మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)ది మామూలు స్పీడ్ కాదు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేయగల జోరు, హుషారు ఆయనకు ఉంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఛాన్సులు ఇచ్చేటప్పుడు సైతం తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలు విజయాల్లో ఉన్నారా? అపజయాల్లో ఉన్నారా? అనేది చూడరు. అటువంటి హీరో తనకు 'కిక్' ఇచ్చిన దర్శకుడికి మరోసారి ఛాన్స్ ఇస్తారా? అని ఫిలిం నగర్ వెయిట్ చేస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే... 


రవితేజ దగ్గరకు వెళ్లిన సురేందర్ రెడ్డి!
అగ్ర హీరోలతో సినిమాలు చేసి విజయాలు అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy). ఇప్పుడు ఆయన సిట్యువేషన్ బాలేదు. అఖిల్ అక్కినేని హీరోగా చేసిన 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. 'ఏజెంట్' తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేసే అవకాశం సురేందర్ రెడ్డికి వచ్చింది. కానీ, ఏపీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించడం, పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనేది డైలమాలో పడింది. 


పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితిలో మాస్ మహారాజా రవితేజ దగ్గరకు సురేందర్ రెడ్డి వెళ్లారట. వాళ్లిద్దరి కలయికలో వచ్చిన 'కిక్' ఎంత భారీ విజయం సాధించిందో? ఎంత మంది ప్రేక్షకులను నవ్వించిందో? తెలిసిన విషయమే. అయితే, ఆ తర్వాత 'కిక్ 2' బోల్తా కొట్టింది. ఇప్పుడు సురేందర్ రెడ్డికి రవితేజ ఛాన్స్ ఇస్తారో? లేదో? వెయిట్ అండ్ సి.


అల్లు అర్జున్, రామ్ చరణ్... మెగా ఫ్యామిలీ హీరోలతో సురేందర్ రెడ్డికి చక్కటి అనుబంధం ఉంది. వాళ్లిద్దరితో 'రేసు గుర్రం', 'ధ్రువ' సినిమాలు చేశారు. అయితే, ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలకు కమిట్ కావడంతో వాళ్లిద్దరితో సినిమా అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. గ్యాప్ ఎక్కువ అవుతుంది. రవితేజ చేతిలో ఉన్న ఒక్క సినిమా త్వరగా ఫినిష్ అవుతుంది. ఆయన ఓకే అంటే సురేందర్‌ రెడ్డి సినిమా వెంటనే స్టార్ట్‌ అవుతుంది.


Also Read: ప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా - 'రాజా సాబ్' వెనుక 'మిరాయ్' రిలీజ్ డౌటే!



'మిస్టర్ బచ్చన్' తర్వాత మరొకటి లైనులో పెట్టిన రవితేజ!
Ravi Teja Upcoming Movies: ఆగస్టు 15న 'మిస్టర్ బచ్చన్' సినిమాతో థియేటర్లలో వస్తున్నారు రవితేజ. 'షాక్', 'మిరపకాయ్' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా అది. అది రవితేజకు 74వ సినిమా. ఇక కెరీర్ మైల్ స్టోన్ మూవీ (RT 75)ని కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు రవితేజ. యువ రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు గనుక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఓకే చేస్తే రవితేజకు అది 76వ సినిమా అవుతుంది.


Also Read'మిస్టర్ బచ్చన్'లో ఒరిజినల్ రవితేజ - ఆ రోల్, మూవీపై దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూ ఏమిటంటే?