దేవిని ఇంకెప్పుడు ఈ ఇంటికి పంపించొద్దు. ఒకప్పుడు తను రావడం వల్ల చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు తను రావడం వల్ల నా సంతోషం నాకు దూరం అవుతుందని నాకు అర్థం అయ్యింది, అది తెలిశాకా కూడా ఇంకా నేను చూస్తూ ఊరుకొను. దేవి ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరి సారి అవ్వాలి అని సత్య కోపంగా చెప్తుంది. అలాగేనమ్మా నాకు కావలసింది ఆదేగా అయినా నా కూతురికి నీ ఇంటికి రావలసిన అవసరం ఏముంది చెప్పు, అదిగో అదే మాట మీ ఆయనకి కూడా చెప్పు, నేను అయితే రానివ్వను కానీ తను తీసుకొస్తాడు కదా. అటు మీ అక్క నా మాట వినక ఇటు మీ ఆయన వినక నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నీ సపోర్ట్ దొరికింది కదా ఇక దేవిని ఈ ఇంటి వైపు రాను నీ భర్తకి కూడా చెప్పు ఛీ అంటున్నా కూడా పరాయి వాళ్ళ పిల్లల కోసం రావొద్దని. దేవి ఇంకెప్పుడు ఈ ఇంటికి రాదు నేను మాట ఇస్తున్నా, అలాగే నువ్వు కూడా మాట ఇవ్వు మీ ఆయన కూడా మా ఇంటివైపుకి కూడా రావడానికి వీల్లేదని మాధవ్ చెప్తాడు.


దేవి చాలా బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అది చూసి ఆదిత్య బాధపడతాడు. చిన్మయి దేవి నా చెల్లి కాదా, నాతో ఆడుకోదా, నన్ను వదిలేయకమ్మా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా అని రాధని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. పసి పిల్లలతో అలాగేనా మాట్లాడేది, దేవి ఎంత బాధపడుతుందని ఆదిత్య సత్య మీద అరుస్తాడు. ‘దేవి మన బిడ్డ కాదు అయినా తన మీద అంత ప్రేమ ఎందుకు, నేను నీ భార్యని నీతో సంతోషంగా ఉండాలని నాకు ఉంటుంది, నీకు ఎలా చెప్పాలి, నువ్వు నన్ను కూడా పట్టించుకోకుండా దేవి మీద ప్రేమ చూపిస్తుంటే నాకు అనుమానం వస్తుంది. దేవిని అడ్డం పెట్టుకుని మళ్ళీ అక్కని కలవాలని అనుకుంటున్నావా, దూరం అయిపోయిందని అనుకుంటున్నా అక్కకి మళ్ళీ దగ్గర కావాలని అనుకుంటున్నావా’ అని సత్య నిలదీస్తుంది. ఆదిత్య కోపంగా సత్య అని తన మీదకి చెయ్యి ఎత్తబోతే దేవుడమ్మ వచ్చి ఆపుతుంది.   


Also Read: మాజీ భార్యతో యష్, ముక్కలైన వేద మనసు - ఫంక్షన్ లో రణరంగం సృష్టించేందుకు సిద్ధమైన మాళవిక


నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి కొత్తగా ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడం కూడా నేర్చుకున్నావా అని దేవుడమ్మ తిడుతుంది. మా మధ్య దూరం తగ్గదు, తగ్గించాలనే ఆలోచన ఆదిత్యకి లేదని సత్య బాధగా వెళ్ళిపోతుంది. దేవి ఏడుస్తూ వచ్చి తల్లిని కౌగలించుకుంటుంది. ఏం జరిగిందని అడుగుతుంది. నేను ఇంకెప్పుడు ఆఫీసర్ సార్ ఇంటికి పోను అని చెప్తుంది. అసలు ఏం జరిగిందని రామూర్తి మాధవ్ ని అడుగుతాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని పిల్లల్ని ఆ ఇంటికి పంపించొద్దని చెప్పాను వినలేదు చూడండి చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఏ విధంగా బాధ పెట్టి పంపించారో. ఆదిత్య ఎదురుగానే సత్య దేవిని ఇంటికి పంపించొద్దని చెప్పింది అని మాధవ్ అనేసరికి రుక్మిణి షాక్ అవుతుంది.


దేవుడమ్మ ఆదిత్య, సత్యని నిలబెట్టి అసలు కట్టుకున్న భార్య మీద చెయ్యి ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతుంది. చిన్న పిల్లని అలాంటి మాటలు అంటే కోపం రాదా అమ్మా, దేవి వల్ల మేమిద్దరం దూరం అయిపోతున్నాం అన్నట్టు మాట్లాడిందని జరిగింది మొత్తం దేవుడమ్మకి ఆదిత్య చెప్తాడు. అయినా దేవి వచ్చిందని నువ్వు ఆగిపోవాల్సిన అవసరం ఏంటి అని ఆదిత్యని అంటుంది. మీ మధ్య దూరానికి ఆ పసిదాన్ని కారణం చేసి మాట్లాడటం ఏంటి సత్య అది మన మీద ప్రేమతో వస్తుంది, పసి బిడ్డ కదా అని అందరం దగ్గరకి తీసుకుంటున్నాం అని దేవుడమ్మ అంటుంది. దగ్గరకి తీసుకోవడం తప్పు కాదు దేవి రాగానే నన్ను వదిలేసి ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుందని సత్య అడుగుతుంది. అన్నీ విషయాల్లో దేవికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్ అని ఇద్దరు వాదులాడుకుంటారు. దేవుడమ్మ ఆపండి అని గట్టిగా అరుస్తుంది. ఎప్పుడు లేనిది మీరిద్దరు ఇలా తయారయ్యారు ఏంటని తిడుతుంది. దేవిని మాటలు అన్నదని కోపంతో సత్య మీద చెయ్యి ఎత్తాను క్షమించు అని ఆదిత్య అంటాడు.


Also Read: బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత,దీప చేతిరాత గుర్తుపట్టిన శౌర్య - వంటలక్క ఏం చేయబోతోంది!


తరువాయి భాగంలో..


దేవి ఏడుస్తూ ఉంటే మీ చిన్నమ్మ ఏదో బాధలో అలా మాట్లాడి ఉంటదని రుక్మిణి సర్ది చెప్పేందుకు చూస్తుంది. ఆఫీసర్ సార్ ముందు అలా మాట్లాడింది చిన్నమ్మ అంత బాధ పడినాకా నేను ఆ ఇంటికి పోనమ్మా అని దేవి ఏడుస్తూ చెప్తుంది. అది విని రుక్మిణి షాక్ అవుతుంది. ఇదంతా చాటుగా మాధవ్ వింటూ ఉంటాడు. నువు పోకపోతే ఆఫీసర్ సార్ మస్త్ బాధపడతారని అంటుంది. ఇంత జరిగినాకా కూడా ఆ ఇంటికి ఎలా పొమ్మంటావ్ అందుకే నేను ఆ ఇంటికి నువ్వు వెళ్ళమని చెప్పినా పోను అని దేవి చెప్పేస్తుంది.