‘నీ దగ్గరకి రావడానికి ఆదిత్య నాకు క్యాంప్ కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి మరి వచ్చాడు, ఇందాక ఫోన్ చేసి ఏమన్నావ్ పెనిమిటి అనా. ఇద్దరు పిల్లల తల్లివి, నీ మెడలో మరొకరు కట్టిన తాళి ఉంది, అయినా ఆదిత్యని పెనిమిటి అనడానికి నీకు నోరుఎలా వచ్చిందక్కా. నీకంటూ ఇక కుటుంబం ఉండగా ఆదిత్యతో ఏం పని ఎందుకు కలుస్తున్నావ్. నీ మాటలు వింటే చాలు అని ఒకప్పుడు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు వినాలంటే చిరాకుగా ఉంది. నా జీవితాన్ని నిలబెట్టడం కోసం వెళ్లిపోయినప్పుడు నువ్వు దేవత అని అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నా భర్తకి దగ్గర అవుతుంటే ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను. నువ్వు ఇలా చేస్తున్నావ్ నీకు ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా ఇలా చేస్తున్నావ్ అని ఆంటీకి తెలిస్తే ఎప్పటికీ క్షమించదు అది గుర్తుంచుకో.. నువ్వు ఆదిత్యని కలుస్తున్నావ్ మరి ఆంటీకి ఎందుకు కనిపించకుండా వెళ్తున్నావ్ నువ్వు రాధవి కాదు రుక్మిణివే అని ఆంటీకి తెలిసిపోతుంది అనే కదా’ అనేసరికి ఆ మాట దేవి విని షాక్ అవుతుంది.


Also Read: శర్మకి కొడుకుగా మారిన యష్- సంతోషంలో వేద ఫ్యామిలీ, ఖైలాష్ పని అవుట్


ఒకప్పుడు నిన్ను చూడాలని ఆరాటపడ్డాను ఇప్పుడు నిన్ను చూడాలంటే చిరాకుగా ఉందని సత్య కోపంగా వెళ్ళిపోతుంది. అంటే మాయమ్మ పేరు రాధ కాదా రుక్మిణీనా అని దేవి అనుకుంటుంది. సత్య మాటలకి రుక్మిణీ కుమిలి కుమిలి ఏడుస్తుంది. దేవి దాని గురించి ఆలోచిస్తూ దేవుడమ్మ దగ్గరకి వస్తుంది. మీ అమ్మ ఎక్కడే అని దేవుడమ్మ అడిగితే కనిపించలేదని అబద్ధం చెప్తుంది. మీకు మా రాధ కనిపించే సమయం, సందర్భం త్వరలోనే వస్తుందని మాధవ్ దేవుడమ్మతో చెప్తాడు. ఆదిత్య పిల్లల దగ్గరకి వెళ్లబోతుంటే మాధవ్ ఆపుతాడు. రాధ మీ ఇంటికి రావాలని అనుకున్నా రాలేదు.. పాపం మా అమ్మకి దెబ్బలు బాగా తగిలాయి కాబట్టి ఇప్పుడప్పుడే కోలుకోలేదు, ఒకవేళ రాధ రావాలని అనుకున్నా నేను అడ్డుకట్ట వేస్తూనే ఉంటాను కదా. నేను ఇంత చెడ్డవాడిని కావడానికి కారణం నువ్వే, ఇప్పటికే ఒక భార్య దూరం అయిపోయింది. ఇంకో భార్య అయినా దూరం కాకుండా చూసుకో’ అని మాధవ్ చెప్తాడు.


Also Read: మరోసారి దీపను బుక్ చేసిన మోనిత, రాజ్యలక్ష్మి దగ్గరకు చేరిన కార్తీక్ పంచాయతీ!


మా ఇద్దరి మధ్య ఏమి లేదని సత్యకి అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి అని రుక్మిణీ చాలా బాధపడుతుంది. దేవి కూడా గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ పేరు రుక్మిణీ అనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు, దేవుడమ్మ అవ్వ కమల పెద్దమ్మ బిడ్డకి మాయమ్మ పేరు ఎందుకు పెట్టిందని దేవి అనుకుంటుంది. చిన్మయి వచ్చి దేవిని భోజనానికి పిలుస్తుంది కానీ నాకు ఆకలిగా లేదు మీరే తినండి అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. దేవుడమ్మ తన మనసులో బాధ భర్తతో చెప్పుకోవడం సత్య వింటుంది. అమ్మవారు నీకు ఏం తక్కువ చేసింది చెప్పు ఇలా చేశావ్ అని అంటాడు. వయసు మీద పడిన తర్వాత మనల్ని ఆడించే వాళ్ళు కావాలి. పిల్లల నవ్వే బోసి నవ్వు కావాలి అని దేవుడమ్మ ఎమోషనల్ అవుతుంది.