ముగ్గురు పిల్లల తల్లి సామ్రాట్ వేస్తున్న వేషాలు తులసికి తెలియదా ఏంటి అని లాస్య అంటుంది. సామ్రాట్ గురించి తులసికి ఏమి తెలియదు తెలిస్తే సామ్రాట్ ఎప్పుడో దూరం అయ్యేదని నందు వెనకేసుకొస్తాడు. వాళ్ళిద్దరూ ఒక్కటి అవ్వాలనుకుంటే అవనివ్వు నేకఎన్టీ ప్రాబ్లం అని లాస్య అడుగుతుంది. విడాకులు తీసుకుని నువ్వు వేరే పెళ్లి చేసుకునప్పుడు తులసి అదే దారిలో నడిస్తే తప్పేంటి అని అంటుంది. తులసి సామ్రాట్ తో కలిసి వైజాగ్ వెళ్లనివ్వకుండా ఏదో ఒకటి ప్లాన్ చెయ్యమని చెప్తాడు. ఇక తన తల్లి అనసూయకి కాల్ చేసి మా బాస్ సామ్రాట్ అంత మంచోడు కాదని అంటే అయితే నీ పెళ్ళాం జాగ్రత్త అని అనసూయ కౌంటర్ ఇస్తుంది. అది విని లాస్య నవ్వుతుంది. లాస్యని చూసుకోడానికి నేను ఉన్నాను.. నా భయం అంతా తులసి గురించే అంటాడు. నువ్వేమి కంగారు పడకు ఓ తింగరోడిని కట్టుకుని 25 ఏళ్లు కాపురం చేసి డక్కముక్కలు తిన్నది దాని గురించి నువ్వేమి ఆలోచించి బీపీ పెంచుకోకని అనసూయ సలహా ఇస్తుంది. ఆ సామ్రాట్ వైజాగ్ టూర్ కి వెళ్తూ తనతో పాటు తులసిని కూడా రమ్మన్నాడు.. తులసికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాడు అది నీకు అర్థం అవుతుందా.. వీడెప్పుడు ఇంతే తులసి గురించి కంప్లైంట్ ఇస్తాడని అనుకుంటున్నవా నా టెన్షన్ అంతా తులసి గురించి కాదు సామ్రాట్ గురించి. తులసి సామ్రాట్ తో వైజాగ్ వెళ్తానని అడుగుతుందేమో నో అని చెప్పు. మన కుటుంబం పరువు గురించి ఆలోచించు అనేసరికి అనసూయ ఫోన్ కట్ చేస్తుంది. చూస్తూ ఉండు మా అమ్మ తులసిని వైజాగ్ వెళ్లనివ్వకుండా ఆపుతుందని నందు అంటాడు.


తులసి సామ్రాట్ వైజాగ్ టూర్ గురించి ఆలోచిస్తుంది. అది అనసూయ డల్ గా కూర్చుని ఉండటం చూసి పరంధామయ్య ఏమైందని అడుగుతాడు. తులసి వైజాగ్ టూర్ గురించి అడుగుదామని వాళ్ళ దగ్గరకి వచ్చి ఏం మాట్లాడకుండా జంకుతుంది. చేసేది అడిగేది తప్పు అనిపించినప్పుడు ఇబ్బందిగానే ఉంటుందని అనసూయ అంటుంది. తులసి అడగకుండా వెళ్లబోతుంటే అనసూయ ఆపుతుంది. ఆగు అలా వెళ్లిపోతే ఏమనుకోవాలి అని వైజాగ్ ప్రయాణం ఎప్పుడు అని అనసూయ తులసిని అడుగుతుంది. తులసి భయంభయంగా నీళ్ళు నములుతుంది. వైజాగ్ ప్రయాణం ఏంటి అనసూయ అని పరంధామయ్య అడుగుతాడు. ఈ పిచ్చిది ఆఫీసు పనిమీద రేపు వైజాగ్ వెళ్లాలి ఆ విషయం మనకి చెప్పి అనుమతి తీసుకోవడానికి కిందా మీద పడుతుందని అసలు విషయం చెప్పేస్తుంది అనసూయ. అత్తయ్యా మీకు..  అని తులసి అంటే నాకు అంతా తెలుసమ్మా అంటుంది. నువ్వు చేసేది తప్పు అని అనిపించనప్పుడు ఎందుకు భయం అని పరంధామయ్య అంటాడు. నువ్వు అలా మమ్మల్ని వదిలేసి తిరుగుతూ ఉంటే ఇంట్లో మా పరిస్థితి ఏం కావాలి మామ్ అని దివ్య అనడంతో అందరూ షాక్ అవుతారు.


