Yash's Toxic Ladies & Ladies Special Video Released : రాకింగ్ స్టార్ యశ్ అవెయిటెడ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటిస్తుండగా... వారి రోల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బోల్డ్ సీన్స్‌, రొమాన్స్‌తో వీడియో రచ్చ లేపుతోంది. 

Continues below advertisement

లేడీస్ అండ్ లేడీస్...

పిల్లలు ఈ వీడియోకి దూరంగా ఉండేలా చూడాలంటూ పేరెంట్స్‌కు ఫస్టే వార్నింగ్ మెసేజ్‌తో ప్రారంభమైంది ఈ వీడియో. ఆ తర్వాత ఒక్కొక్కరిగా హీరోయిన్స్ రోల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ సాగింది. మధ్యలో వచ్చే బోల్డ్, రొమాంటిక్ సీన్స్ కొంత ఇబ్బంది పెడతాయి. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లతో పాటు హుమా ఖురేషీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

Continues below advertisement

ఒక్క హీరో యశ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్స్‌లో... 'లేడీస్ అండ్ లేడీస్... ఒక్కొక్కరిగా వస్తారా? లేదా ఒకేసారి వస్తారా?...' అంటూ యశ్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. గతంలో హీరో ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ రాయ వీడియోలోనూ బోల్డ్ సీన్స్‌తో యశ్ రచ్చ చేశారు. తాజా వీడియోలో అంతకు మించిన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. 

Also Read : Rao Bahadur Trailer Review : డిఫరెంట్ రోల్స్‌లో సత్యదేవ్ - మహేశ్ బాబు వాయిస్ ఓవర్... రావు బహదూర్ ట్రైలర్ చెప్పిన స్టోరీ

ఇంట్రడ్యూసింగ్ వీడియోతోనే పలు విమర్శలతో పాటు హైప్ క్రియేట్ చేయగా... లేటెస్ట్ వీడియో కూడా అంతకు మించిన స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... పవర్ ఫుల్ రాయగా యశ్ నటిస్తున్నారు. నదియా పాత్రలో కియారా అద్వానీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్, గంగ పాత్రలో నయనతార, ఎలిజిబెత్‌గా హుమా ఖురేషి నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ కానుంది.

స్టోరీ ఏంటంటే?

1940 - 70 టైంలో గోవా బ్యాక్ డ్రాప్‌లో సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. వయలెన్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అందమైన తీర ప్రాంతం చుట్టూ సాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, బార్స్, గ్యాంబ్లింగ్, సిండికేట్స్, మాఫియా నేర సామ్రాజ్యం వీటన్నింటితోనూ పోరాడి ఓ సామాన్యుడు అదే సామ్రాజ్యానికి లీడర్‌గా ఎలా ఎదిగాడు అనేదే స్టోరీ ప్లాట్ అని సమాచారం. కేజీఎఫ్ తర్వాత అంతే స్థాయి పవర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో యశ్‌ను ఎప్పుడు చూస్తామా? అంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read : Rajamouli : నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయా - జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్... వారణాసి షూటింగ్ అప్డేట్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.