వరుస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ప్రెస్ మీట్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఏర్పాటు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమాను జూలై 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మారుతి మీడియాతో మాట్లాడారు. 


చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడంతో తమ సినిమా ఎంతో మందికి రీచ్ అయిందని.. గోపీచంద్ గత సినిమాలు మాదిరి ఈ సినిమా కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఉంటుందని అన్నారు. అలానే తను ఎప్పుడూ డైరెక్టర్ అవుతానని  అనుకోలేదని.. కానీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యానని అన్నారు. మూడు హిట్స్ ఇవ్వగానే పెద్ద హీరోలకు కథలు వినిపించి వారితోనే సినిమాలు చేయాలనుకోనని.. వారితో చేసినా చిన్న సినిమాలను వదులుకోనని చెప్పారు. చిన్న సినిమాలో దర్శకుడు గా అవకాశం వచ్చినా ఆది పెద్ద ఆఫర్ గా భావిస్తానని తెలిపారు. 


ఈ సినిమాను చాలామంది ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారేమో కానీ ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలో రాదని చెప్పారు నిర్మాత బన్నీ వాసు. కాబట్టి అందరూ తమ సినిమాను చూసి ఆశీర్వదిస్తే ఇంకా వచ్చే సినిమాలతో ఇండస్ట్రీ ముందుకు వెళుతుందని.. కరోనా తర్వాత సమస్యలలో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని కోరారు.