F3 Movie Release Date: ఒక్క రోజు ముందుకు వచ్చిన వెంకీ & వరుణ్... 'ఎఫ్ 3' విడుదలపై మరోసారి క్లారిటీ

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 3' విడుదలపై సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఒక్క రోజు ముందుకు వచ్చింది తప్ప... పెద్ద మార్పు ఏమీ లేదు. 

Continues below advertisement

'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య', 'రాధే శ్యామ్', 'భీమ్లా నాయక్'... టాలీవుడ్ టాప్ హీరోలు నటించిన సినిమాల విడుదల తేదీలు అన్నీ మారాయి. ఆల్మోస్ట్ ప్రతి సినిమా ముందుగా అనుకున్న తేదీ కంటే మరో తేదీకి వస్తోంది. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' కూడా ఫిబ్రవరి 25న పక్కాగా వస్తుందని గ్యారెంటీ లేదు. ఆ రోజు లేదంటే ఏప్రిల్ 1న అని చెప్పింది. మరి, 'ఎఫ్ 3' సంగతి ఏంటి? అంటే పెద్దగా మార్పు లేదు.

Continues below advertisement

తొలుత 'ఎఫ్ 3' సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... సంక్రాంతి నుంచి 'భీమ్లా నాయక్' వెనక్కి రావడంతో ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 29కి 'ఎఫ్ 3' వచ్చింది. పది రోజుల క్రితం మార్చి 18 లేదంటే ఏప్రిల్ 28న 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేయాలనుకున్నప్పుడు 'ఎఫ్ 3' వాయిదా పడటం ఖాయమని వినిపించింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' రావడం లేదు కానీ... ఏప్రిల్ 29న 'ఆచార్య' వస్తోంది. 'ఎఫ్ 3' విడుదల మాత్రం వాయిదా పడలేదు. ఒక్క రోజు ముందుకు జరిగింది. ఏప్రిల్ 28న 'ఎఫ్ 3'ను విడుదల చేయనున్నట్టు సినిమా టీమ్ ఈ రోజు పేర్కొంది.

ఆల్రెడీ "బొమ్మ ఎప్పుడు పడితే... అప్పుడే మనకు నవ్వుల పండగ" అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'ఎఫ్ 2' తర్వాత వెంకటేష్, వ‌రుణ్‌తేజ్‌తో ఆయన చేస్తున్న చిత్రమిది. ఆ సినిమాకు సీక్వెల్ అని చెప్పలేం. కానీ, 'ఎఫ్ 3'లో 'ఎఫ్ 2'లో క్యారెక్టరైజేషన్లు ఉంటాయి. అందులో హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహరీన్ ఇందులోనూ నటిస్తున్నారు. కొత్తగా సోనాల్ చౌహన్ యాడ్ అయ్యారు. 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ సినిమాను నిర్మిస్తున్నారు.

Continues below advertisement
Sponsored Links by Taboola