బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోపై నెటిజన్లు జోరుగా సెటైర్లు వేస్తున్నారు. మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఫోటోలో ఏముంది? ఎందుకు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


దీపిక షేర్ చేసిన ఫోటోపై నెటిజన్ల ట్రోలింగ్


దీపికా పదుకొణె తన సినీ కెరీర్ ను మొదలు పెట్టి తాజాగా 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. పలువరు సినీ సెలబ్రిటీస్  కూడా  ప్రత్యేకంగా విష్ చేశారు. దీపిక ఇప్పటి వరకు చేసిన సినిమాల పోస్ట‌ర్ల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసిన అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా దీపిక కూడా తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీస్ లో పలు చిత్రాలకు పని చేసిన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల కారణంగానే ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.


హైలెట్​గా నిలిచిన రణబీర్ ఫోటో


దీపిక తన కెరీర్ కు సంబంధించి షేర్ చేసిన ఫోటోల్లో తన మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఫోటో హైలైట్​గా నిలిచింది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రణబీర్ కపూర్‌ ను దీపిక ఇంకా మర్చిపోవట్లేదంటున్నారు. అందుకే, అందుకే అత‌డి ఫోటోను చాలా ప్రేమగా షేర్ చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. మాజీ బాయ్ ఫ్రెండ్ ఫోటోను షేర్ చేసిన దీపిక త‌న భర్త రణవీర్ సింగ్‌తో ఉన్న ఒక ఫోటోని కూడా ఎందుకు చేర్ చేయలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం దీపిక ఫోటో వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


దీపికకు మద్దతుగా అభిమానులు


దీపికపై నెటిజన్లు చేస్తున్న విమర్శలను ఆమె అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ట్రోలర్స్ సంకుచిత మనస్తత్వానికి ఈ కామెంట్స్ నిదర్శం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయం సందర్భాన్ని బట్టి ఆలోచన విధానం మారాలని హితవు పలుకుతున్నారు. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికైనా కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మానుకోవాలంటున్నారు. రణ్ వీర్ తో పెళ్లికి ముందు దీపికా పదుకొణె ర‌ణ‌బీర్ ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ కలిలసి చాలా కాలం ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. రణబీర్ కత్రినాతో క్లోజ్ గా ఉండటం వల్లే దీపిక బ్రేకప్ చెప్పిట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత దీపిక కొన్నాళ్లు బాయ్​ఫ్రెండ్స్​ను మారుస్తూ.. డిప్రెషన్​లోకి వెళ్లినట్లు తాజాగా ప్రసారమైన కాఫీ విత్ కరణ్​లో తెలిపింది. ప్రస్తుతం రణబీర్ ఆలియా భట్​ను పెళ్లి చేసుకోగా, కత్రినా కైఫ్ విక్కీ కౌషల్​తో మూడు ముళ్లు వేయించుకుంది.   


Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!