Dimple Hayathi paired oppsite Gopichand: 'ఖిలాడి'తో డింపుల్ హయతి టాక్ ఆఫ్ డా టౌన్ అయ్యారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందే విడుదలైన ప్రచార చిత్రాల్లో, ప్రెస్‌మీట్స్‌లో ఆమె గ్లామర్ డోస్ కొంత మంది ప్రేక్షకులను ఆకర్షించింది. విడుదలైన తర్వాత గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారనే రివ్యూలు వచ్చాయి. ఆమెకు అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.


'ల‌క్ష్యం', 'లౌక్యం' విజయాల త‌ర్వాత హ్యాట్రిక్ సినిమా చేయడానికి హీరో గోపీచంద్, ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ 30వ చిత్రమిది. ఇందులో డింపుల్ హయతిని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోపీచంద్, డింపుల్ జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే.


Also Read: డింపుల్ హయతి బికినీ షో... రవితేజతో హీరోయిన్స్ లిప్ లాక్స్


గోపీచంద్ 30లో జగపతిబాబు (Jagapathi Babu in Gopichand 30) కీల‌క పాత్ర‌లో న‌టించనున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. 'ల‌క్ష్యం' త‌ర్వాత గోపిచంద్‌, శ్రీ‌వాస్‌, జ‌గ‌ప‌తిబాబు చేస్తున్న సినిమా కూడా ఇదే. ఈ చిత్రానికి కథ: భూపతి రాజా, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. 


Also Read: అది పోర్న్ సినిమా అంటున్న కంగనా రనౌత్? దీపికా పదుకోన్‌ స్కిన్ షో సేవ్ చేయలేదని కామెంట్!