రాధని తీసుకుని మాధవ దేవుడమ్మ ఇంటికి తీసుకుని వస్తాడు. రా అమ్మా అవ్వ కూడా నిన్ను చూడాలని చాలా సార్లు అనుకుంది రా అని దేవి కూడా అడుగుతుంది. పాపం పెద్దావిడ నిన్ను చూడాలని ఆశపడుతుంది దిగు ఒకసారి కనిపించి మాట్లాడి వచ్చేద్దామని మాధవా అంటాడు. అప్పుడే ఇంట్లో దేవుడమ్మ నడుస్తూ బయట కారు ఉన్న విషయాన్ని గమనిస్తుంది. ఇంటి ముందు కాపు ఆపి లోపలికి రాకుండా ఉంటారెంటి అని దేవుడమ్మ అనుకుంటుంది. జల్ది ఇక్కడ నుంచి పోదామా అని రాధ కోపంగా ముఖం దాచుకుని అంటుంది. ఇంటి దాకా వచ్చి రాకపోతే ఎలా దిగు రాధ అంటాడు. ఇక దేవి కూడా రామ్మా అని పిలుస్తుంది. రాధ ముఖం దాచుకుంటూ ఉండటం చూసి మాధవ తెగ సంతోషపడతాడు. నువ్వు వెళ్ళి మీ నాయన గురించి ఆఫీసర్ సార్ తో మాట్లాడి రా అని దేవిని వెళ్ళమని చెప్తాడు మాధవ. మేము తర్వాత వస్తాంలే నువ్వు వెళ్ళు అని మాధవ దేవిని లోపలికి పంపిస్తాడు. దేవుడమ్మ కారు ఎవరిదా అని బయటకి వెళ్ళి చూద్దామని అనుకునే సమాయనికి దేవి అవ్వా అని ఇంట్లోకి వస్తుంది. తనని చూసి దేవుడమ్మ సంతోషపడుతుంది.  


Also Read: యష్, వేద కర్టన్ లో రొమాన్స్ - ఖైలాష్ ని విడిపించేందుకు అభిమన్యు తిప్పలు


కారులో నుంచి దిగడానికి ఇంతసేపు పట్టిందా అని దేవుడమ్మ అంటుంది. మాయమ్మ, నాయన వచ్చి దింపారని దేవి అంటే మీ అమ్మని లోపలికి తీసుకుని రావచ్చు కదా అని అడుగుతుంది. రమ్మని అడిగినా కానీ రాలేదని చెప్తుంది. మాధవ రాధని ఒక ప్రదేశానికి తీసుకుని వెళతాడు.


రాధ: ఏంది సారు ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పి నా ఇంటికి తీసుకెళ్లినావ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావ్ ఏంటి


మాధవ: నా ఇంటికి అని నువ్వే అంటున్నావ్ మరి నీ ఇంటిని నీ వాళ్ళని చూడగానే ఎందుకు భయపడుతున్నావ్ చెప్పు. నీ భయం నిజం రాధ. మన గురించి ఎవరికి ఏమి తెలియడానే ధైర్యంతో నువ్వు ఉన్నావ్. కానీ పెళ్లి కాకుండాఅనే పడి సంవత్సరాలుగా భార్యాభర్తలుగా ఈ ఊరి దృష్టిలో ఉన్నామని తెలిస్తే మీ అత్తయ్య రియాక్షన్ ఏంటి. నువ్వే చెప్పే నిజం కన్నా ఊరి చెప్పే అబద్దానికే బలం ఎక్కువ. అత్తయ్యా జరిగింది ఇది అని నువ్వు నిజం చెప్పినా నీ మాటలు నమ్ముతుందా? భర్తని వదిలేసి వచ్చిన నిన్ను మీ అత్తయ్య హారతి ఇచ్చి నిన్ను ఆహానిస్తుంది అనుకుంటున్నావా? దేవి ఎవరి బిడ్డ అనేదానికి సమాధానం దొరక్కుండా తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది అనుకుంటున్నవా? అందుకే నేను చెప్పినట్టు చేస్తే దేవి ఆ ఇంట్లో నువ్వు కోరుకుంటున్నట్టుగా సంతోషంగా ఉంటుంది. జనం చెప్పే అబద్ధాన్ని నిజం చేసి నువ్వు నా ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి. దానికి నువ్వు సరే అని ఒక్కమాట చెప్తే దేవి తన తండ్రి దగ్గర సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. విలన్ లా చూస్తున్న అదే తండ్రిని నాన్న నేను నీదగ్గరే ఉంటాను అనేలా నేను చేస్తాను. కానీ నువ్వు నాదగ్గర ఉండాలి. ఇలా కాదు జనం అనుకుంటున్నారే అలా. నీ నిర్ణయం సరైనది అయితే అటు దేవి ఇటు నేను ఆనందంగా ఉంటాం. లేదంటే ఆ ఆనందం ఎవ్వరికీ దక్కనివ్వను అని వార్నింగ్ ఇస్తాడు.