సీన్ హనీ దగ్గరకి వస్తుంది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నాకే తెలియదు.. ఎక్కడ తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు కదా నాన్న అని బాధగా అడుగుతుంది. ఆ దేవుడు అందరికీ అన్ని ఇవ్వరమ్మా ఉన్న వాటితోనే తృప్తి పడాలి అని సామ్రాట్ సర్ది చెప్తాడు. నాన్న అమ్మ బయటికి ఉంటే తులసి అంటిలాగా ఉండేది కదా.. తులసి ఆంటీని అమ్మా అని పిలవాలనిపిస్తుంది. కానీ భయం అమ్మా అని పిలిస్తే ఏమనుకుంటుందో. తులసికి నేనంటే చాలా ఇష్టం. తను చాలా ప్రేమగా చూసుకుంటుందని హనీ చెఫ్తుంటే సామ్రాట్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సామ్రాట్ నిద్రపోతుంటే తులసి కలలోకి వస్తుంది. సడన్ గా నిద్ర లేచి ఎందుకు ఇలాంటి కల వచ్చింది, ఎందుకు ఇలాంటి తప్పు జరిగింది. తులసి నా ఫ్రెండ్ మాత్రమే. కేవలం ఫ్రెండ్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కలలు కనకు అని తనకి తాను సర్ది చెప్పుకుంటాడు.


Also Read: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ


తులసి ఇంట్లో అందరూ డల్ గా కూర్చుని ఉంటారు. ఒక్కరోజు అమ్మ ఇంట్లో లేకపోతే పనులు చేసుకోలేవా అమ్మని ఆడగాళా అని ప్రేమ అంటాడు. నేను ఏదో సరదాకి అంటే అందరూ ఇలా ఉంటారా అని దివ్య అంటుంది. నువ్వు ఇలా సీరియస్ గా ఉంటే అసలు బాగోలేదు నవ్వు మామ్ అని అంటే తులసి పగలబడి నవ్వుతుంది నీకే కాదు నాకు కూడ జోక్ చెయ్యడం వచ్చు అని అంటుంది. ఇక అందరూ తులసి వైజాగ్ వెళ్తుందన్నందుకు కంగ్రాట్స్ చెప్తారు ఒక అభి తప్ప. ఇక ఈ విషయం గురించి అభికీ ఇంట్లో వాళ్ళకి మధ్య వాదన జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఉండాలో అంకిత తులసికి చెప్తుంది. నందు తినడానికి రమ్మని లాస్య పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని అంటాడు. తులసి సామ్రాట్ తో కలిసి వైజాగ్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం అని లాస్య అంటే అమ్మకి చెప్పాను అమ్మ ఆపుతుందని నందు అంటాడు. అలా అని నీకు చెప్పిందా అంటే మౌనంగా ఉందని అంటాడు. తులసి ఏమడిగినా వాళ్ళు ఒప్పుకుంటారు చూస్తూ ఉండు అని లాస్య అంటుంది.


Also Read: తల్లి కాబోతున్న కాంచన- వేద మీద కోపంతో రగిలిపోతున్న మాలిని, బాధలో చిత్ర


తరువాయి భాగంలో..


సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తాడు. ఎనిమిది అవుతుంది ఇంకా రాలేదేంటి అని ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయ్యిందని అంటాడు. చూడండి మీరు వెంటనే బయల్దేరి రాకపోతే నెక్స్ట్ ఫ్లైట్ కూడా మిస్ అవుతుందని చెప్తాడు. దీంతో తులసి టెన్షన్ గా దిగబోతు మంచం మీద నుంచి కింద పడిపోతుంది.