బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి పీఠాలెక్కారు. కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లీపై కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ పెళ్లిపై ఓ పిర్యాదు  వెళ్లింది. ఎందుకు అంటారా? అక్కడి స్థానికులే వీరి వివాహం జరిగిన తీరుపై ఫిర్యాదు చేశారు. 


కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న(గురువారం) రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుకపై కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కత్రినా, విక్రీ రాయల్ వెడ్డింగ్ పై రోజుకో వార్త బయటికొస్తూనే ఉంది. ఇవాళే వెడ్డింగ్ కూడా అయిపోయింది.


రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో  వివాహం జరిగింది.  అయితే వీరి పెళ్లి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే ప్రముఖ చౌత్ మాత మందిరం ఉంది. వీరి పెళ్లి కోసం మందిరానికి వెళ్లే దారిని మూసేశారు. రోజు వందల మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే వీరి వెడ్డింగ్ అయ్యే వరకు ఆ రోడ్డులో భక్తులెవరికీ ఎంట్రీ లేదని.. ఆంక్షలు పెట్టారు నిర్వాహకులు. డిసెంబర్ 6 నుంచి 12 వరకు ఆలయానికి వెళ్లే దారిని హోటల్ యాజమాన్యం మూసివేసింది. దీంతో స్థానికులు చిర్రెత్తుకొచ్చింది.  దేవుడి కంటే గొప్పొళ్లా అని ఫైర్ అయ్యారు.


నేత్రబింద్ సింగ్ జడౌన్ అనే లాయర్.. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదనుకోండి. హోటల్ లోకి ఎంట్రీ లేకుండా ఉంటే.. పర్లేదు. ఆ హోటల్ ని పెళ్లి కోసం ఎంత వాడుకున్నా.. పర్లేదు.. కానీ రోడ్డు మెుత్తాన్ని బ్లాక్ చేయడమేంటని.. నేత్రబింద్ సింగ్ వాదన.  చౌత్ మాత దేవాలయం ఒక చారిత్రాత్మక దేవాలయమని, రోజువారీ హారతికి హాజరయ్యేందుకు అనేక మంది భక్తులు వస్తారని న్యాయవాది నేత్రబింద్ సింగ్ జాడౌన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీని కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.


అయితే మరోవైపు కత్రినా-విక్కీ కౌశల్ వివాహం జరిగింది. ఈ ఫిర్యాదుపై మాత్రం ఎటూ తేలలేదు. ఇంకో రెండ్రోజులు హోటల్ నిర్వాహకులు.. ఆలయానికి వెళ్లే దారిని మూసి వేస్తారా? లేదా తెరుస్తారా చూడాలి.


Also Read:  కత్రినా-విక్కీ.. పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. కొత్త జంట భలే ముచ్చటగా ఉంది!


Also Read: కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌


Also Read: కత్రినా, విక్కీ కౌశల్ వెడ్డింగ్ కార్డ్ లీక్.. పోస్ట్ వైరల్..


Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