మాధవ మాటలకి రాధ కోపంతో రగిలిపోతూ వెళ్ళి కారుని స్పీడ్ గా నడుపుకుంటూ మాధవ మీదకి దూసుకొస్తుంది. అది చూసి మాధవ బిత్తరపోతాడు. రెప్పపాటులో మాధవని కారుతో ఢీ కొట్టకుండా పక్కకి వెళ్ళిపోతుంది. నాకు కారు నడపడటం ఒక లెక్క అనుకుంటున్నవా.. నువ్వు తప్పించుకోలేదు నేనే తప్పించినా లేదంటే పోయేవాడివి అని రాధ మనసులో అనుకుని అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోతుంది.


Also Read: రుక్మిణిని అమ్మలా చూసుకున్న చిన్మయి- తన ఫోటోకి మీసాలు గీసి మానాయన ఇలాగే ఉంటాడు వెతకమంటున్న దేవి


రాధ పద్ధతిగా చెప్పాను.. కానీ నా మాట వినకుండా నన్నే కారుతో గుద్దాలని చూశావ్ మాటలతో వింటావ్ అనుకున్నాను నువ్వు వినవని అర్థం అయ్యింది. నా ప్రాణాలని తీయ్యడానికి తెగించావంటే ఇంక నేను నిన్ను మాటలతో మార్చాలని అనుకోవడం నాదే తప్పవుతుంది. ఈ మాధవని రెచ్చగొడితే నష్టం ఏంటో నీకు అర్థం అయ్యేలాగా చెప్తాను అని అనుకుంటాడు.


ఎప్పుడొచ్చావ్ దేవి అని సత్య అంటుంది. ఒక్కదానివే వచ్చావా అని అడుగుతుంది. లేదు వాళ్ళ అమ్మానాన్న వచ్చి వదిలిపెట్టి వెళ్లారని దేవుడమ్మ చెప్పడంతో సత్య షాక్ అవుతుంది. ఏంటి మీ అమ్మ కూడా వచ్చిందా అని అడుగుతుంది. ఆ రాధకి మన ఇంట్లోకి రావడం మనకి కనిపించడం ఇష్టం లేదనుకుంటా. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఉంది చూడు అని దేవుడమ్మ అంటుంది. అక్క ఇంటిదాకా వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని సత్య అనుకుంటుంది. దేవి సత్య గదిలోకి వస్తుంది. అక్కడ సత్య, ఆదిత్య ఫోటో చూసి అమ్మానాయన కూడా ఇలాగే ఫోటో దిగి ఉంటారు కదా. అమ్మ నాతో చెప్పడానికి ఎందుకు పరేషాన్ అవుతుందని దేవి అనుకుంటుంది. అప్పుడే అక్కడ టేబుల్ మీద ఫోన్ బాక్స్ కనిపిస్తుంది. మాయమ్మ ఫోన్ లాంటిదే ఆఫీసర్ సారు కూడా ఇలాంటిది కొన్నారా అని అనుకుంటుంది. ఆ బాక్స్ చూస్తుంటే సత్య వచ్చి ఏంటి అలా చూస్తున్నావ్ అది ఖాళీ బాక్స్ అని చెప్తుంది. చిన్నమ్మా ఇటువంటి ఫోన్ మాయమ్మ దగ్గర ఉందని దేవి చెప్పడంతో సత్య షాక్ అవుతుంది.