Rajamouli Reaction About Hollywood Director James Cameron : హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అంటే దర్శకధీరుడు రాజమౌళికి ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఆయన్ను ఓ సందర్భంలో కలిసిన జక్కన్న... కామెరూన్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. వారణాసి టైటిల్ గ్లింప్స్‌ను చూసిన కామెరూన్... రాజమౌళిని వీడియో కాల్‌లో అభినందించారు. ఇది అప్పట్లో ట్రెండ్ అయ్యింది. తాజాగా కామెరూన్‌పై రాజమౌళి మరోసారి ప్రశంసలు కురిపించారు.
'మంత్ర ముగ్ధున్ని అయిపోయా'
జేమ్స్ కామెరూన్ వర్క్ తనను ఓ చిన్న పిల్లాడిలా థియేటర్లో సినిమా చూసేలా మంత్ర ముగ్ధుడిని చేస్తుందని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. తాజాగా... కామెరూన్ గురించి రాజమౌళిని ప్రశ్నించగా... 'కామెరూన్‌ను చూస్తూనే మంత్ర ముగ్ధుడిని అయిపోయా. ఆయన RRR సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. అది నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది.
మేము AI గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ విషయం నాకు కాస్త భయం కలిగిస్తుంది. అయితే, AI ఎప్పటికీ చలన చిత్ర నిర్మాణాన్ని భర్తీ చేయలేదని కామెరూన్ చెప్పినప్పుడు నాకు ఎంతో ఊరట కలిగింది.' అని అన్నారు.
80 రోజుల్లోనే...
సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వారణాసి షూటింగ్ పూర్తవుతుందని ఇటీవలే చెప్పారు రాజమౌళి. తాజాగా ఆయన పారిస్ పర్యటనలో మరో అప్డేట్ ఇచ్చారు. మరో 80 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుందన్నారు. ప్రస్తుతం జక్కన్న ఈగ ప్రీమియర్స్ సందర్భంగా పారిస్ పర్యటనలో ఉన్నారు. టూర్ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల మూడో వారంలో వారణాసి కొత్త షెడ్యూల్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే మహేశ్ బాబు సైతం వెకేషన్ ట్రిప్‌లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసికి సంబంధించి మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తైందని... కనెక్టింగ్ లింక్స్ స్టోరీ, కొన్ని సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిపారు జక్కన్న.
స్టోరీ ఏంటంటే?
వారణాసి భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ అని అందరూ అనుకుంటున్నప్పటికీ... తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషన్ ఈ కథకు మూలం అని రివీల్ చేశారు రాజమౌళి. ఆఫ్రికా దట్టమైన అడవులు, అంటార్కిటికా చలి, రామాయణంలో దేవుళ్లు, ప్రకృతి విపత్తు వంటి భారీ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. రామాయణంలో శ్రీరాముడు, కుంభకర్ణుడి మధ్య వార్ మూవీకే హైలెట్ అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
సినిమాలో మహేశ్ బాబు రుద్రుడిగా, శ్రీరాముడిగా కనిపించనున్నారు. విలన్ రణకుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Peddi OTT : పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎందుకింత కన్ఫ్యూజన్? - అసలు స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
