Ennallo Vechina Hrudayam Serial Today Episode: లాయర్ ఫోన్ చేయడంతో గుడి వద్దకు వెళ్లిన త్రిపురకు లాయర్ షాకింగ్ న్యూస్ చెబుతాడు. మీ అమ్మను గల్ఫ్‌ నుంచి తీసుకురావాలంటే 30 లక్షల ఖర్చు అవుతుందని చెబుతాడు. ఆరునెలల్లో  విడిపించుకుని తీసుకురాకపోతే...ఇక ఆమెపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతాడు. గడువులోగా  30 లక్షలు సిద్ధం చేసుకోమని చెప్పి వెళ్లిపోతాడు. అమ్మను దక్కించుకోవడానికి డబ్బులు ఎలా అని బాధపడుతున్న త్రిపుర వద్దకు గుడిలో ఉండే ఓ సాధువు వస్తాడు. ఆమె నుదిటిపై చేయిపెట్టి జరిగినదంతా తెలుసుకుంటాడు.చిన్న వయసులోనే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావని చెబుతాడు.  నీ సమస్యలన్నీ తీరాలంటే  ఉగాది రోజు పరమశివుడి ఆలయంలో పుష్కరకాలంగా ఎవరూ వెలిగించని అఖండ జ్యోతిని వెలిగిస్తే దేవుడు నీ కోరిక తీరుస్తాడని చెబుతాడు. ఎంత కష్టమైనా ఆ అఖండ జ్యోతిని వెలిగిస్తానని ఆమె చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
 
              ఉగాది పండుగరోజు అఖండ జ్యోతి వెలిగించడానికి అన్నీసిద్ధం చేసుకుని త్రిపుర ఆలయానికి బయలుదేరి వెళ్తుంది. నిష్టతో స్వామివారికి ఉగాది పచ్చడి సమర్పిస్తుంది.అప్పుడే అక్కడికి బాలాను తీసుకుని కుటుంబ సభ్యులు సైతం అదే గుడికి చేరుకుంటారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. నిన్న తనతో అఖండ జ్యోతి వెలిగించమని చెప్పిన  సాధువు కోసం త్రిపుర ఆలయంలో  వెతుకుతుంది. ఒకచోట ధ్యానం చేసుకుంటున్న ఆయన్ను కలిసి తాను అఖండ జ్యోతి వెలిగించేందుకు  వచ్చానని...ఇప్పుడు ఏం చేయాలో చెప్పాలని అడుగుతుంది. దానికి ఆ సాధువు ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పనని  మరొక్కసారి ఆలోచించుకోవాలని చెప్పగా....త్రిపుర నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చానని చెబుతుంది.అయితే ముందుగా  ఓ చిన్నజ్యోతిని వెలిగించి అక్కడ ఉంచండని సాధువు చెబుతాడు. ఆ జ్యోతి ఆరిపోకుండా సాయంత్రం వరకు కాపాడుకుంటే  అఖండ జ్యోతి వెలిగించేందుకు  అర్హత పొందుతావని చెప్పడంతో  త్రిపుర జ్యోతి వెలిగిస్తుంది. అలాగే స్వామివారికి స్వయంగా నైవేద్యం వండి ఆ ప్రసాదాన్ని నేలపై ఉంచి స్వీకరించాలని చెప్పడంతో....త్రిపుర ప్రసాదం తయారు చేసేందుకు  ఏర్పాట్లు చేస్తుంది.
 
                               ఇక బాలా కుటుంబ సభ్యులు సైతం తమ కుమారుడికి జబ్బు నయం కావాలంటే ఏం చేయాలని పంతులుగారిని అడగటంతో  ఆయన ఆలయం చుట్టూ అంగ ప్రదక్షణ చేస్తే ఆ దేవుడు కరుణించవచ్చని చెబుతాడు. బాలా  అందరికీ ఉగాది పచ్చడి పంచిపెడతాడు. ఎలాగైనా గాయత్రిని వెతికి పట్టుకుని తనకు సారీ చెప్పాలని బాలా తమ్ముడు అనుకుంటుండగా....త్రిపురను బెదిరించి సీక్రెట్ కెమెరా దక్కించుకోవాలని ఫణి ఎత్తులు వేస్తుంటాడు.
మరోవైపు పరమశివుడికి ప్రసాదం తయారు చేసేందుకు త్రిపుర పొయ్యి వెలిగించి పాలుపొంగిస్తుండగా..నెయ్యి తీసుకురావడం మర్చిపోయినట్లు గుర్తిస్తుంది.అప్పుడు పక్కనే ఉన్న గాయత్రి నేను వెళ్లి తీసుకొస్తానంటూ షాపు వద్దకు బయలుదేరి వెళ్లగా....అప్పుడే బాలా తమ్ముడు గాయత్రి చూస్తాడు. తన దగ్గర వచ్చి తన తప్పును క్షమించమని కోరతాడు.దీనికి గాయత్రి నిరాకరిస్తుంది. ఎంతసేపటికీ  గాయత్రి రాకపోవడంతో ఆమెను వెతుకుతూ  త్రిపుర వెళ్లగా...అప్పుడే గాయత్రితో బాలా తమ్ముడు నేను నిన్నే ప్రేమిస్తుంటాని చెబుతాడు. ఆ మాటలు త్రిపుర వినడంతో ఈరోజు  ఏపిసోడు ముగిసిపోతుంది.