Dunki movie Twitter review in Telugu: బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డంకీ'. 'పఠాన్', 'జవాన్'... ఆల్రెడీ 2023లో ఆయన రెండు భారీ విజయాలు అందుకున్నారు. ఈ ఏడాది మూడో సినిమాతో ఈ రోజు థియేటర్లలోకి వచ్చారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 


'డంకీ' చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. తెలుగులో 'శంకర్ దాదా ఎంబీబీఎస్'గా రీమేక్ అయిన హిందీ సినిమా 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఆయన తీసినదే. ఇంకా '3 ఇడియట్స్', 'సంజు', 'పీకే' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. మరి, ఆయన తీసిన కొత్త సినిమా 'డంకీ' ఎలా ఉంది? ఆల్రెడీ ప్రీమియర్ షోస్ చూసిన జనాలు ఏమంటున్నారు? ట్విట్టర్ టాక్ ఏంటి? అనేది ఒకసారి చూడండి. 


షారుఖ్ ఖాతాలో మరో 1000 వెయ్యి కోట్ల సినిమా!
Dunki Movie Twitter Review: 'డంకీ'తో షారుఖ్ ఖాన్ మరోసారి 1000 కోట్ల రూపాయల వసూళ్ళు సాధిస్తారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరొక నెటిజన్ అయితే ఈ సినిమాను 'మాస్టర్ పీస్' అని పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్ నటన అద్భుతమని కొనియాడారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వ శైలి గురించి కూడా మాట్లాడుతున్నారు. మరోసారి ఆయన తన మేజిక్ రిపీట్ చేశారని, సినిమా అద్భుతంగా తీశారని పేర్కొన్నారు.


Also Read: 'సలార్'కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ - చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!









 
విదేశాలు వెళ్లిన అంకుల్స్, ఆంటీస్ కోసమా?
Dunki movie review: 'డంకీ' సినిమాకు సోషల్ మీడియా అంతటా పాజిటివ్ టాక్ ఏమీ లేదు. కొంత నెగిటివ్ టాక్ కూడా వినబడుతోంది. ''ఈ సినిమా విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో సెటిలైన ఇండియన్స్ మళ్ళీ స్వదేశానికి రావాలని కోరుకుంటారు కదా! వాళ్ళ కోసమే'' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. సినిమా బోరింగ్ అని ఇంకొకరు పేర్కొన్నారు.






Also Readప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?



గమనిక: సోషల్ మీడియాలో కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పాఠకులకు అందించడమే మా ఉద్దేశం. అంతే తప్ప... ఆయా పోస్టుల్లో పేర్కొన్న అంశాలకు, ఏపీబీ దేశం సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరు. 'డంకీ' సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఈ పోస్టుల్లో చూడండి. ముంబైలోని థియేటర్ల దగ్గర ఉదయం నుంచి అభిమానుల కోలాహలం కనబడుతోంది.