. అబద్ధం చెప్పి పంపించింది నేనే అని తెలిస్తే నా పని గోవిందా, ఉత్తమ ఇల్లాలు కాదు ఉన్న పోస్ట్ కూడా పోయేలా ఉండే అని కంగారుగా మళ్ళీ దివ్యకి ఫోన్ చేస్తుంది. ఇంకొక గంట పడుతుంది రావడానికి ఎలాగోలా మానేజ్ చెయ్యమని దివ్య అడుగుతుంది.


తులసికి విషయం తెలిస్తే చంపేస్తుందని లాస్య భయపడుతూ ఉంటుంది. అటు కూతురు ఇంకా ఇంటికి రాలేదని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంకిత దివ్యకి ఫోన్ చేస్తుంది. కానీ సాంగ్స్ గోలలో ఫోన్ వినపడక లిఫ్ట్ చేయదు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగేసరికి దివ్యకి మత్తుగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తులసికి టెన్షన్ మరింత పెరుగుతుంది. అనవసరంగా దివ్య విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను అందరూ కలిసి తన మీద పడి తిడతారేమో అని లాస్య భయంతో వణికిపోతుంది. పార్టీ అయిపోయి అందరూ వెళ్లిపోతుంటే దివ్య కళ్ళు తిరుగుతున్నాయని అంటుంది. కూల్ డ్రింక్ లో మత్తు కలిపిన్ బాయ్స్ దివ్యని తీసుకుని వాళ్ళ కారులో ఎక్కించుకుంటారు.


Also Read: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?


ప్రేమ్ వచ్చి దివ్య అబద్ధం చెప్పిందని శ్రుతి, అంకితకి నిజం చెప్తాడు. అసలు స్పెషల్ క్లాస్ లేదని అంటాడు. అటు నందు కూడా కంగారుగా దివ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. తను లిఫ్ట్ చేయకపోయేసరికి లాస్య వచ్చి నిజం చెప్తుంది. ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందంటే స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పి వెళ్ళమని సలహా ఇచ్చాను గంటలో వచ్చేస్తాను అంది ఇలా అవుతుందని అనుకోలేదని లాస్య నందుకి చెప్పేస్తుంది. దీంతో నందు కోపంగా చెయ్యి ఎత్తుతాడు. ఇంట్లో అందరూ దివ్య కోసం కంగారు పడుతూ ఉంటే నందు వచ్చి తులసిని తిడతాడు. నువ్వు నువ్వులా ఉండాల్సింది నీ జాగ్రత్త తీసుకుంటే ఈ తలనొప్పి ఉండేది కాదని అంటాడు. దివ్య స్పెషల్ క్లాస్ కి కాదు వెళ్ళింది తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి అని చెప్తాడు. ఆ మాటకి తులసి కోపంగా మీకెలా తెలుసని అంటుంది.


Also read: లాస్య వల్ల ప్రమాదంలో పడిన దివ్య జీవితం- కూతుర్ని తులసి కాపాడుకుంటుందా?


లాస్య చెప్పిందని అంటాడు. అడిగితే నువ్వు పార్టీకి వెళ్ళనివ్వను అని ఏడిస్తే అబద్ధం చెప్పి లాస్య పంపించిందని చెప్తాడు. ఆ మాటకి తులసి కోపంగా లాస్యని తిడుతుంది. ఇంతవరకు దివ్య నాతో అబద్ధం చెప్పింది లేదు నీ పుణ్యమా అని అది కూడా జరిగిపోయింది అని అరుస్తుంది. దివ్య బాధపడుతుంటే జాలితో ఇచ్చిందిలే అని నందు కవర్ చేస్తాడు. కానీ తులసి మాత్రం జాలి కాదు దొంగ ప్రేమ నటించిందని అంటుంది.