టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె ఇటీవలే పూర్తిగా కోలుకొని తిరిగొచ్చింది. సమంత ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే ఆమె హిందీలో తెరకెక్కుతోన్న ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంది. ఈ షూటింగ్ సందర్భంలో హెవీ స్ట్ంట్స్ చేస్తుండగా ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా సమంత మరో ఇంట్రెస్టింగ్ ఫోటోను తన సోషల్ మీడియాల ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
సమంత ఇన్ని రోజులూ అనారోగ్యానికి గురి కావడం, కోలుకొని తిరిగొచ్చాక షూటింగ్ లో గాయాలు అవ్వడంతో సమంత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని భావించింది. దీంతో ఆమె ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనలో పయనిస్తోంది, గతంలో కూడా సమంత మానసిక ప్రశాంతత కోసం దేశం లోనే ప్రముఖ దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడులోని ఓ ప్రముఖ దేవాలయంలో మొక్కులు కూడా చెల్లించింది. తాజాగా ఆధ్యాత్మిక చింతనలో భాగంగా తన నివాసంలోని అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది. ఆమె పూజలు నిర్వహిస్తోన్న ఫోటో ను షేర్ చేసింది. పూజామందిరంలో అమ్మవారి ఫోటో ముందు పద్మాసనంలో కూర్చొని దైవస్మరణ చేస్తున్నట్టుగా కనిపించింది. అంతే కాదు ఈ ఫోటో తో పాటు ప్రత్యేక నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘జీవితంలో నమ్మకమే ప్రధాన బలం. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు, నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా మార్చుతుంది’ అని రాసుకొచ్చింది సమంత. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. బాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డికే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంది సమంత. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా రూపొందుతుంది. ఇక ఇందులో ఇంగ్లీషులో ప్రియాంక చోప్రా నటించగా హిందీలో సమంతా చేస్తుంది. ఈ షూటింగ్ తర్వాత సమంత ప్రముఖ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఖుషి’ సినిమాలో నటించాల్సి ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కావలసి ఉండగా సమంతకు అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆమె ఈ మూవీ సెట్స్ లో పాల్గొంది. ఈ మేరకు ‘ఖుషి’ టీమ్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీతో పాటు సమంత పలు సినిమాల్లో నటించనుంది. సమంత రీసెంట్ గా నటించిన ‘శాకుంతలం’ సినిమా విడుదల కు సిద్దంగా ఉంది. ఈ మూవీను ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా ఫిబ్రవరి 17 న విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నారు.