ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) గుర్తు ఉన్నారా? విష్ణు మంచు 'కన్నప్ప'లో హీరోయిన్. అయితే... ఆ సినిమాతో ఆమెకు పెద్దగా పాపులారిటీ రాలేదు. కానీ, ఈ ఏడాది 'బ్లాస్ట్' (తెలుగులో 'బ్లాస్ట్ జోన్'గా విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సినిమా)తో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. అందులో క్యారెక్టర్, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడీ అమ్మాయి పేరు వార్తల్లో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రీతి ముకుందన్ హాట్ టాపిక్ అయ్యారు. అందుకు కారణం ఏమిటో తెలుసా? అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకోవడం. 

Continues below advertisement

ప్రీతికి అల్లు అర్జున్ 'రాకా'లో ఛాన్స్ మిస్!ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సెన్సేషనల్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా 'రాకా' (Raaka Movie). అందులో నటించే అవకాశం ప్రీతి ముకుందన్ చెంతకు వచ్చింది. అయితే... ఆ అవకాశాన్ని ఆమె చేజార్చుకున్నారు. ఆ విషయం ఇప్పుడు ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే...

Also Read: Why Was Rajesh Sharma Hospitalised - ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?

Continues below advertisement

కోలీవుడ్ యంగ్ హీరో, తెలుగులో 'గద్దలకొండ గణేష్' చేసిన అథర్వా (ఒకప్పటి తమిళ్ హీరో మురళీ తనయుడు) నటించిన తాజా సినిమా 'ఇదయం మురళి'. ఆ సినిమాను తెలుగులో 'హృదయం మురళి'గా డబ్బింగ్ చేశారు. జూలై 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. అందులో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు. తమన్ ఓ పాత్రలో నటించడం వల్ల సినిమాకు తెలుగులోనూ బజ్ ఏర్పడింది. అయితే... ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 'రాకా'లో నటించే అవకాశాన్ని ప్రీతి ముకుందన్ మిస్ చేసుకున్నారు.

Also ReadSwathi Srikanth Nagothi Wedding - దర్శకుడితో స్వాతి రెండో పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా

చెన్నైలో జరిగిన 'ఇదయం మురళి' ట్రైలర్ లాంచ్‌లో ''రాకా'లో కీలక పాత్ర కోసం ప్రీతి ముకుందన్‌ను సంప్రదించాను. అయితే, అప్పుడు 'ఇదయం మురళి' షూట్‌లో బిజీగా ఉంది. దాంతో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక మా సినిమాను ఆమె వదులుకోవాల్సి వచ్చింది'' అని అట్లీ వివరించారు. అదీ సంగతి. ప్రీతి ముకుందన్ నటన తనకు ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సినిమా, అదీ అట్లీ వంటి దర్శకుడితో సినిమా చేసే అవకాశం ప్రతి రోజూ రాదని, ఆ ఛాన్స్ మిస్ అయినందుకు తనకు ఎంతో బాధగా ఉందని ప్రీతి ముకుందన్ తన నిరాశను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం మళ్ళీ తప్పకుండా వస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ 'రాకా'లో ప్రీతి ముకుందన్ మిస్ చేసుకున్న పాత్రను ఫాతిమా జార్జ్ చేస్తున్నారు. 'బ్లాస్ట్ జోన్' విజయం తర్వాత 'హృదయం మురళి'తో ప్రీతి ముకుందన్ మరో విజయం అందుకుంటారో? లేదో? చూడాలి. ఇందులో ఫహాద్ ఫాజిల్, నిహారికా ఎన్ఎమ్ కూడా నటించారు.

Also ReadAnasuya Saree Trend - చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా??