రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'లైగర్'. ఇందులో అనన్యా పాండే కథానాయిక. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా సినిమాలో నటించారు. ఆదివారంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వాట్ నెక్స్ట్? దీని తర్వాత ఏంటి? అనే ప్రశ్నలకు పూరి జగన్నాథ్ పరోక్షంగా సమాధానం ఇచ్చారు.


'లైగర్' తర్వాత మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారనేది తెలిసిన విషయమే. ఆ సంగతిని ఆయన పరోక్షంగా వెల్లడించారు. "ఇప్పుడే 'లైగర్' షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ రోజుతో 'జన గణ మణ'' అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఆయన వాయిస్‌ మెసేజ్‌ను నిర్మాత ఛార్మి కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ దేవరకొండతో 'జన గణ మణ' చేస్తున్నట్టు చెప్పలేదు. కానీ, సినిమా చేస్తున్నట్టు పూరి జగన్నాథ్ ఇలా చెప్పారన్నమాట. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.


'జన గణ మణ' సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేయడానికి రెడీ అవుతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను పూరి జగన్నాథ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకు సినిమా వచ్చింది.'లైగర్'ను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న ఆ సినిమా విడుదల కానుంది.


'లైగర్' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ దేవరకొండ...