Geethanjali Malli Vachindi Trailer Out: తెలుగు బ్యూటీ అంజలి టాలీవుడ్ లో కంటే తమిళ సినిమా పరిశ్రమలో బాగా రాణిస్తోంది. ఆమె నటించిన పలు సినిమాలు కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా చేస్తోంది. 2014లో కామెడీ, హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఇప్పుడు ఈ చిత్రం రాబోతోంది.


ఆకట్టుకుంటున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్


‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోన వెంక‌ట్ ఈ సినిమాకు క‌థ, స్రీన్ ప్లే అందించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వుతూ భయపెట్టే ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.


ఇక ఈ సినిమా ట్రైలర్ ను పరిశీలిస్తే, ‘గీతాంజలి’ సినిమాలో మాదిరిగానే ఈ చిత్రంలోనూ శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా నటిస్తున్నారు. ఆయన అంజలితో పాటు తన టీమ్ తో ఓ హారర్ సినిమా చేయాలి అనుకుంటారు. అందరూ కలిసి ఓ పాత బంగళాకు వెళ్తారు. అక్కడే సినిమా షూటింగ్ మొదలు పెడతారు. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో వింత వింత ఘటనలు జరుగుతాయి. అంతేకాదు, దెయ్యాల కారణంగా చిత్రబృందం ఎలాంటి ఇబ్బందులు పడింది? ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎక్కడివి? వాటి నుంచి శ్రీనివాస్ రెడ్డి టీమ్ ఎలా బయటపడింది? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.  



ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’


కామెడీ, హారర్ జానర్ లో రూపొందుతున్న‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


అంజలి కెరీర్‌లో 50వ చిత్రం  


‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా అంజ‌లి కెరీర్ లో 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన హాఫ్ సెంచరీ మూవీ కాస్త కొత్తగా ఉండాలని భావించి ఈ సినిమా చేస్తోంది. నిజానికి ‘గీతాంజలి’ సినిమా వచ్చిన సమయంలో హారర్, కామెడీ సినిమాల మంచి సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత అడపాదడపా హారర్, కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘గీతాంజ‌లి’ సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకులను భయపెట్టబోతోంది అంజలి. ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


Read Also: నాని బ్లాక్ బస్టర్ సినిమాలకు దారుణమైన టీఆర్పీ - బుల్లితెరపై నేచురల్ స్టార్‌కు ఆదరణ తగ్గుతోందా?