సామ్రాట్ సరదాగా మాట్లాడుతుంటే ప్రేమ్ గుర్తుకు వచ్చాడని తులసి బాధపడుతుంది. వాడి సరదా అల్లరి మిస్ అవుతున్నా అని తులసి అనేసరికి అందుకే మేం వచ్చేశాం అని కొడుకులు, కోడళ్ళు, కూతురు అందరూ వచ్చేస్తారు. ఆ ఇంట్లో తీరని కోరిక ఈ ఇంట్లో తీరిందని సామ్రాట్ అంటాడు. శ్రుతిని జాగ్రత్తగా చూసుకుని డెలివరీ చేయాలని అంకిత అంటే, పుట్టే బిడ్డని మొదటిసారి మీరే ఎత్తుకోవాలి అని శ్రుతి అంటుంది. ఆ మాటలకి తులసి పొంగిపోతుంది. దానికి మధ్య మధ్యలో కామెడీ టచ్ ఇచ్చేస్తుంది దివ్య. ఇలా కాదు గంతకి తగ్గ బొంతని పట్టుకుని దివ్యకి పెళ్లి చెయ్యాలని అందరూ కాసేపు ఆట పట్టిస్తారు. మీరందరూ ఇక్కడికి వస్తున్నట్టు ఇంట్లో చెప్పారా అని తులసి అడుగుతుంది. లేదని చెప్తారు.


Also Read: ఊహించని ట్విస్ట్, గతం మర్చిపోయిన వేద- షాక్లో యష్, రగిలిపోతున్న మాళవిక


నందు లాస్యని కూర్చోబెట్టి అందరినీ పిలుచుకుని వస్తాను పార్టీ ప్లాన్ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేద్దాంఅని అంటుంది. లాస్య చాలా మారింది, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవడం లేదని నందు అనుకుంటాడు. లాస్య వచ్చి వాళ్ళు ఇంట్లో ఎవరు లేరని చెప్తుంది. వాళ్ళు మనకి చెప్పకుండా వెళ్లారు, మనకి విలువ ఇవ్వడం లేదని లాస్య ఎక్కిస్తుంది. ఇందాక గొడవ అయ్యింది కదా ఎక్కడో కూర్చుని మాట్లాడుకుంటున్నారేమో వచ్చాక చూద్దాంలె అని నందు అంటాడు. అంతా కట్టుకుని తులసి ఇంటికి వెళ్లారు, మళ్ళీ అదే జరిగిందా అని లాస్య అనుకుంటుంది. అదే జరిగితే తులసికి చుక్కలు చూపించాలని అనుకుంటుంది.


తులసి ఇంట్లో ప్రేమ్, శ్రుతిని గదిలో కూర్చోబెట్టి సర్ ప్రైజ్ పార్టీ ఎరేంజ్ చేస్తారు. వాళ్ళ కళ్ళు మూసి బయటకి తీసుకొస్తారు. ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి కేక్ కట్ చేయిస్తారు. అందరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కేక్ ముందు నాకు తినిపించాలంటే నాకు అని ప్రేమ్, శ్రుతి అని ఇద్దరూ సరదగా వాదులాడతారు. తన కొడుకుని ప్రేమగా చూసుకుంటూ వారసుడి ఇస్తున్న కోడలికే ముందు కేక్ పెడతాను అని తులసి అంటుంది. ఇంట్లో పరంధామయ్య కూర్చుని పేపర్ చూస్తుంటే అందరూ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని లాస్య మనసులో అనుకుంటుంది. ఇంట్లో ఎవరు ఉన్నట్టు లేరు టీ పెట్టమంటారా అని అడుగుతుంది. అవునా నాకు తెలియదే అని ఏం ఎరగనట్టు మాట్లాడతాడు. కాసేపు లాస్యని ఆట ఆడుకుంటాడు.


Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?


తులసి ఇంట్లో అందరూ పాటలు పెట్టుకుని డాన్స్ లు వేస్తూ ఉంటారు. లాస్య పరంధామయ్యకి ఫోన్ నుంచి దివ్యకి కాల్ చేస్తుంది. చేసింది తాతయ్య అనుకుని తులసి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నామని అంతా చెప్పేస్తుంది. అది విని లాస్య రగిలిపోతూ నందు దగ్గరకి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి మనం అంటే ప్రేమ కాదు కదా గౌరవం కూడా లేదని లాస్య కస్సుబుస్సులాడుతుంది. అందరూ రెస్టారెంట్ కి వెళ్ళి సెలెబ్రేట్ చేసుకుంటున్నారేమో అని నందు అంటాడు. కానీ అందరూ వెళ్ళింది తులసి ఇంటికి అక్కడ పండగ చేసుకుంటున్నారు. తులసి పైకి కనిపించేంత మంచిది కాదు’ అని లాస్య ఎక్కిస్తుంది. నీకు చెప్పకుండా వాళ్ళంతా తులసి ఇంట్లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారని నూరిపోస్తుంది. లాస్య మాటలకి నందు కోపంగా తులసి దగ్గరకి బయల్దేరతాడు.