'అంత పెద్ద ఇంటికి కోడలివి అయ్యి ఉంది అనాథలా నా ఇంటికి వచ్చి తలదాచుకున్నావా.. నువ్వు ఆ ఇల్లు వదిలి రావడానికి కారణం నాకు తెలియదు కానీ ఈ ఇంటిని కూడా నీ ఇంటిలా గౌరవంగా నిలబెట్టావ్ కానీ ఆ విశ్వాసం లేకుండా నా కొడుకు తప్పు చేస్తున్నాడు. మరొకరి భార్య అని తెలిసి నా కొడుకు నీమీద ఆశపడుతున్నాడు. వాడి దుర్మార్గం నుంచి నిన్ను కాపాడి బయటకి పంపించాలని అనుకున్నా కానీ వాడు కన్నతల్లిని అని కూడా చూడకుండా నాకు ఈ గతి పట్టించాడు. నా పరిస్థితికి కారణం వాడే అని చెప్పుకోలేను ఈ స్థితిలో నిన్ను వాడి నుంచి కాపాడుకోలేను నిన్ను ఆ దేవుడే కాపాడాలి. ఈ విషయం ఆయనకి చెప్తే అసలు క్షమించడు. వాడికి తెలిస్తే అసలు ఊరుకోడు నాలా ఆయన్ని కూడా ఏదైనా చేస్తే' అని జానకి భయపడుతుంది.


సత్య సంతోషంగా ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అక్క దగ్గరకి వెళ్ళి వచ్చాను సత్య అంటే దేవిని తిట్టినట్టే రుక్మిణిని కూడా తిట్టి వచ్చావా అని ఆదిత్య కోపంగా అంటాడు. ఎందుకు ఆదిత్య అలా అపార్థం చేసుకుంటావ్ అని అంటుంది. దేవితో అలా మాట్లాడినందుకు సోరి చెప్పాను దేవి ఎప్పటిలాగానే మన ఇంటికి వస్తుంది సరదాగా ఉంటుంది అని సత్య చెప్పేసరికి ఆదిత్య ఒక్కసారిగా సంతోషంగా ఉంటాడు. అది చూసి దేవుడమ్మ, సత్య ఆశ్చర్యపోతారు. దేవి మళ్ళీ ఈ ఇంటికి రాదని భయపడ్డాను నువ్వు వెళ్ళి మాట్లాడావంటే నాకు చాలా హ్యాపీగా ఉందని ఆదిత్య అంటాడు.


Also Read: ఆవేశపడిన దామోదర్, నచ్చజెప్పిన వేద- అవమానంతో రగిలిపోయిన మాళవిక సూసైడ్


అదంతా చూసిన దేవుడమ్మ ఆదిత్య తెలియకుండానే తప్పు చేస్తున్నాడు. ఏ భార్య తన మీద కంటే ఎక్కువ ప్రేమని బయటవాళ్ళ మీద చూపిస్తే తట్టుకోలేదు. దేవి మీద ప్రేమని సత్యకి తెలిసేలా ప్రవర్తిస్తున్నాడు. దాని వల్ల వీళ్ళ మధ్య మనస్థాపాలు పెరిగేలా ఉన్నాయి. అది ఆదిత్యకి అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి అని దేవుడమ్మ ఆలోచిస్తుంది. జానకి దగ్గరకి మాధవ్ వస్తాడు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఎందుకమ్మా చూసుకోకుండా మెట్ల మీద నుంచి జారిపడ్డావ్, కాస్త చూసుకుని ఉంటే నీకు పరిస్థితి నాకు ఈ బాధ ఉండేది కాదు. వద్దని చెప్తే వినకుండా నాతో ఇంత పెద్ద తప్పు చేయించావ్. నా రాధ నాకు కావాలి అంతే అని మాధవ్ అంటాడు. అప్పుడే దేవి, చిన్మయి జానకి దగ్గరకి రావడం చూసి మాధవ్ ఏడుస్తున్నట్టు నటిస్తాడు.


మెట్ల మీద నుంచి ఎలా పడ్డావ్ అని దేవి అడిగేసరికి జానకి మాధవ్ వైపు చెయ్యి చూపిస్తుంది. కానీ ఎవరికి అది అర్థం కాదు. అవ్వని పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమని ఆఫీసర్ సార్ కి కూడా చెప్తాను అని దేవి అంటుంది. మీ నాననమ్మకి మాట వచ్చిందంటే అది నా ప్రాణానికే ప్రమాదం నేను ప్రశాంతంగా ఉండాలి రాధ నాది కావాలంటే మీ నానమ్మ మాట గొంతులోనే శాశ్వతంగా ఆగిపోవాలి అని మాధవ్ మనసులో అనుకుంటాడు. తెల్లారె దేవి ఆదిత్య ఇంటికి వస్తుంది. అది చూసి ఆదిత్య చాలా సంతోషిస్తాడు. ఆదిత్య దేవి మీద చూపించే ప్రేమ చూసి సత్య అసూయపడుతుంది. నాకు అడ్డు రాను నేను ఆదిత్య ఆనందంగా ఉంటే చాలు నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చి ఇప్పుడు దేవిని పంపించిందంటే నేను ఏమనుకోవాలని సత్య మనసులో అనుమానపడుతుంది.


Also Read: నిజం తెలుసుకున్న రుక్మిణి- ఊహించని మాట అడిగిన సత్య, చిన్మయి మీద ఫోకస్ పెట్టిన మాధవ్


నేను ఇంటికి వస్తే చప్పుడు చేయకుండా ఉంటావ్ ఏంటి అని దేవి దేవుడమ్మని అడుగుతుంది. దీంతో దేవుడమ్మ బుంగమూతి పెట్టి అలిగినట్టు కూర్చుంటుంది. దేవి ముద్దు పెట్టి బుజ్జగిస్తుంది. ఆఫీసర్ సార్ కి ఒక ముచ్చట చెప్పమని మా అమ్మ నన్ను పంపించిందని దేవి చెప్పేసరికి సత్య షాక్ అవుతుంది. అవ్వ కింద పడి బాధపడుతుంది కదా నీకు చెప్తే మంచి పెద్ద డాక్టర్ ని తీసుకురమ్మని చెప్పమంది అని దేవి చెప్తుంది. ఆదిత్య సరే అని దేవిని తీసుకుని వెళ్ళిపోతాడు.