Dhurandhar Vs Avatar fire and ash: చిత్రసీమకు ఈ సమయం అద్భుతంగా ఉంది. ఓ సినిమా తర్వాత మరొకటి థియేటర్లలో జోష్ చూపిస్తున్నాయ్, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్' డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో నుంచి బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది.
డిసెంబర్ 19న హాలీవుడ్ మూవీ 'అవతార్ ఫైర్ అండ్ యాష్' విడుదలైంది. అవతార్ 3 చూసిన ప్రేక్షకులంతా విజవల్ వండర్ ని థియేటర్లో అస్సలు మిస్సవొద్దని చెబుతున్నరాు. పండోరా ప్రపంచాన్ని మరింత విసృతంగా చూపించడం, కొత్త తెగలను పరిచయచేయం, యాక్షన్ సీన్స్ అదిరాయ్ అంటున్నారు. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మార్క్ మేకింగ్ , గ్రాఫిక్స్ థియేటర్లలో చూడాల్సిందే అని ప్రశంసిస్తున్నారు. కానీ..... కథలో కొత్తదనం కోసం లేనేలేకపోవడం మైనస్ అంటున్నారు. అవతార్ తో కంపేర్ చేస్తే అవతార్ 2 బాలేదు..అవతార్ 2 తో కంపేర్ చేస్తే అవతార్ 3 బావుంది.. అవతార్ తో పోలిస్తే అవతార్ 3 బాలేదు..ఇదీ ప్రేక్షకుల అంచనా. స్టోరీ స్లోగా నడవడం కూడా ఓ మైనస్ అంటున్నారు నెటిజన్లు మరి 'ధురంధర్' - 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఈ రెండు సినిమాల్లో మొదటి రోజు ఎవరు పైచేయి సాధించారో తెలుసా?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' రాకతోవసూళ్ల విషయంలో 'ధురందర్'ను వెనక్కి నెట్టేస్తుందని అందరూ భావించారు. కానీ 'ధురందర్' తగ్గేదే లే అని దూసుకెళ్లింది. 'ధురందర్' 15వ రోజు వసూళ్లు 'అవతార్' మొదటి రోజు వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయని విని ప్రేక్షకులు ఆశ్యర్యపోతున్నారు. వారాంతంలో ఈ పోటీ ఎలా ఉంటుందో చూడటం మరింత ఇంట్రెస్టింగ్ అవతార్: ఫైర్ అండ్ యాష్ -ధురంధర్ సినిమాల మొదటి రోజు కలెక్షన్లు
అవతార్: ఫైర్ అండ్ యాష్ ( డిసెంబర్ 19, 2025 విడుదల)
మొదటి రోజు ఇండియాలో దాదాపు 18 నుంచి 20 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. (Sacnilk ఇతర ట్రాకర్ల అప్‌డేట్స్ ప్రకారం ₹18.07 కోట్ల వరకు రికార్డ్ అయింది). అవతార్: ది వే ఆఫ్ వాటర్ మొదటి రోజు ₹40-48 కోట్లు సాధించింది..ఆ లెక్కన ఈ వసూళ్లు తక్కువే అని చెప్పుకోవాలి
ధురంధర్ ( డిసెంబర్ 5, 2025 విడుదల)
ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో సుమారు ₹27-28.6 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. (Sacnilk, Bollywood Hungama వంటి సోర్సెస్ ప్రకారం ₹28.6 కోట్లు, రణవీర్ సింగ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనర్).
'అవతార్ ఫైర్ అండ్ యాష్' గురించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ 'ధురందర్' ముందు 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిలబడలేకపోతోంది. సెక్నిల్క్ నివేదిక ప్రకారం, 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మొదటి రోజు రూ. 20 కోట్లు వసూలు చేస్తే.. ఆదిత్య ధర్ 'ధురందర్' చిత్రం వారాంతాల్లో కూడా అంతకంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం విడుదలై 15 రోజులు అయినప్పటికీ, దాని వసూళ్లు తగ్గడం లేదు. 'ధురంధర్' 15వ రోజు రూ. 22.50 కోట్లు వసూలు చేసింది. శనివారానికి 500 కోట్ల క్లబ్ లో చేరనుంది ధురంధర్. ఇదే జోరు కొనసాగితే రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' , 'ఛావా' చిత్రాలను వెనక్కి నెట్టేసి.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ నిలిచే అవకాశం ఉంది.
గమనిక: ఈ సంఖ్యలు ప్రాథమిక అంచనాలు మరియు అధికారిక ట్రాకర్ల నుంచి వచ్చినవి (Sacnilk, Box Office India వంటివి). ధురందర్ ఇప్పటికీ బాగా రన్ అవుతోంది కాబట్టి అవతార్ 3 ఓపెనింగ్‌పై ప్రభావం పడింది.