తులసి చిన్నతనంలో తను దాచుకున్న వస్తువులన్నీ బయటకి తీస్తుంది. అందులో ఉన్న ఒక్కో వస్తువు చరిత్ర గురించి చెప్పమని అడుగుతాడు. ఒక్కొక్కటికి బయటకి తీస్తూ వాటి గురించి తులసి చెప్తుంటే సామ్రాట్ నోరు తెరుచుకుని మరీ వింటూ ఉంటాడు. అంకిత లాస్య మాటలు తల్చుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన దగ్గరకి అనసూయ, పరంధామయ్య వస్తారు.


అంకిత:  నేను చేసే మంచి పని కూడా తనకి ఫేవర్ గా మార్చుకుని అంకుల్ దగ్గర నన్ను తప్పుగా చేసింది. నా పేషెంట్స్ దగ్గర తను ఫీజు వసూలు చెయ్యడం ఏంటి తాతయ్య


అనసూయ: నందుని మాయ చేసి వాడి ముందు మనల్ని వెర్రి వాళ్ళని చేస్తుంది


అభి: మనిషి ఎలాంటిది అయినా మంచి చెప్తే ఒప్పుకోవాలి


పరంధామయ్య: పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడం తప్పు ఎలా అవుతుంది


అభి: లాస్య ఆంటీ తప్పు పట్టలేదు కదా, సెటిల్ అయినాక చేయమంది. ముందు మనం నాలుగు రాళ్ళు వెనకేసుకోకపోతే ఎదుగుబోదుగు ఉండదు


Also Read: సా.. గుతున్న తులసి హోమ్ టూర్- లాస్య తానా అంటే తందాన అంటున్న నందు


ఆ మాటలకి అంకిత కోపంగా వెళ్ళిపోతుంది. తులసి ఇంటి నుంచి వెళ్లిపోతూ గెట్ దగ్గర భయంకరమైన ఫోజులు పెట్టి మరీ ఫోటోస్ దిగుతుంది. పరంధామయ్య పేపర్ పట్టుకుని కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉంటాడు. అది చూసి అనసూయ, శ్రుతి నవ్వుకుంటారు. కునికి పాట్లు పడుతూ ముందుకు పడబోతాడు. మెళుకువ వచ్చి నిద్ర ఆపుకోలేకపోతున్న కాస్త వేడి టీ పెట్టుకుని తీసుకురమ్మని అడుగుతాడు. ఫ్రిజ్ కి తాళం వేసి ఉండేసరికి శ్రుతి లాస్య దగ్గరకి వెళ్ళి పాల ప్యాకెట్ కావాలని అడుగుతుంది. ఈరోజు కోటా రెండు సార్లు ఇచ్చావ్ కదా మళ్ళీ ఇదేంటి అని లాస్య అడుగుతుంది. నిద్ర వస్తుందని టీ తాగితే ఎలా, రోజుకి రెండు సార్లు మాత్రమే టీ అయినా కాఫీ అయిన అని లాస్య తెగేసి చెప్తుంది.


శ్రుతి కోపంగా వెళ్ళిపోతుంది. సామ్రాట్, తులసి వాళ్ళు కారులో వెళ్తుంటే ముగ్గురు ఆడవాళ్ళు ఎదురుగా నిలబడతారు. వాళ్ళని చూసి తులసి ముందుగా గుర్తు పట్టదు. ముందు కారు దిగండి అని కోపంగా అంటారు. సామ్రాట్ వాళ్ళు కారు దిగి విషయం ఏంటి చెప్పమని అడుగుతాడు. నీకు ఈ సీన్ లో డైలాగ్ లు లేవు పక్కన నిలబడమని సామ్రాట్ తో వాళ్ళలో ఒకామే అంటుంది. వాళ్ళ మాటలు విని తులసి తన చిన్ననాటి స్నేహితులని గుర్తు పడుతుంది. పట్టరాని సంతోషంతో వాళ్ళని కౌగలించుకుని మాట్లాడుతుంది.


Also Read: హడలెత్తించిన భ్రమరాంబిక- మాళవికని ఇంట్లో నుంచి పంపించేయమన్న అభీ సిస్టర్


నువు ఊర్లోకి వచ్చావని తెలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చేశామని వాళ్ళు చెప్తూ ఉంటారు. సామ్రాట్ ని చూసి తులసి భర్త అనుకుంటారు. ‘నీది లవ్ మ్యారేజ్ కదా సినిమా హీరోలా భలే ఉన్నాడు. ఈడు జోడు సూపర్. పిల్లలు ఎంత మంది’ అని స్నేహితులు వరుస పెట్టి ప్రశ్నలు వేస్తారు. వాటికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తులసి ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.