విన్నీ ఇచ్చే పార్టీకి అభిమన్యు రావడం చూసి అతనేంటి ఇక్కడికి వచ్చాడని అడుగుతుంది. అతను చాలా బ్యాడ్ పర్సన్ జాగ్రత్త అని చెప్తుంది. ఖుషి వచ్చి ఆకలేస్తుందని అన్నం పెట్టమని మాలినిని అడుగుతుంది. అమ్మ పార్టీకి వెళ్ళింది, నాన్న ఇంట్లోనే ఉన్నారని ఖుషి చెప్తుంది. మాలిని వెళ్ళి పార్టీకి ఎందుకు వెళ్లలేదు, ఇంత రాత్రి పూట తనని ఒక్కదాన్ని ఎలా పంపించావ్, కారు కూడా లేదు నైట్ ఒక్కతే కారులో రావడం ప్రమాదం కదా, నీకోసం చాలా వెయిట్ చేసింది, పార్టీకి నువ్వు కూడా వెళ్తే వేద చాలా సంతోషపడుతుందని మాలిని చెప్తుంది. దీంతో యష్ సరే అని పార్టీకి వెళ్లేందుకు రెడీ అవుతాడు. ఇక అభిమన్యు పార్టీలో అమ్మాయిలని ఫ్లట్ చేసే పనిలో పడతాడు.


Also read: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది


వేద యష్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరోగారు ఎంట్రీ ఇస్తారు. పార్టీలో తనని చూసి ఎగతాళి చేస్తుందేమో తొందరపడి వచ్చానా అని అనుకుంటూ లోపలికి రావడానికి ఆలోచిస్తూ ఉంటాడు. వేద మాత్రం యష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ‘ఆయన నా పక్కన లేకపోతే వెలితిగా అనిపిస్తుంది. దీన్నే ప్రేమ అంటారా? నేను ఇక్కడ ఉన్నా నా ఆలోచనలన్నీ ఆయన చుట్టూనే ఉన్నాయి. బంధం అంటే ఇదేనా’ అని అనుకుంటూ ఉంటుంది. ‘ఆయన రావడం లేదా మిస్ అయిపోయినట్టేనా సడెన్ గా అధ్భుతం జరిగి నేను కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఆయన నా కళ్ళ ఎదురు నిలబడితే ఎంత బాగుతుందోనని’ కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు యష్ నిజంగానే వస్తాడు. నిజంగానే యశోధర్ గారు కనిపిస్తున్నారు నా కోసం నన్ను వెతుక్కుంటూ ఆయన వస్తున్నారని వేద మనసులో చాలా సంతోషపడుతుంది.


Also Read: రాజ్ కి షాకిచ్చిన తల్లి- పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు రానన్న స్వప్న తండ్రి


యష్ ని చూసి స్లో మోషన్ లో వెళ్ళి హగ్ చేసుకోవాలని అనిపిస్తుందని ఒక డ్రీమ్ వేసుకుంటుంది. ఆ సీన్ చాలా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. కాసేపటికి ఊహాలో నుంచి బయటకి వచ్చి సిగ్గుపడిపోతుంది. పార్టీకి వచ్చి బిల్డప్ కొడతాడు. ఇద్దరూ కాసేపు మనసులతోనే మాట్లాడుకుంటారు. తన కోసం వచ్చినందుకు చాలా హ్యపీగా ఫీల్ అవుతుంది. కాసేపు తనని పొగిడించుకుని సంతోషంగా విన్నీ దగ్గరకి వెళ్ళి యష్ ని చూపిస్తుంది. మీకోసం తను చాలాసేపటి నుంచి ఎదురుచూస్తుంది మీరు వచ్చాక మొహం వెలిగిపోతుందని విన్నీ అంటాడు. అది విని యష్ మురిసిపోతాడు. వేదలో ఫస్ట్ టైమ్ 100 శాతం వైఫ్ ని చూస్తున్నా తనలో ఏదో గమ్మత్తు ఉందని యష్ అనుకుంటాడు. పార్టీలో యష్ ని అభిమన్యు పలకరిస్తాడు.


తరువాయి భాగంలో.. 


అభిమన్యు తాగిన మైకంలో మాళవిక గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మాళవికతో పెళ్ళా అలాంటి తప్పు నేనెప్పుడూ చెయ్యను. తనని నేను ఆరేళ్లుగా భరిస్తున్నా మొహం మొత్తేయదా. అలాంటి ఆడది చదివేసిన న్యూస్ పేపర్ లాంటిదని విన్నీతో చెప్పడం వేద వింటుంది. పాపం మాళవిక వీడిని నమ్మి అన్ని వదిలేసుకుని గుడ్డిగా వెళ్లిపోయిందని వేద జాలి పాడుతుంది.