మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. 2021లో 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ.. ఈ ఏడాది 'ఖిలాడి' సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మాస్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'ఫుల్ కిక్కు' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ రవితేజ అభిమానులకు మంచి కిక్కిస్తోంది. శ్రీమణి లిరిక్స్ అందించగా.. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఆలపించారు. శేఖర్ వీజే ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. రవితేజ తన మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. నిజానికి ఈ పాటను ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సాయంత్రం విడుదల చేశారు.
ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాతో పాటు రవితేజ మూడు, నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఈ సినిమాతో పాటు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో నటిస్తున్నారు. శరత్ మండవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలకపాత్రలో కనిపించనున్నారు.
Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?
Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..