నన్ను చాలా మార్చేశావ్ రాధ, నీ మీద ఇష్టం నాకు కష్టంగా ఉన్నా నాతో చాలా తప్పులు చేయిస్తుంది. కానీ ఏం చేయను నీకోసం నిన్ను నా దాన్ని చేసుకోవడం కోసం నన్ను నేను మార్చుకోవాల్సి వస్తుంది..  తప్పులు చేయాల్సి వస్తుంది. ఇదంతా నీ తప్పే, అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని మాధవ నీచంగా మాట్లాడతాడు. పెనీమితిని ఏ పొద్దు అంతా కోపంగా చూడలేదు ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అని రుక్మిణి టెన్షన్ పడుతూ అదిత్యకి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయ్యడు. మాధవ సారూని ఏం చేస్తాడో అని అనుకుంటుంది. మాధవ, ఆదిత్య ఇద్దరూ ఎదురు పడతారు. థాంక్యూ ఆఫీసర్ రమ్మనగానే వచ్చినందుకు అని మాధవ అంటాడు. 


మాధవ: నువ్వు నా ఇంటి చుట్టూ తిరిగింది రాధతో పిల్లలతో నువ్వు మాట్లాడింది చాలు. ఇక మానేయ్. రాదతో మాట్లాడింది నీ ఇస్తానికి నా కూతుర్ని నీ ఇంటికి తీసుకెళ్లింది చాలు అదంతా ఇక మానేయ్. అసలు నా ఇంటికి రావడమే మానేయ్. ఎందుకంటే రాధ నా భార్య కాబట్టి. ఎందుకంటే దేవి నా కూతురు కాబట్టి అని అనడంతో ఆదిత్య కోపంతో రగిలిపోతాడు.   


ఆదిత్య: మాధవని కోపంగా లాగి పెట్టి చెంప చెల్లుమనిపిస్తాడు. మౌనంగా ఉన్న కదా మాట్లాడటం లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భరిస్తా అనుకున్నవా జాగ్రత్త.. ఆఫీసర్ కదా అఫిషియల్ గా ఉంటాడు కదా ఏం చేయలేడనా నీ ధైర్యం, నువ్వు నాలో ఆఫీసర్ నే చూశావ్ ఆదిత్యని చూడలేదు. ఎవరు ఎవర్ని నీ భార్య, బిడ్డ అంటున్నావ్.. నా భార్య బిడ్డల్ని తెచ్చుకోలేనట చేతకాని వాడు కాదు ఈ ఆదిత్య. నా భార్య, బిడ్డ ఇప్పటికీ నీ ఇంట్లో ఉంటున్నారంటే దానికి కారణం నా భార్య మంచితనం.. నీ తల్లితండ్రి, నీ బిడ్డ ఏమైపోతారో అనే జాలితో నా చేతులు కట్టేస్తే ఆగిపోయి అన్ని భరిస్తున్నాను. మరోసారి నోరు జారావా నీ కూతురు తండ్రి లేని అనాథ అవుతుంది గుర్తుంచుకో అని వార్నింగ్ ఇస్తాడు. 


మాధవ: థాంక్యూ ఆఫీసర్ రాధ నా మీద చెయ్యి లేపింది.. నువ్వు ఒక అడుగు ముందువేసి నా మీద చెయ్యి వేశావ్. ఇప్పటి నుంచి నేనెంతో చూపిస్తాను. 


ఆదిత్య: నీ వల్ల ఏమి కాదు. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన విషయాలు మాట్లాడటానికి నా విలువైన టైం ని వెస్ట్ చెయ్యకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


Also Read: వేదకి పూలతో స్వాగతం చెప్పి ఇంటికి తీసుకొచ్చిన యష్- మాలినికి క్షమాపణలు చెప్పిన సులోచన


