Nandamuri Kalyan Ram's Devil movie release date: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. అభిషేక్ నామా నిర్మాత. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
డిసెంబర్ 29న థియేటర్లలోకి 'డెవిల్'
Devil Movie New Release Date: 'డెవిల్' చిత్రాన్ని తొలుత ఈ ఏడాది నవంబర్ 24న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) వర్క్ పూర్తి కాలేదని, అందువల్ల ముందుగా చెప్పిన తేదీకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కుదరడం లేదని చిత్ర బృందం వెల్లడించింది. ఈ రోజు కొత్త విడుదల తేదీ ప్రకటించింది.
డిసెంబర్ 29న 'డెవిల్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తామని అభిషేక్ నామా అనౌన్స్ చేశారు. ఇయర్ ఎండ్‌కు కళ్యాణ్ రామ్ కిక్ ఇవ్వనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట! ఈ ఏడాది ఆఖరులో విడుదల కానున్న పెద్ద తెలుగు సినిమా ఇదేనని చెప్పలి. సంక్రాంతి పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. 'డెవిల్' నుంచి మధ్యలో కొత్త సినిమాలు రావు. రెండు వారాలు కలెక్షన్లు రాబట్టుకోవడానికి థియేటర్లలో ఈ సినిమాకు మంచి అవకాశం లభించిందని చెప్పాలి.
కళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్త
Devil movie actress name: 'డెవిల్' చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటించారు. వాళ్ళిద్దరిదీ హిట్ కాంబినేషన్. ఈ జోడీ ఆల్రెడీ 'బింబిసార'లో నటించింది. ఇప్పుడు 'డెవిల్'తో మరో హిట్ మీద కన్నేసింది. ఇప్పటికే విడుదలైన పాటల్లో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Also Read: హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
Devil Movie Cast 2023: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి నటించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడియార్, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్ బారది, కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్ రత్తినమ్ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్ నామా.