తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు కారణంగా యువ ఎడిటర్ మృతి చెందారు. 'దళం, దక్ష, అహ నా పెళ్ళంట' ('అల్లరి' నరేష్) సినిమాలతో పాటు కొన్ని వందల సినిమాలకు ట్రైలర్స్ కట్ చేసిన మధు రెడ్డి (Madhu Reddi) ఇకలేరు. చిన్న వయసులో ఆయన ఆకస్మిక మరణం చెందడం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

గుండెపోటుతో మధు రెడ్డి మృతిమధు రెడ్డి స్వస్థలం కరీంనగర్‌. అయితే వృత్తిరీత్యా ఆయన హైదరాబాద్‌ సిటీకి వచ్చారు. మణికొండలో సెటిల్ అయ్యారు. ఈ నెల (ఏప్రిల్) 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్ను మూశారు.

Also Read: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... ఇప్పుడు మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?

చిన్న వయసులో ఎడిటర్‌గా మధు రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి సినిమాలకు ఆయన పని చేశారు. మధు రెడ్డి ఎడిటింగ్ చేసిన 'అగ్ని నక్షత్రం' త్వరలో విడుదల కానుంది.

Also ReadPrakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్

సినిమాలకు మాత్రమే కాదు... ట్రైలర్ ఎడిటర్‌గానూ మధు రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'జగడం', అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'జల్సా' సినిమాలకు ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. మధు రెడ్డి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని సన్నిహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక నుంచి భౌతికంగా మధు రెడ్డి మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు.

Also ReadPeddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్