మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం.. RC15 టైటిల్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. 


ప్రస్తుతం దిల్ రాజు 'వారసుడు' సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత చరణ్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లేదా.. ముంబైలలో ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి పాన్ ఇండియా లెవెల్ లో కొందరు గెస్ట్ లను తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు అయితే కన్నడ స్టార్ యష్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథులుగా కన్ఫర్మ్ అయ్యారు. 


ఈ లిస్ట్ లో మరింత మంది జాయిన్ కానున్నారు. ఎవరూ ఊహించని రేంజ్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు రాకుండానే ఈ పాన్ ఇండియా సినిమా బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. సినిమా ఓవర్సీస్ హక్కులను సుమారు రూ.15 కోట్లు పెట్టి దక్కించుకుంది ఓ సంస్థ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేట్రికల్ హక్కుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 


నవంబర్ మొదటివారంలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. దీనికోసం టీమ్ మొత్తం న్యూజిలాండ్ కి వెళ్లబోతుంది. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీలపై పాటను చిత్రీకరించనున్నారు. దాదాపు పదిరోజుల పాటు ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. న్యూజిలాండ్ లో రకరకాల ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. నిజానికి మొదట బడ్జెట్ అనుకున్నప్పుడు శంకర్ ఈ పాట గురించి చెప్పలేదట. 


ఇప్పుడు ఈ ఒక్క పాట కోసం దిల్ రాజు అదనంగా రూ.8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలు ఎంత లావిష్ గా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలు హిట్ అయినా.. అవ్వకపోయినా.. పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. విజువల్స్ వండర్స్ గా నిలుస్తుంటాయి. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా కొన్ని పాటలను అలానే ప్లాన్ చేశారు శంకర్. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 


ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 


Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్