Geetanand sensational speech at Game On movie pre release event: ''థియేటర్లలో చూశాక 'గేమ్ ఆన్' ఎంత వైవిధ్యంగా ఉంటుందనేది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇది చిన్న సినిమా కాదండీ, చాలా పెద్దది. ఇప్పుడు ఒక సినిమాను లేపాలన్నా, తొక్కాలన్నా ప్రేక్షకులే. వాళ్లు నన్ను ఓ అన్నయ్యగా, తమ్ముడిగా, కొడుకుగా సొంతం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని యువ హీరో గీతానంద్ అన్నారు. 


గీతానంద్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ ఆన్'. ఇందులో నేహా సోలంకి హీరోయిన్. దయానంద్ దర్శకత్వం వహించారు. క‌స్తూరి క్రియేష‌న్స్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ సంస్థలపై ర‌వి క‌స్తూరి నిర్మించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (ఫిబ్రవ‌రి 2న) ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది. సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివేక్ కూచిభొట్ల ట్రైలర్ విడుదల చేశారు.


సినిమా చూశా... మంచి కాన్సెప్ట్, బాగా తీశారు! - వివేక్ కూచిభొట్ల
తాను సినిమా చూశానని, మంచి కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా తీశారని వివేక్ కూచిభొట్ల అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''దర్శకుడికి ఇది తొలి సినిమా అనిపించలేదు. ప్యాక్డ్ స్క్రీన్ ప్లేతో తీశారు. హీరో గీతానంద్ చక్కగా నటించారు'' అని అన్నారు. శివ బాలాజీ మాట్లాడుతూ... "నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం గీతానంద్, దయానంద్ నాన్న కుమార్ గారే. వాళ్ళిద్దరినీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. దయానంద్ ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక ఓ కథ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థ చూసి వాళ్ళ నాన్న పేరు పెట్టారు. గీతా ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయ్యిందో, గీతానంద్ కూడా హీరోగా అంతే సక్సెస్ కావాలి'' అని అన్నారు. 


తెలుగులో ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా రాలేదు! - హీరో గీతానంద్
"ఇటువంటి కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. రియల్ టైంలో సాగే సైకలాజికల్ గేమ్ ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకుంటుంది'' అని హీరో గీతానంద్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''సౌండ్, ట్విస్టులు, విజువల్స్ కొత్తగా ఉంటాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బ్యాగ్రౌండ్ లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలనుకున్నా. నిర్మాత రవి నాకు  క్లోజ్ ఫ్రెండ్. క్వాలిటీగా సినిమా ప్రొడ్యూస్ చేశాడు. మా తమ్ముడు దయానంద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. దర్శకుడిగా అతనికి పేరొస్తుంది. కమల్ హాసన్ 'విక్రమ్' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లు మా సినిమా గురించి మాట్లాడతారు. అభిషేక్ అంత మంచి సంగీతం అందించాడు. థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. నన్ను సపోర్ట్ చేస్తే ప్రేక్షకుల్ని శాటిస్‌ఫై చేసే మరిన్ని సినిమాలు చేస్తా" అని అన్నారు.


Also Read: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!


తమను ఆశీర్వదించటానికి వచ్చిన అతిథులకు దర్శక నిర్మాతలు దయానంద్, రవి కస్తూరి థాంక్స్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహా సోలంకి, నటులు శుభలేఖ సుధాకర్, జెమిని సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Also Read: 'హ్యాపీ డేస్' చూశాక ఆ ఇంట్రెస్ట్ ఎక్కువైంది, 'ఏ మాయ చేసావె' తర్వాత...