Zero cuts for Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే ‘గుంటూరు కారం’లో వింటేజ్ మహేష్ ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి.


కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ‘గుంటూరు కారం’ సినిమాకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ జారీ చేయగా తాజాగా సినిమాకి సెన్సార్ యూనిట్ ఎలాంటి కట్స్ చెప్పలేదట. దాదాపు 159 నిమిషాల రన్ టైంతో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.


కాకపోతే సినిమాలో ఓ రెండు సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్‌లోని పదాలను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. 'గుంటూరు కారం' టోటల్ రన్ టైం 2 గంటల 39 నిమిషాలు. అందులో ఫస్టాఫ్ 85 నిమిషాల సెకండ్ హాఫ్ 74 నిమిషాల నిడివితో ఉంటుందని చెబుతున్నారు. అంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్టాఫ్ పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు గుంటూరులో జరగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నంబూరు ఎక్స్ రోడ్స్ గ్రౌండ్ అందుకు ముస్తాబు అవుతోంది.


మొదట ఈ ఫంక్షన్ హైదరాబాద్ సిటీలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా చిత్ర బృందం ఎంపిక చేసుకున్న చోట పోలీసులు అనుమతి నిరాకరించారు.  దాంతో గుంటూరుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని షిఫ్ట్ చేశారు. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read :  మహేష్ బాబు ‘గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్, ఈ సంక్రాంతి పోటీ గట్టిగానే ఉంటుంది కాబోలు!