వేద తన ఫోన్లో జోక్స్ చూసి నవ్వుతూ వాటిని యష్ కి కూడా చూపిస్తుంది. దీంతో ఇద్దరు నవ్వుకుంటారు. ఎవరు పంపించారని అంటే తన ఫ్రెండ్ విన్నీ అని చెప్తుంది. తను అమెరికాలో ఎక్కడ ఉంటుందని యష్ అడుగుతాడు. తను అమ్మాయి కాదు అబ్బాయి పేరు వీరవెంకట వినాయకరావు మేము ముద్దుగా విన్నీ అని పిలుచుకుంటాము అని వేద నవ్వుతూ చెప్తుంటే యష్ కి మాత్రం కాలిపోతుంది. కాలేజీ టైమ్ లో విన్నీ నేను కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశాం ఆ రోజులే వేరు, రేపు విన్నీ హైదరాబాద్ వస్తున్నాడు అని తెగ సంతోషపడుతుంది. అది విని యష్ బిత్తరపోతాడు.
Also Read: కూతుర్ని కాపాడుకున్న తులసి- ఇక లాస్య పని అవుట్
ఖుషికి టిఫిన్ పెడుతూ కూడా విన్నీ పంపిన జోక్స్ చూసి నవ్వుతుంది. యష్ కోపంగా వచ్చి లంచ్ బాక్స్ అడుగుతాడు. వేద మళ్ళీ ఆ జోక్స్ చూపిస్తుంది కానీ యష్ నవ్వకుండా చెత్త జోక్స్ అని తిట్టేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఒక వైఫ్, తల్లివి అది గుర్తు పెట్టుకో కాలేజ్ స్టూడెంట్ ఏం కాదు అని అంటాడు. చిత్ర, వసంత్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ పెళ్లి డేట్ పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కుని ఒకరికొకరు తినిపించుకోవాలని అనుకుంటారు. అప్పుడే చిత్ర చేతిలోని ఐస్ క్రీమ్ కిందపడిపోతుంది. పెళ్లి డేట్ పెట్టుకున్న తర్వాత ఇలా జరగడం ఏదో అపశకునంలాగా ఉందని చిత్ర భయపడుతుంది. ఐస్ క్రీమ్ మాదిరిగా నా ఆశలు కూడా కరిగిపోతాయా అని చిత్ర మనసులోనే ఆందోళన పడుతుంది.
సన్నాయి వాయింపుతో సంక్రాంతి సంబరాలు మొదలైపోతాయి. అక్కడ కూడా సులోచన, మాలిని కాసేపు వాదులాడుకుంటారు. అది చూసి ఎప్పుడు తిట్టుకోవడమేనా ఒకసారి కొట్టుకోవచ్చు కదా అని శర్మ అంటాడు. వేద వాళ్ళు వెకేషన్ కి వెళ్లొచ్చిన తర్వాత అన్ని శుభాలే జరుగుతున్నాయ్ అని అందరూ అంటారు. ఆ క్రెడిట్ అంతా తనదేనని ఖుషి అంటుంది. ప్లాట్స్ లో ముగ్గుల పోటీ పెడదాం అని శర్మ అంటారు. ప్రైజ్ మనీ రూ.50 వేలు అని తనే స్పాన్సర్ చేస్తానని యష్ అంటాడు. ఇందులో వేదనే గెలుస్తుందని తన ముగ్గులు సూపర్ గా ఉంటాయని యష్ అంటాడు. కానీ వేద మాత్రం అసలు తను ముగ్గుల పోటీలోనే పాల్గొనని అంటుంది.
Also Read: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?
వేద క్లినిక్ కి వెళ్ళడానికి కారు దగ్గరకి రాగానే విన్నీ ఫోన్ చేస్తాడు. హైదరాబాద్ వచ్చానని చెప్పడంతో వేద చాలా ఎగ్జైట్ అవుతుంది. అది చూసి యష్ ఎవరితో అంత సంతోషంగా మాట్లాడుతుందని అనుకుంటాడు. తర్వాత వేద వచ్చి విన్నీ హైదరాబాద్ వచ్చాడు వెళ్దాం పదండి అని తెగ ఎగ్జైట్ అవుతుంది. కానీ యష్ మాత్రం చిరాకు పడతాడు. నాకు కుదరదు నువ్వు వెళ్ళు అని చిరాకుగా చెప్తాడు. ఒక్కదాన్నే వెళ్తే బాగోదు అని వేద అంటుంది కానీ యష్ మాత్రం కోపంగా వెళ్ళిపోతాడు.