ఆదిత్య రాకముందే మాధవ తన ఫోన్లో వీడియో ఆన్ చేసి కార్ లో పెట్టిన విషయం గుర్తు చేసుకుని క్రూరంగా నవ్వుకుంటాడు. అమెరికా వెళ్లేందుకు సత్య రెడీ అయ్యి ఆదిత్య కోసం ఎదురు చూస్తుంది. అప్పుడే ఆదిత్య వస్తాడు. అమెరికా బయల్దేరుతున్నారు కదా అంతా సర్ది పెట్టమని దేవుడమ్మ చెప్తుంది. కానీ ఆదిత్య ఇంట్ల ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం అమెరికా వెళ్ళడం లేదని సత్య తో చెప్తాడు. అదేంటి ఆదిత్య వెళ్లాలని ఫిక్స్ అయ్యాకే కదా టికెట్స్ బుక్ చేశాను, వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాను మళ్ళీ దొరుకుతుందో లేదో అని సత్య దిగులుగా అంటుంటే ఇంకొక వారం తర్వాత వెళ్దాం అంటాడు. ఈరోజు వెళ్ళడం నాకు కుదరదని అంటాడు. సాత్యకి పిల్లలు పుట్టే ఒక దారి దొరికింది, వాళ్ళతో అన్ని మాట్లాడాక ఇప్పుడు వద్దంటే ఎలా అని దేవుడమ్మ ఆవేదనగా అడుగుతుంది. వెళ్ళటం కుదరదని ఆదిత్య తేల్చి చెప్పేస్తాడు. ఆంటీ వాళ్ళ సంతోషం కోసం నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇప్పుడు వద్దంటే ఎలా అని సత్య నిలదిస్తుంది. నేను వద్దు అంటుంది అమ్మ వాళ్ళ సంతోషం కోసమే కొన్ని రోజులు ఓపిక పడితే అంతా అర్థం అవుతుందని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 


Also Read: మా నాయన దుర్మార్గుడని ఆదిత్యకి చెప్పిన దేవి- నీకోసమే ఇదంతా చేశానంటూ మాధవ పైశాచికత్వం


రుక్మిణి అసలు ఏమైంది పెనిమిటి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని టెన్షన్ పడుతుంటే మాధవ వస్తాడు. తనని చూసి వెళ్లబోతుంటే ఆగు రాధ నీకు ఒక మాట చెప్పాలని మాధవ అంటాడు. నువ్వు నాకు చెప్పే పనేం లేదు సారు అంటే నువ్వు ఆనందపడే విషయం రాధ అని మాధవ తన బుగ్గ చూపించి ఏం కనిపించడం లేదా అని అడుగుతాడు. నువ్వు ఈరోజు నన్ను కొట్టాలని చూశావ్ కానీ ఆదిత్య నన్ను కొట్టేశాడు. కానీ ఆ అదిత్యకి తెలియనిది ఏంటి అంటే తను కొట్టింది నా చెంప మీద కాదు నా అహం మీద అంటాడు. మన జోలికి రావొద్దని పద్దతిగా చెప్పాను ఆ మాత్రానికే అంతా ఆవేశ పడ్డాడు.. అని ఫోన్లో వీడియోని రాధకి చూపిస్తాడు. ఇంత జరిగాకా నేను ఎంతో ఆదిత్యకి అర్థం అయ్యేలా చేయాలి కదా..  నువ్వు తన భార్య, దేవి తన బిడ్డ అంటున్నాడు కదా చేతనైతే నిన్ను ఈ ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లమను. ఆదిత్య మీ నాన్న అని దేవికి చెప్పిన మరుక్షణం దేవికి ఈ వీడియో చూపిస్తాను అని రాధని బెదిరిస్తాను. కంటి నిండా నీళ్ళతో చూశావా తల్లి అమ్మని, నిన్ను నాదగ్గర పెట్టుకున్నానని కాలు సరిగా లేదని నిలబడలేనని తెలిసి ఎలా చెయ్యి చేసుకున్నాడో చూడు అని చెప్తాను. నువ్వు చెప్పింది అబద్ధం నేను చెప్పిందే నిజం అని దేవిని నమ్మి స్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదని తన కన్నింగ్ ప్లాన్ రాధకి చెప్పి వెళ్ళిపోతాడు.