వంకర బుద్ధి వేసుకుని పరాయి వాడి భార్యని కోరుకుంటున్నావ్ అందుకు పసి బిడ్డలని అడ్డం పెట్టుకుంటున్నావ్ నువ్వు అసలు మనిషివేనా, ఇగో బిడ్డ ఇప్పుడు చెప్తున్నా నా బిడ్డకి ఎవరి లేరని నకరాలు చేస్తున్నావ్ నువ్వు ఇలాగే నా బిడ్డ దగ్గర నకరాలు పడితే జొన్న కంకులు కోసినట్టు నీ పీక కోస్తా జాగ్రత్త అని భాగ్యమ్మ వెళ్ళిపోతుంది. ఆదిత్య దేవితో మాట్లాడటం కోసం స్కూల్ దగ్గరకి వస్తాడు. అప్పుడే రామూర్తి పిల్లల్ని తీసుకుని వస్తాడు. దేవి మాత్రం ముభావంగా ఉంటుంది. నాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోతున్నావ్ ఏమైందని ఆదిత్య దేవిని అడుగుతాడు. ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడటం లేదని చిన్మయి చెప్తుంది. మాకు చెప్పకపోయిన ఆఫీసర్ అంకుల్ కి అయినా చెప్పమని అడుగుతుంది. నేను ఎవరితోని మాట్లాడను నన్ను వదిలెయ్యండి అనేసి దేవి వెళ్ళిపోతుంది.


Also Read: సులోచనలో కదలిక తెచ్చేందుకు మాలిని సూపర్ ప్లాన్- అభికి వార్నింగ్ ఇచ్చిన యష్, వేద


రుక్మిణీ జానకమ్మకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంటే మాధవ్ చూస్తాడు. మీరు ఇంత కష్టంలో ఉంటే మిమ్మల్ని విడిచి పెట్టి పోతానా, నీడనిచ్చిన వాళ్ళ కష్టం చూసిన తర్వాత కూడా వదిలేసి వెళ్తే నేను మనిషి ఎలా అవుతాను. నా గురించి మిరెమి పరేషన్ కావొద్దు మందులు వేసుకోని నిమ్మలంగా ఉండమని రుక్మిణీ జానకమ్మతో అంటుంది. 'నన్ను కూడా అంతే ప్రేమగా చూసే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. నువ్వు వెళ్ళను అన్న మాట విన్నప్పుడల్లా నా చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. మా అమ్మని పడేసిన పాపం ఈ పుణ్యం కోసమేనా అనిపిస్తుంది. ఇంట్లో అందరినీ ప్రేమగా చూస్తున్నావ్ మరి నన్ను ఎందుకు ప్రేమించడం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తే రాముడిని అవుతాను, లేదంటే పది తలల రావణాసురుడిని అవుతాను'. నువ్వు నాకు దగ్గరయ్యే రోజు చాలా దగ్గరలో ఉందని అనుకుంటాడు.


కమల బిడ్డ ఏడుస్తుంటే సత్య ఎత్తుకుని ఆడిస్తుంది. పసి బిడ్డకి ఆ పేరు పెట్టి ఆంటీ పాపం చేశారు, ఆ పేరుతో పిలవడానికి నోరు రావడం లేదని అంటుంది. మాధవ్ తల్లి దగ్గరకి వచ్చి తన కాళ్ళు పట్టుకుంటాడు. పశ్చాత్తాపంతో అనుకుంటున్నావా కాదు ఆనందంతో.. నువ్వు మెట్ల మీద నుంచి పడిపోయి నాకు ఎంత సాయం చేశావో నువ్వు పడకపోతే రాధ వెళ్లిపోయేది. ఇప్పుడు వెళ్లమన్నా వెళ్ళకుండా ఆగిపోయింది. రాధ ఈ ఇంట్లో ఉండాలి అంతే నువ్వు ఎప్పుడు ఈ చైర్ లోనే ఉండాలి. నువ్వు ఇలా ఉంటేనే కదా రాధ నిన్ను చూసుకుంటూ ఉండిపోతుందని అనడం భాగ్యమ్మ వింటుంది.


Also read: పోటాపోటీగా దాండియా ఆడిన సామ్రాట్, తులసి- అవమానించిన అమ్మలక్కలు, ఆగ్రహంతో ఊగిపోయిన అనసూయ


రుక్మిణి, ఆదిత్య కలుసుకుని దేవి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు అలా ఉందో నాకు అర్థం కావడం లేదు, మంచి చేసిన చెడే ఎదురవుతుందని రుక్మిణి సత్య మాటలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సత్య చూస్తుంది. దూరంగా ఉంటాను అని ఒకరు హామీ ఇస్తారు. మరొకరు నాతో తప్ప మీతో వస్తారు, ఏంటి అని అడిగితే ఆవేశం చాటున అసలు నిజం దాటేస్తారు , నా కోసం త్యాగం చేసిందని అంటారు. కానీ ఇలా చాటుగా కలుస్తారు అని సత్య దెప్పి పొడుస్తుంది.