'లైగర్' (Liger Movie) సందడి థియేటర్లలో ప్రారంభం కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఒక్కసారి వెనక్కి వెళితే... సినిమా ట్రైలర్ చూశారా? హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) యాటిట్యూడ్, దర్శకుడు పూరి జగన్నాథ్ టేకింగ్ & మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ను నిశితంగా గమనిస్తే... ఇంకో విషయం కూడా ఆకట్టుకుంది. అది ఏంటంటే... విజయ్ దేవరకొండకు రమ్యకృష్ణ కాలితో గట్టిగా ఒక్కటి ఇచ్చే సీన్! సినిమా విడుదలకు ముందు ఆ సీన్ వెనుక ఉన్న కథను విజయ్ దేవరకొండ బయట పెట్టారు.
అనన్యాతో రొమాన్స్...
రమ్యకృష్ణ కిక్ సీన్!
'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. కథానాయికగా అనన్యా పాండే నటించారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందనేది తెలియడానికి ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ చూస్తే చాలు. 'ఆఫత్...' సాంగ్ రొమాంటిగ్‌గా ఉంది. ''ఆ ఆఫత్‌లకు రియాక్షనే ఆ కిక్ సీన్. అమ్మ నన్ను గట్టిగా వేసింది'' అని విజయ్ దేవరకొండ తెలిపారు. అమ్మాయి వెనక పడుతూ కుమారుడు లక్ష్యాన్ని పక్కన పెట్టడంతో తల్లి గట్టిగా ఒక్కటి ఇచ్చిందన్నమాట. 'లైగర్' చిత్ర బృందాన్ని సుమ కనకాల ఇంటర్వ్యూ చేశారు. అందులో ఈ విషయాలు చెప్పారు.
నార్త్‌లో 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' విజయాలపై
విజయ్ దేవరకొండ అండ్ టీమ్ విశ్లేషణ
ఇప్పుడు ఉత్తరాదిలో దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. 'బాహుబలి', 'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్' నుంచి లేటెస్ట్ 'కార్తికేయ 2' వరకూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ సినిమాలు హిందీలో ఎందుకు విజయాలు సాధిస్తున్నాయి? అనే చర్చ వచ్చింది. అప్పుడు ''మనం ఎప్పుడూ నేటివిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్లతో సినిమాలు తీస్తున్నాం. మాస్, అన్నీ ఉండేలా చూసుకుంటున్నాం'' అని దర్శకుడు పూరి జగన్నాథ్ అభిప్రాయ పడ్డారు.
Vijay Devarakonda On RRR and Pushpa Success In North India : 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' విజయాలపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ''రమ్యకృష్ణ గారు రాజమౌళి, పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేశారు కదా! కొంత మంది దర్శకులు సినిమా స్కేల్ ఎంత పెంచినా... ఎమోషన్స్ వదలరని ఆవిడ చెప్పారు. అది వింటే నిజమేనని అనిపించింది. చాలా మంది సినిమా స్కేల్ పెంచుతారు. ఫైట్స్ పెడతారు. అయితే, కోర్ ఎమోషన్ మిస్ అవుతుంది. అందువల్ల, ప్రేక్షకులకు కనెక్షన్ ఉండదు. పూరి గారు ఎంత స్కేల్ పెంచినా... ఆ మాస్, మదర్ అండ్ సన్ ఎమోషన్, లవ్ స్టోరీ మిస్ చేయరు. 'ఇడియట్', 'పోకిరి'లో ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది. కాకపోతే సినిమా స్కేల్ పెరిగింది. 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్', 'పుష్ప' ఇవన్నీ ఎంత పెద్ద స్కేల్‌లో ఉన్నా... ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎందుకు చూశారంటే... కోర్ ఎమోషన్ ఉండేలా చూసుకున్నారు. ఈ దర్శకుల స్పెషాలిటీ అది'' అని చెప్పారు.
ఆగస్టు 25న 'లైగర్' థియేటర్లలో విడుదల అవుతోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా రూపొందింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.