గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన 'గేమ్ ఛేంజర్' మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. పాన్ ఇండియా మూవీగా థియేటర్లోకి వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ ఈ సినిమా ఫలితాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది.
RC 16 షూటింగ్ అప్డేట్
'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ కాకముందే రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని షురూ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో 'ఆర్సీ 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు కీలకమైన షెడ్యూల్స్ పూర్తి కాగా, నెక్స్ట్ షెడ్యూల్ ను జనవరి ఎండింగ్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జనవరి 27 నుంచి హైదరాబాద్లో జరగబోయే 'ఆర్సీ 16' నెక్స్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు.
షూటింగ్ రీ షెడ్యూల్
ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ షెడ్యూల్ కు సంబంధించి సెట్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ షెడ్యూల్ ను ఫిబ్రవరిలో ప్లాన్ చేయగా, సెట్ వర్క్ అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి కావడంతో జనవరి చివరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ కూడా షూటింగ్లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'ఆర్సీ 16' నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 27న స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించడంతో డైరెక్టర్ బుచ్చిబాబు షూటింగ్ ను జెట్ స్పీడ్ తో పూర్తి చేసే పనిలో పడ్డారు. అలాగే రామ్ చరణ్ కూడా 'గేమ్ ఛేంజర్' ఫలితాన్ని పట్టించుకోకుండా 'ఆర్సీ 16' మూవీని పూర్తి చేయడంపై కంప్లీట్ గా ఫోకస్ పెట్టారు.
Also Read: దర్శకుడిగా ధనుష్ లేటెస్ట్ సినిమాకు ఎస్‌జే సూర్య రివ్యూ... 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఎలా ఉందంటే?
రెండేళ్ల నిరీక్షణ తర్వాత సెట్స్ పైకి...
ఇదిలా ఉండగా మొదటి సినిమా 'ఉప్పెన'తోనే సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు రెండవ సినిమాను రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో చేస్తుండడం విశేషం. ఆర్సీ 16' సినిమాను చేయడానికి బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల పాటు వెయిట్ చేశారు. చాలా కాలం క్రితమే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ను బుచ్చిబాబు మొదలు పెట్టారు. దీంతో 'ఆర్సీ 16' రామ్ చరణ్ కెరియర్లో గుర్తుండిపోయే మరో మంచి మూవీ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం.
Read also : NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్గా ఉందా?