ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన చాలా బయోపిక్స్ ప్రేక్షకులను బాగానే అలరించాయి. వసూళ్ల పరంగానూ అదరగొట్టాయి. స్పోర్ట్స్ స్టార్స్ జీవిత కథల ఆధారంగా రూపొందిన చిత్రాలన్నీ ఆడియెన్స్ కు బాగా నచ్చాయి. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కథ ఆధారంగా వచ్చిన  ‘ఎంఎస్ ధోనీ’. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య ముళీధరన్ నిజ జీవితాన్ని బేస్ చేసుకుని వచ్చిన ‘800’, స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ‘దంగల్’ లాంటి చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.   


ఆకట్టుకుంటున్న ‘అర్జున్ చక్రవర్తి’ ఫస్ట్ లుక్


ప్రస్తుతం మరో స్పోర్ట్స్ బయోపిక్ తెరెక్కుతోంది. కబడ్డి ప్లేయర్ అర్జున్ చక్రవర్తి జీవిత కథ ఆధారంగా ’అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్‘ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీని గుబ్బల ఈ మూవీని నిర్మిస్తున్నారు. విజయ రామరాజు అర్జున్ చక్రవర్తిగా కనిపించనున్నారు.  సిజా రోజ్, అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్, దుర్గేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో చేతిలో మెడల్ తో, ముఖంలో చిరునవ్వుతో మైక్ ముందుకు మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక పోస్టర్ లో “భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది’ అని మేకర్స్ రాశారు.


కబడ్డీ ఆటగాడు అర్జున్  చక్తవర్తి  నిజ జీవిత కథ


ఈ సినిమా 1980లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్  చక్తవర్తి  నిజ జీవిత కథ ఆధారంగా  ఈ సినిమా రూపొందుతోంది. అర్జున్ క్రీడా జీవితంలోని కష్టాలను, విజయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అర్జున్ గురించి తెలియని వాళ్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ లో ఆయన గురించి సమాచారం వెతుకుతున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కబడ్డీ ప్లేయర్ కథ కావడంతో విజయ రామరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వర్కౌట్స్ చేస్తున్నారు.


అర్జున్ చక్రవర్తి పాత్రలో విజయ్ రామరాజు


ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల కీలక విషయాలు వెల్లడించారు. ‘అర్జున్ చక్రవర్తి’ అనే సినిమా కేవలం సినిమా కాదన్నారు. సవాళ్లను అధిగమించి మనందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తికి నివాళి అన్నారు. అర్జున్ పోరాట పటిమ, సంకల్పం గురించి చెప్పే కథ అన్నారు. ఇక స్ఫూర్తిదాయకమైన చిత్రానికి దర్శకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని దర్శకుడు విక్రాంత్ రుద్ర తెలిపారు. అర్జున్ చక్రవర్తి పాత్రని విజయ్ రామరాజు అద్భుతంగా పోషించారని వెల్లడించారు. ఈ సినిమాకు విఘ్నేష్ భాస్కరన్ సంగీతం అందిస్తుండగా, జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుమిత్ పటేల్ ఆర్ట్ డైరెక్షన్, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.






Read Also: ‘టైగర్ 3’లో టవల్ సీన్‌పై స్పందించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ - ఆ సన్నివేశానికి అన్ని రోజులు పట్టిందా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial