రాధ పిల్లలిద్దరిని చక్కగా పెంచిందని దేవుడమ్మ అంటుంది. అటు రాధ రామూర్తి ఇంట్లో వినాయక పూజ చేస్తుంది. జానకి నవధాన్యాలు మూట కడుతుంది. అలా ఎందుకు చేస్తున్నారని భాగ్యమ్మ అడుగుతుంది. ఇది మా ఆచారం వాటిని తీసుకెళ్ళి జానకి పొలంలో చల్లితే అంతా మంచే జరుగుతుందని మా నమ్మకం అని రామూర్తి చెప్తాడు. ఇటు దేవుడమ్మ దేవి చేతుల మీదగా పూజ జరిపించమని పూజారికి చెప్తుంది. కమల బిడ్డని దేవి తన ఒడిలో కూర్చోబెట్టుకుని పూజ చేస్తూ ఉంటుంది. పాప నీకు అలవాటు అయితే నువ్వు ఇక్కడే ఉండాల్సి వస్తుందని రాజమ్మ అంటుంది. అదెలా కుదురుతుంది నేనే రుక్మిణి నా దగ్గరకి తీసుకెళ్లిపోతాను అను దేవి అంటుంది.


ఇది మరి బాగుందే నువ్వు ఉండమంటే ఉండవు కానీ ఆ పసి దాన్ని ఎలా తీసుకెళతావ్ అని దేవుడమ్మ అంటుంది. అయితే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా రుక్మిణి కొన్ని రోజులు మాదగ్గర కొన్ని రోజులు మీ దగ్గర ఉంటుందని చిన్మయి అంటుంది. నా బిడ్డని విడిచి పెట్టి మేము ఎలా ఉండాలి అని కమల, భాష అంటారు. అప్పుడు మీరందరూ కలిసి మా ఇంటికి వచ్చి నాలుగు దినాలు ఉండండి అని దేవి అంటుంది. తర్వాత మేము నాలుగు దినాలు ఇక్కడకి వచ్చి ఉంటాము అని అంటుంది.


Also Read: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు


ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదమ్మా త్వరలోనే దేవి మనందరి దగ్గరకి వస్తుందని ఆదిత్య మనసులో అనుకుంటాడు. జానకి మూట కట్టిన నవధాన్యాలు రాధతో కలిసి జానకి తీసుకెళ్ళి పొలంలో చల్లుతూ ఉంటుంది. జానకి జీవితాంతం నా ఇంట్లోనే ఉంటే ప్రతి పండగ కూడా ఈరోజు లాగే అందంగా ఉంటుందని మాధవ్ మనసులో సంతోషపడతాడు. మీ లాంటి కోడలు రావడం రామూర్తి గారి అదృష్టం, నీ లాంటి మంచి వ్యక్తి భార్యగా రావడం మా మాధవ్ గారి అదృష్టం అని పొలంలో పని చేసే వాళ్ళు అంటారు. ఆ మాటలకి రాధ ఇబ్బంది పడుతుంటే మాధవ్ మాత్రం సంబరపడతాడు. నేను ఆ ఇంటికి ఏమి కాను అని ఎవరికి తెలియదు నేను ఇంట్లో నుంచి బయటకి వెళ్ళే సమయం దగ్గర పడిందని రాధ మనసులో అనుకుంటుంది.


రాధాని ఇంటికి తీసుకెళ్లమని రామూర్తి మాధవ్ కి చెప్తాడు. భాగ్యమ్మ కూడా వస్తాను అనేసరికి నువ్వు ఎక్కడికి అమ్మ వాళ్ళకి తోడుగా ఇక్కడే ఉండు అని కోపంగా చెప్తాడు. దేవుడమ్మ ఇంట్లో దేవి పూజ చేసి ప్రసాదం అందరికీ పెడుతుంది. సూరిని చితా అని పిలుస్తుంది. అదేంటమ్మా అని రాజమ్మ అడుగుతుంది. చిన తాత కదా నాకు అందుకని చితా అని పిలుస్తున్న అని చెప్తుంది. దేవి  మాటలకి అందరూ మురుసుకుంటూ నవ్వుకుంటారు. దేవి మాటలు వింటుంటే నాకు రుక్మిణి గుర్తుకు వస్తుందని సూరి అంటాడు. రుక్మిణి కూడా నడిమ్ మామ నడిమ్ మామ అని పిలుస్తుందని గుర్తు చేసుకుంటాడు. ఇలా అందరినీ వరసలు పెట్టి పిలవడం అక్క అలవాటు. ఇలా చేయమని అక్కే చెప్తుందా లేదంటే దేవినే ఇలా పిలుస్తుందా ఏం జరుగుతుంది అని సత్య ఆలోచనలో పడుతుంది.  


Also Read: లాస్యని ఆట ఆడేసుకున్న లక్కీ- హనీని తీసుకుని తులసి ఇంటికి సామ్రాట్, శ్రుతి మీద తన ప్రేమని బయటపెట్టిన ప్రేమ్