ఆదిత్య, దేవికి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఇప్పుడే అదిత్యకి రామూర్తి దంపతులు వీడియో కాల్ చేసి దేవితో మాట్లాడతారు. రాధ కిచెన్ లో పని చేసుకుంటుంటే మాధవ అక్కడికి వచ్చి ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్లొస్తాను అని చెప్తాడు. మన దేవికి ఆదిత్య చెస్ నేర్పించి జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో గెలిచేలా చేయాలనుకుంటున్నడంట కదా నేను వెళ్ళి ఆ ఆదిత్యతో ఆడుకుంటానని అంటాడు. ఆ మాటకి రాధ కోపంగా ఆయన బిడ్డకి ఆయన ఆట నేర్పిస్తాడు నువ్వు వెళ్ళి చేసేది ఏముందని అంటుంది. నేను ఆ ఇంటికి వెళ్తుంది ఆదిత్యతో సహ అందరినీ ఈ ఇంటికి భోజనానికి పిలుద్దామని వెళ్తున్నా అంటాడు. ఆ మాటకి రాధ షాక్ అవుతుంది. నువ్వు రావని నాకు తెలుసు కదా అందుకే నేను ఒక్కడినే వెళ్తాను అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


Also Read: యష్ ఇంటికి ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్, ఖుషి కస్టడీ మాళవికకేనా?


మాధవ ఆదిత్య ఇంటికి వస్తాడు. తనని చూసి నాయన అని వెళ్ళి కౌగలించుకుంటుంది. ఏంటి మాధవ దేవి కోసం వచ్చావా అని దేవుడమ్మ అడుగుతుంది. లేదని మీయ అబ్బాయితో ఆడుకుండామని వచ్చానని చెప్తాడు ఆ మాటకి అందరూ షాక్ అవగా అదే చెస్ ఆడుకుందామని అని కవర్ చేస్తాడు. దేవికి చెస్ ఎలా ఆడాలో నేను నేర్పిస్తా అని అంటాడు. ఆ మాటకి దేవి నేను ఆడే ఆట నువ్వు ఆడితే నేను ఎలా గెలుస్తా అని మాధవ ని అడుగుతుంది. ఆఫీసర్ సారు చూడు నాతోనే ఆడిస్తాడు. నువ్వేమో నేను గెలవడం కోసం నువ్వు ఓడిపోతావ్, అప్పుడు నాకు ఎలా ఆట వస్తాదని అడుగుతుంది. సరే ఆఫీసర్ చెప్పింది అర్థం అయింది కదా ఇంట్లో ఆడుకుందుగాని రమ్మని అంటాడు. రేపు ఇంట్లో బోనం పెట్టుకున్నాం దేవిని ఇక్కడే ఉండనివ్వు అని దేవుడమ్మ మాధవ ని అడుగుతుంది. అందుకు మాధవ ఒప్పుకోకపోతే దేవి మాత్రం తాను ఇక్కడే ఉంటాను ఇంటికి రాను అని అంటుంది. సరే నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు. 


రాధ మాధవ ఎందుకు నా పెనిమిటి ఇంటికి పోయిండు అని టెన్షన్ పడుతుంది. ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడో ఎంతో అని తెగ కంగారు పడుతుంది. ఇక సత్య ఆదిత్య దగ్గరకి వచ్చి తన పద్ధతి  నచ్చడం లేదని చెప్తుంది. దేవి వాళ్ళ నాన్న వచ్చి ఇంటికి వెళ్దాం అంటే వెళ్ళను అని చెప్పింది దానికి కారణం నువ్వే కదా అని అడుగుతుంది. దేవికి ఇక్కడ ఉండాలని అనిపించింది అందుకే అలా చెప్పిందని ఆదిత్య అంటాడు. అక్కడ ఉంది మా అక్కే కావచ్చు కానీ దేవి మాధవ కూతురు, దేవి రాను అని చెప్తే ఆయన ఎంత బాధపడి ఉంటాడు అని సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవి ఎవరి బిడ్డ అనేది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవని ఆదిత్య అనుకుంటాడు. 


Also Read: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం, రిషి-వసు మధ్య మళ్లీ చిగురిస్తోన్న ప్రేమ - మధ్యలో వచ్చి చేరిన సాక్షి


దేవితో బోనాలు ఎత్తిస్తుందంట ఆ దేవుడమ్మ, మరో వైపు నిజమైన గెలుపు అంటే ఏంటో చూపిస్తాడట ఆ ఆదిత్య అని మాధవ కోపంగా రాధతో అంటాడు. దేవి మా బిడ్డ అది తెలిసో తెలియకో ఆ ఇంట్లో మర్యాదలు జరుగుతున్నాయ్ కాదు అనేందుకు నువ్వెవరు సారు అని రాధ సీరియస్ అవుతుంది. దేవి ఎప్పటికీ నా బిడ్డే, దేవిపై అన్నీ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి, దేవికి ఇప్పటికీ ఎప్పటికీ నేనే నాన్నని మాధవ గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.