తెలుగులోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘కాంతారా‘ సెన్సేషనల్ హిట్ సాధించింది.  ఏ సినిమా అభిమాని నోట విన్నా, ప్రస్తుతం ఇదే సినిమా పేరు వినిపిస్తున్నది. కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా, తాజాగా తెలుగు, హిందీ భాషల్లోకి అనువాదమై రిలీజ్ అయ్యింది. కన్నడలోనే కాకుండా, తెలుగు, హిందీ పరిశ్రమల్లోనూ ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి సినిమా దిగ్గజాలే ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నటించారు. ఆయన నటన ఈ సినిమాకు కీలకంగా చెప్పుకోవచ్చు.  


తెలుగులో సంచలన విజయం


దేశ సినిమా పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న ‘కేజీఎఫ్’ లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే సంస్థ ‘కాంతార’ను సైతం ప్రొడ్యూస్ చేసింది.  ఈ సినిమా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు చేపట్టింది.  కన్నడలో ఆ సినిమాను చూసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 2 కోట్లు కేటాయించారు. తాజాగా ‘కాంతారా’ సినిమాను గీతా ఫిలింస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా శనివారం(అక్టోబర్ 15) నాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అటు హిందీలో 3.5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. కర్ణాటకలోని కంబ్లా, భూతకోలా సంస్కృతి, సాంప్రదాయం నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరక్కించాడు రిషబ్‌ శెట్టి.


Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!


అవన్నీ దిగదుడుపేనన్న ఆర్జీవీ!


ఈ సినిమా అద్భుతంగా ఉందని పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు చెప్పారు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రొటీన్ వ్యవహారాలకు భిన్నంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిందన్నారు. “సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్‌లకు రప్పించగలవని ఫిలింవాలాలందరూ ఒక నిర్ణయానికి వచ్చారని, ఈ తరుణంలో ఓ చిన్న సినిమా ‘కాంతారా’ బిగ్గీల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది” అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.