నట సింహ నందమూరి బాలకృష్ణ అభినయానికి, 'అఖండ' సినిమాకు అద్భుత ఆదరణ లభిస్తోంది. బాలకృష్ణను అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలని కోరుకుంటారో, దర్శకుడు బోయపాటి శ్రీను ఆ విధంగా చూపించారని ఆడియన్స్ అంటున్నారు. పక్కా కమర్షియల్ మాస్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాపై కొంత మంది పెదవి విరిచినప్పటికీ... రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. 'అఖండ'లో బాలకృష్ణ నటనతో పాటు యాక్షన్ దృశ్యాలకు మంచి పేరొచ్చింది.
'అఖండ'లో ఫస్ట్ ఫైట్ (మురళీ కృష్ణ ఇంట్రడక్షన్ ఫైట్)ను రామ్ -లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేశారు. అఘోరా ఎంట్రీ ఫైట్ నుంచి క్లైమాక్స్ ఫైట్ వరకూ స్టన్ శివ, ఆయన కుమారులు కెవిన్, స్టీవెన్ కంపోజ్ చేశారు. సినిమాలో ఫైట్స్‌కు అద్భుత స్పందన లభిస్తున్న నేపథ్యంలో స్టన్ శివ మాట్లాడుతూ "ఫైట్స్ ఇంత బాగా రావడానికి హీరో బాలకృష్ణ గారు, దర్శకుడు బోయపాటి శ్రీను కారణం. అఘోరా ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ ఫైట్స్ వరకూ... 60 - 65 రోజులు కేవలం యాక్షన్ సీక్వెన్స్ ల కోసమే పని చేస్తే, మరో 15 - 20 రోజులు ఎలివేషన్స్ ఎలా ఉంటే బావుంటుందని దర్శకుడు బోయపాటితో డిస్కస్ చేశాం. మొత్తం మీద ఓ 80 రోజులు ఈ సినిమాకు పని చేశా. బాలయ్య బాబు గారు అద్బుతంగా చేశారు. 'సింహా' సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్ కూడా నేనే చేశాను. టాలీవుడ్ అంటే మాస్, మంచి యాక్షన్ సీక్వెన్స్ కోరుకుంటారు. బాలయ్య గారి ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు" అని అన్నారు. బాలయ్య ఓ సూపర్ హీరో అని ఆయన చెప్పారు.
Also Read: అమెరికాలో 3 రోజుల్లో రూ.5 కోట్లు.. బాలయ్య స్టామినా ఇది..
తమన్ నేపథ్య సంగీతం వల్ల సినిమాలో ఫైట్స్ ఎలివేట్ అయ్యాయని, ఇంత కిక్ ఇచ్చారని స్టన్ శివ తెలిపారు. 'క్రాక్'లో ఆయన నటుడిగా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆఫర్లు బాగా వస్తున్నాయని చెప్పారు. 'ఎఫ్ 3'లో మెయిన్ విలన్ రోల్ చేస్తున్నట్టు తెలిపారు.
Also Read: ‘కొత్తగా నాకెమయ్యిందో... వింతగా ఏదో మొదలయ్యిందో...’ ప్రేమపాటతో సిధ్ శ్రీరామ్ మళ్లీ మాయ చేశాడుగా
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: ఏందీ బ్యాడ్ లక్... మళ్లీ వాయిదా పడిన కీర్తీ సురేష్ సినిమా
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి